ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజను
ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. రంగారెడ్డి జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 6 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం ఇబ్రహీంపట్నం పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.
ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
వివరాలు
మార్చుఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]
పరిపాలన
మార్చుఇబ్రహీంపట్నం డివిజన్‌లోని మండలాలు:[5]
క్ర.సం | ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | హయాత్‌నగర్ మండలం | 6 రెవెన్యూ గ్రామాలు |
2 | అబ్దుల్లాపూర్‌మెట్ మండలం | 35 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు) |
3 | ఇబ్రహీంపట్నం మండలం | 31 రెవెన్యూ గ్రామాలు (5 నిర్జన గ్రామాలు) |
4 | మంచాల్ మండలం | 24 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు) |
5 | యాచారం మండలం | 19 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామాలు) |
6 | మాడ్గుల్ మండలం | 15 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామాలు) |
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 2022-09-30.
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-09-30.
- ↑ "DIVISIONS | RangaReddy District Government of Telangana | India". Archived from the original on 2021-11-27. Retrieved 2022-10-01.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.