ప్రధాన మెనూను తెరువు

హయాత్‌నగర్‌ మండలం

తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం

హయత్‌నగర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

హయాత్‌నగర్‌
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో హయాత్‌నగర్‌ మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో హయాత్‌నగర్‌ మండలం యొక్క స్థానము
హయాత్‌నగర్‌ is located in తెలంగాణ
హయాత్‌నగర్‌
హయాత్‌నగర్‌
తెలంగాణ పటములో హయాత్‌నగర్‌ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°19′37″N 78°36′17″E / 17.327042°N 78.604717°E / 17.327042; 78.604717
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము హయాత్‌నగర్‌
గ్రామాలు 28
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 2,27,195
 - పురుషులు 1,16,368
 - స్త్రీలు 1,10,827
అక్షరాస్యత (2011)
 - మొత్తం 64.57%
 - పురుషులు 75.25%
 - స్త్రీలు 52.60%
పిన్ కోడ్ 501505

ఇది హైదరాబాదుకి 25 కి.మీ. దూరంలో హైదరాబాదు నుండి విజయవాడ వెళ్ళే దారిలో రామోజీ ఫిల్మ్ సిటీకి 5 కి.మీ. సమీపంలో ఉంది. ఈ మండలంలో 6 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఇది ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

విషయ సూచిక

హయాత్‌బక్షీ మసీదుసవరించు

 
హయత్ నగర్ దృశ్యాలు
 
హయాత్‌బక్షీ మసీదు

హైదరాబాద్ నగర శివారులోని హయాత్‌నగర్ లోని చారిత్రాత్మక కట్టడమే హయాత్ బక్షీ మస్జిద్. గోల్కొండను పాలించిన ఐదవ సుల్తాన్ మహమ్మద్ భార్య హయాత్‌బక్షీ బేగం. సుల్తాన్ తన భార్య కోరిక మేరకు ఈ మసీదు నిర్మించి ‘హయాత్‌బక్షీ మసీద్’గా నామకరణం చేశాడు. ఇదే పేరు మీద అక్కడి ప్రాంతాన్ని ‘హయత్‌నగర్’గా పిలుస్తున్నారు. మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును అరబ్ శైలిలో నిర్మించారు. మసీదుకు 5 ఆర్చ్‌లు, 2 మినార్‌లు ఉన్నాయి. మసీదు చుట్టూ 140 ఆర్చ్ గదులున్నాయి. ఒకేసారి రెండు వేల మంది ఇక్కడ నమాజ్ చేయవచ్చు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ మసీదు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. చాలా వరకు ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానాల్లో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ప్రజలు అటు పట్టణ, ఇటు పల్లెటూరు జీవన విధానాలను అలవర్చుకున్నారు.

మండల సమాచారంసవరించు

 
హయత్ నగర్ దృశ్యాలు రామోజి ఫిల్మ్ సిటీ ముఖ ద్వారం
  • భాషలు:తెలుగు/ఉర్దూ
  • సముద్ర మట్టం నుండి 505 మీటర్లు ఎత్తులో ఉంది.
  • టెలిఫోన్ యస్.టి.డి.కోడ్:08415
  • వాహన రిజిష్ట్రేషన్ సంఖ్యలు:AP- 28, AP- 29
  • ప్రాంతీయ రవాణా అధికారి కార్యాలయం:రంగారెడ్డి

మండలంలోని కళాశాలలు,ఇతర సంస్థలుసవరించు

  • వర్డ్స్ అండ్ డీద్ జూనియర్ కళాశాల. హయత్ నగర్.
  • ప్రభుత్వ జూనియర్ కళాశాల. హయత్ నగర్.
  • విజయ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, రేడియో స్టేషన్ ఎదురుగా, సాయినగర్ కాలని, 2 వ ఫేస్.
  • ఆంధ్రా బాంకు, హయత్ నగర్ ( Ifsc Code ANDB0001245, micrCode 500011110)

మండల గణాంకాలుసవరించు

 
హయత్ నగర్ దృశ్యాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 2,27,195 - పురుషులు 1,16,368 - స్త్రీలు 1,10,827

రవాణా సౌకర్యాలుసవరించు

ఈ గ్రామము విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి పైనున్నందున ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది. ఇక్కడికి 10 కి.మీ. లోపు రైల్వే స్టేషను లేదు. కాని మలకపేట రైల్వేస్టేషను, కాచిగూడ రైల్వే స్టేషనులు సమీపములో ఉన్నాయి. ప్రధాన రైల్వేస్టేషను సికింద్రాబాద్ ఇక్కడికి 18 కి.మీ దూరములో ఉంది.

మండలంలోని పట్టణాలుసవరించు

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు