ఇస్మత్ చుగ్తాయ్
ఇస్మత్ చుగ్తాయ్ (ఉర్దూ: عصمت چغتائی) సుప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి. ఈమె సంస్కారధోరణి కలిగిన ముస్లిం కుటుంబంలో 1915, ఆగస్టు 21వ తేదీన జన్మించింది. అలీగఢ్ లో మిషనరీ స్కూలులో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఆగ్రాలో ఉన్నత విద్యను అభ్యసించి బి.ఎ., బి.టి. పట్టాలను పొందింది. దేశంలో బి.టి. పట్టా పుచ్చుకున్న తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందింది. ఆగ్రాలో చదువు కుంటున్నప్పుడే ఈమె షాహిద్ లతీఫ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఉర్దూ రచయిత్రిగా ఈమె భారతీయ సాహిత్యానికి ఒక కొత్త దిశను చూపించింది. ఈమె ఎన్నో నవలలు, కథలు, రేడియో నాటికలు వ్రాసింది. ఈమె వ్రాసిన కథల ఆధారంగా గరం హవా, అర్జూ, మైడ్రీమ్స్, లీహాఫ్ సినిమాలు వచ్చాయి. ఈమె వ్రాసిన లీహాఫ్ కథలో అశ్లీలత ఉందని లాహోర్ కోర్టులో కేసు వేసిన బ్రిటీష్ ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొని కేసు నుండి బయట పడింది[1].ఈమె 107వ జయంతిని పురస్కరించుకుని గూగుల్ తన హోమ్ పేజ్‌పై ఆమె చిత్రాన్ని డూడుల్ గా ప్రచురించింది.
ఇస్మత్ చుగ్తాయ్ عصمت چُغتائی | |
---|---|
![]() | |
పుట్టిన తేదీ, స్థలం | బదయూన్, ఉత్తరప్రదేశ్, భారతదేశం | 21 ఆగస్టు 1915
మరణం | 24 అక్టోబరు 1991 ముంబై, భారతదేశం | (వయస్సు 76)
వృత్తి | రచయిత, దర్శకుడు |
భాష | ఉర్దూ |
పూర్వవిద్యార్థి | అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయం |
రచనా రంగం | చిన్న కథలు, నవలలు |
గుర్తింపునిచ్చిన రచనలు | ఇస్మాత్ చుగ్టాయ్ వర్క్స్ |
పురస్కారాలు | పద్మశ్రీ (1976) ఘాలిబ్ అవార్డు (1984) |
జీవిత భాగస్వామి | షహీద్ లతీఫ్ (1941-1967) (అతని మరణం) </ small> |
సంతానం | సీమా సావనీ సబ్రినా లతీఫ్ |
రచనలుసవరించు
- జిద్ది (నవల)
- తేడీ లకీర్ (నవల)
- ఏక్‌బాత్ (నవల)
- మాసూమా (నవల)
- దిల్ కీ దరియా (నవల)
- ఏక్ ఖత్రా ఏ ఖూన్ (నవల)
- ఇన్సాఫ్ ఔర్ ఫరిష్తే (నవల)
- ధనీ బాంకే (నాటిక)
- సైతాన్ (నాటిక)
- కలియా (కథా సంకలనం)
- దో హాథ్ (కథా సంకలనం)
- చోటే (కథా సంకలనం)
- కాగజీ హై పైరహన్ (ఆత్మకథ)
పురస్కారాలుసవరించు
- తేరీ లకీర్ కు గాలిబ్ అవార్డు - 1974
- భారత ప్రభుత్వం చే పద్మశ్రీ పురస్కారం - 1976
- గరం హవా చిత్రానికి ఫిలిం ఫేర్ ఉత్తమ కథ అవార్డు -1975
- సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు - 1982
- ఇక్బాల్ సమ్మాన్ పురస్కారం - 1990
మరణంసవరించు
ఈమె 1991, అక్టోబరు 24న మరణించింది.
మూలాలుసవరించు
- ↑ "మహిళా చెంఘిజ్ ఖాన్ - గోపరాజు నారాయణరావు - సాక్షి ఫన్‌డే -6 మార్చి 2016". Archived from the original on 2016-03-09. Retrieved 2016-03-06.