ఎరపల్లి అనంతరావు శ్రీనివాస్ ప్రసన్న (ఇ.ఎ.ఎస్. ప్రసన్న), భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 1970 దశాబ్దంలో భారతదేశానికి క్రికెట్ లో మంచి సేవలందించాడు. 1976-77 లో ఇంగ్లాండు పర్యటనలో అత్యధిక వికెట్లు సాధించాడు. దేశవాళి క్రికెట్ పోటీ, రంజీ ట్రోఫీలో కర్ణాటకకు నాయకత్వం వహించి 2 పర్యాయాలు గెలిపించాడు. 1962 నుంచి 1978 మధ్యకాలంలో 49 టెస్టులలో భారత జట్టులో ప్రాతినిధ్యం వహించి 735 పరుగులు చేసాడు. అతని అత్యధిక స్కోరు 37 పరుగులు, సగటు స్కొరు 11.48 పరుగులు. బౌలింగ్ లో 189 వికెట్లు సాధించాడు. ఇప్పటికీ అత్యధిక వికెట్లు సాధించిన భారతీయ బౌలర్లలో ఇతను 7 వ స్థానంలో ఉన్నాడు. అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడి, హర్‌భజన్ సింగ్, చంద్రశేఖర్, జవగళ్ శ్రీనాథ్ ల తర్వాత స్థానం ఇతనిదే. బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ 76 పరుగులకు 8 వికెట్లు. ఇన్నింగ్సులో 5 వికెట్లను 10 సార్లు, మ్యాచ్ లో 10 వికెట్లను 2 సార్లు సాధించాడు.

ఇ.ఎ.ఎస్. ప్రసన్న
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎరపల్లి అనంతరావు శ్రీనివాస్ ప్రసన్న
పుట్టిన తేదీ (1940-05-22) 1940 మే 22 (వయసు 84)
బెంగళూరు, మైసూరు సామ్రాజ్యం, బ్రిటీష్ ఇండియా
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగురైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 105)1962 10 జనవరి - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1978 27 అక్టోబర్ - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ఎఫ్.సి. ఎల్.ఎ.
మ్యాచ్‌లు 49 235 9
చేసిన పరుగులు 735 2,476 33
బ్యాటింగు సగటు 11.48 11.90 16.5
100s/50s 0/0 0/2 0/0
అత్యధిక స్కోరు 37 81 22
వేసిన బంతులు 14,353 54,823 586
వికెట్లు 189 957 17
బౌలింగు సగటు 30.38 23.45 18.7
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 10 56 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2 9 0
అత్యుత్తమ బౌలింగు 8/76 8/50 3/29
క్యాచ్‌లు/స్టంపింగులు 18/– 127/– 3/–
మూలం: ESPNcricinfo, 2014 9 నవంబర్
బెంగళూరులోని దొమ్మలూరులోని ఇ.ఎస్.ఐ.హాస్పిటల్ రోడ్డులో ఒక కూడలికి ఇ.ఎ.ఎస్.ప్రసన్న క్రాస్‌ అని పేరు పెట్టారు.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు