ఈడు గోల్డ్ ఎహె
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈడు గోల్డ్ ఎహె 2016లో విడుదలైన తెలుగు హాస్య సినిమా.
కథ
మార్చుబంగార్రాజు పని వెతుక్కుంటూ విజయవాడ చేరుకుంటాడు. అతన్ని పనిలో పెట్టుకునే వారికి కష్టాలు ఎదురవుతుంటాయి. ఆ విషయం తెలియక బంగార్రాజును పనిలో పెట్టుకుంటాడు నారదరావు(పృథ్వీ) . అయితే అతని కష్టాలు మొదలై ఆఫీస్ మూత పడుతుంది. దాంతో బంగార్రాజు హైదరాబాద్‌కు పనికోసం వచ్చినప్పుడు అక్కడ స్కూల్ టీచర్(జయసుధ) పరిచయం అవుతుంది. బంగార్రాజును తన పెద్దకొడుకుగా భావిస్తుంది. జయసుధ చిన్న కొడుకు శ్రీనివాస్ పనిచేసే కంపెనీలోనే బంగార్రాజు పనికి కుదురుతాడు. ఈ క్రమంలో బంగార్రాజు గీత(సుష్మారాజ్)తో ప్రేమలో పడతాడు. కథ ఇలా నడుస్తుండగా తనలా ఉండే సునీల్ వర్మ కారణంగా బంగార్రాజుకు కష్టాలు ఎదురవుతాయి. మహదేవ్(పునీత్ ఇస్సార్) క్రికెట్ బెట్టింగ్‌లో సంపాదించిన డబ్బులను డైమండ్స్‌గా మార్చి ఓ ప్రదేశంలో దాస్తాడు. ఆ ప్లేస్, మహదేవ్, అతని కొడుకు సహదేవ్(చరణ్‌దీప్)కు మాత్రమే తెలుసు. సహదేవ్ ఇంట్లోకి చొరబడిన సునీల్‌వర్మ డైమండ్స్ ఉండే విగ్రహాన్ని కాజేసి మహదేవ్, సహదేవ్‌ల దృష్టి బంగార్రాజుమీదకు మరల్చుతాడు. దాంతో బంగార్రాజు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అసలు సునీల్ వర్మ ఎవరు? చివరకు బంగార్రాజు తన సమస్యలను అధిగమించి సునీల్‌వర్మను పట్టుకొన్నాడా? అనే విషయాలు మిగిలిన కథ.[1]
- సమర్పణ: ఎటివి
- నిర్మాణ సంస్థ: ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్(ఇండియా) ప్రై. లిమిటెడ్
- ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
- చాయా గ్రహణం : దేవ్‌రాజ్
- సంగీతం:సాగర్ మహతి
- నిర్మాత: రామబ్రహ్మం సుంకర
- రచన, దర్శకత్వం: వీరూ పోట్ల
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-24. Retrieved 2016-11-29.