ఈడూ జోడూ

1963 సినిమా

ఈడూ జోడూ అనుపమ చిత్రం బ్యానర్‌పై కె. బి. తిలక్ దర్శకత్వంలో 1963, మే 17 న విడుదలయ్యింది. ఇందులో జగ్గయ్య, జమున ప్రముఖ పాత్రలు పోషించారు.[1]

ఈడూ జోడూ
దర్శకత్వంకె.బి. తిలక్
రచనపినిశెట్టి
నిర్మాతకె.బి. తిలక్
తారాగణంజగ్గయ్య,
జమున,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సూర్యకాంతం
ఛాయాగ్రహణంవి. వి. రాం చౌదరి
సంగీతంపెండ్యాల నాగేశ్వర రావు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1963
భాషతెలుగు

పార్వతమ్మ , సుందరమ్మ మంచి స్నేహితులు. పార్వతమ్మ కూతురు శాంత, సుందరమ్మ కొడుకు వేణు చిన్ననాటి స్నేహితులు. సుందరమ్మ తన కొడుకు వేణుకు శాంతనిచ్చి పెళ్ళి చేయాలని పార్వతమ్మకు మాట ఇస్తుంది. అదే ఊర్లో ఉన్న లక్ష్మీపతి అనే ధనవంతుడి భార్యకు సరైన సమయంలో వైద్య సహాయం అందక మరణిస్తుంది. అప్పటికే చదువులో మంచి ప్రతిభ కనబరుస్తున్న వేణుని పట్నంలో వైద్య విద్యనభ్యసించడం కోసం పంపిస్తాడు. ఎం. బి. బి. ఎస్ పూర్తి చేసుకుని వచ్చిన వేణు శాంత మీద అదే అభిమానం చూపిస్తుంటాడు కానీ సుందరమ్మ మాత్రం శాంతను కోడలిగా చేసుకోవడానికి అంగీకరించదు. ఆ దిగులుతో పార్వతమ్మ మంచం పట్టి మరణిస్తుంది. శాంత పిన్ని రంగమ్మ ఆమెను తన ఇంట్లో ఉండమంటుంది. రంగమ్మ తన కూతురు శోభను వేణు కిచ్చి పెళ్ళి చేయాలని చూస్తుంటుంది. కానీ శోభకు మాత్రం వేణు శాంతను ప్రేమిస్తున్నాడని తెలుసు. తన కూతురు పెళ్ళి చేయడం కోసం రంగమ్మ శాంతను లక్ష్మీపతికిచ్చి పెళ్ళి చేస్తుంది. హౌస్ సర్జన్ పూర్తి చేసుకుని వచ్చిన వేణుకి జరిగిన విషయం తెలిసి మనసు విరిగిపోతుంది. తన తల్లి సుందరమ్మ అందుకు కారణం అని తెలిసి ఆమెను నిందిస్తాడు. ఆ ఊరిలో ఆసుపత్రిలో పనిచేయనని వెళ్ళిపోబోతాడు. కానీ లక్ష్మీపతి కోరిక మేరకు శాంత అతన్ని ఆపుతుంది.

నటవర్గం

మార్చు

నిర్మాణం

మార్చు

చిత్రీకరణ

మార్చు

ఈ సినిమా కొంతభాగం నరసు స్టూడియోస్, ప్రసాద్ ప్రొడక్షన్స్ లో చిత్రీకరించగా చాలా భాగం తిలక్ స్నేహుతుడు, వ్యాపారవేత్త అయిన సి. హెచ్. సుబ్బారావు ఇంటిలో చిత్రీకరించారు.[1]

పాటలు

మార్చు

ఈ చిత్రానికి పెండ్యాల సంగీత దర్శకత్వం వహించగా ఆరుద్ర పాటలు రాశాడు. ఘంటసాల, పి. సుశీల, పి. బి. శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, వసంత పాటలు పాడారు.[2]

  1. ఇదేమి లాహిరీ ఇదేమి గారడీ - ఎడారిలోన పూలుపూచె ఎంత సందడీ - ఘంటసాల, పి.సుశీల
  2. చిరుగాలి వంటిది అరుదైన చిన్నది చెలగాటమాడి - ఘంటసాల, సుశీల
  3. చిరుగాలి వంటిది అరుదైన చిన్నది చెలగాటమాడి తన - ఘంటసాల
  4. పంచర్ పంచరు పంచరు ఆ పంచరు తలకో - పి.బి.శ్రీనివాస్ బృందం
  5. లావొక్కింతయు లేదు ధైర్యంబు (పద్యం) - సుశీల
  6. విష్ణుపాదము మేము విడవము మరి వేరే పేరు - మాధవపెద్ది సత్యం, స్వర్ణలత బృందం
  7. సూర్యుని చుట్టు తిరుగుతుంది భూగోళం ఈ సుందరి చుట్టు తిరుగుతుంది నా హృదయం - పి.బి.శ్రీనివాస్, బి. వసంత

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 M. L., Narasimham (26 January 2017). "Blast from the past: Eedu Jodu - 1963". thehindu.com. The Hindu. Retrieved 14 April 2018.
  2. సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
"https://te.wikipedia.org/w/index.php?title=ఈడూ_జోడూ&oldid=4207056" నుండి వెలికితీశారు