కె.బి. తిలక్ (1926 - 2010) పూర్తి పేరు కొల్లిపర బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర్య సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత.[1]

కె,బి. తిలక్
స్వాతంత్ర్య సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత
జననంకొల్లిపర బాలగంగాధర్ తిలక్
జనవరి 14 , 1926
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు
మరణంసెప్టెంబరు 23, 2010
ప్రసిద్ధి"భూమి కోసం" సినిమా
తండ్రివెంకటాద్రి
తల్లిసుబ్బమ్మ

తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో కొల్లిపర వెంకటాద్రి సుబ్బమ్మ దంపతులకు 1926, జనవరి 14న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్ర్య సమరయోధుడు. ఏలూరులో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. చదువు వదిలి 16 ఏళ్ళ వయస్సులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942లో జైలుకి వెళ్లాడు.

సినిరంగ ప్రవేశం

మార్చు

ముదిగొండ జగ్గన్నశాస్త్రి ప్రోత్సాహంతో ప్రజా నాట్యమండలిలో సభ్యునిగా చేరి అనేక నాటకాలను ప్రదర్శించాడు. మేనమామలు ఎల్.వి.ప్రసాద్, అక్కినేని సంజీవిల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసి, జ్యోతి సినిమాతో అనుకోకుండా దర్శకుడిగా మారాడు. తరువాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ నిర్మాణ సంస్థద్వారా అభ్యుదయ భావాలతో అనేక చలన చిత్రాలు నిర్మించాడు.

అభ్యుదయ భావాలతో సినిమాలు

మార్చు
 1. ముద్దుబిడ్డ (1956)
 2. ఎం.ఎల్.ఏ. (1957)
 3. అత్తా ఒకింటి కోడలే (1958)
 4. చిట్టి తమ్ముడు (1962)
 5. ఉయ్యాల జంపాల (1965)
 6. ఈడుజోడు (1967)
 7. పంతాలు పట్టింపులు (1968)
 8. ఛోటీ బహు, కంగన్ (1971)
 9. భూమి కోసం (1974)
 10. కొల్లేటి కాపురం (1976)
 11. ధర్మవడ్డీ (1982)

విశేషాలు

మార్చు

అవార్డులు, గుర్తింపులు

మార్చు

కె.బి. తిలక్ గారు 2010, సెప్టెంబరు 23న మరణించాడు.[2]

మూలాలు

మార్చు
 1. Anupama Geetala Tilak, Vanam Jwala Narasimha Rao, Haasam Publications, Hyderabad, 2006.
 2. ఈనాడు దినపత్రిక, తేది 24-09-2010