ఈనాడు (2009 సినిమా)
"యూటీవీ" సంస్థతో కలిసి ఈ సినిమాను కమల్ హాసన్ తెలుగు, తమిళ భాషలలో నిర్మించాడు. హిందీ సినిమా ఎ వెన్స్‌డేకు ఇది రీమేక్. ఈ సినిమాలో పాటలు లేవు.
ఈనాడు (2009 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చక్రి తోలేటి |
---|---|
నిర్మాణం | కమల్ హాసన్ |
తారాగణం | వెంకటేష్, లక్ష్మి |
సంగీతం | శ్రుతి హాసన్ |
నిడివి | 106 నిమిషాలు |
భాష | తెలుగు |
పాత్రలు-పాత్రధారులు
మార్చు- కమల్ హాసన్ - సామాన్యుడు
- దగ్గుబాటి వెంకటేష్ - కమీషనర్ ఈశ్వరప్రసాద్
- లక్ష్మి - ప్రధాన కార్యదర్శి
- గణేష్ వెంకట్రామన్ - అరిఫ్ ఖాన్
- భరత్ రెడ్డి - సేతురామన్
- అనూజా అయ్యర్ - నటాషా రాజ్ కుమార్
- పూనమ్ కౌర్ - అనూ సేతురామన్
- సంతాన భారతి - కరంచంద్ లాలా
- శ్రీమాన్ - అరవింద్
సాంకేతికబృందం
మార్చు- దర్శకత్వం: చక్రి తోలేటి
- కథ: నీరజ్ పాండే
- సంగీతం: శృతి హాసన్
- ఛాయాగ్రహణం: మనోజ్ సోని
కథ
మార్చుఓ కామన్ మేన్ (కమల్ హాసన్) హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్ళ దగ్గర బాంబులు పెడతాడు. వాటితో పాటే లకడి-కా-ఫూల్ పోలీస్ స్టేషన్లోనూ ఓ బాంబు పెడతాడు... ఈ విషయాన్ని నగర పోలీస్ కమీషనర్‌కు ఫోనులో తెలియచేస్తాడు. జైల్లో ఉన్న ముగ్గురు ఉగ్రవాదుల్ని, అక్రమంగా మారణాయుధాలు సరఫరా చేస్తున్న వ్యాపారస్తుడినీ జైలు నుండి విడుదల చేసి తనకు అప్పగించాలనే షరతు పెడతాడు. అలా చేయని పక్షంలో నగరంలో తాను పెట్టిన బాంబుల్ని పేల్చేస్తానంటూ బెదిరిస్తాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి వస్తుంది. వారిని విడిచిపెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. మరోపక్క ఈ కామన్ మేన్ ఆచూకీ కోసం పోలీసు వర్గాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటాయి. ఓ కామన్ మేను ఉగ్రవాదుల్ని జైలు నుండి విడిపించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? వారు స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగింది? కామన్ మేన్‌ను పట్టుకోవడంలో పోలీసులు కృతకృత్యులు అయ్యారా లేదా అన్నది పతాకసన్నివేశం.[1]
స్పందన
మార్చు- "కథ పరంగా కథనం పరంగా విశిష్టత సంతరించుకున్నా ప్రేక్షకుల మనసుల్ని గెలవడంలో మాత్రం వెనకబడింది" - జాగృతి వారపత్రిక[1]
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- Eeenadu at Indiaglitz.com
- Review from Early Tollywood.com
- Kamal Hassan-Venky's Eenadu started at Redir.sify.com
- Review Archived 2012-10-21 at the Wayback Machine at Oneindia.in