చక్రి తోలేటి

భారతీయ సినిమా రచయిత, దర్శకుడు, నటుడు, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టు.

చక్రి తోలేటి భారతీయ సినిమా రచయిత, దర్శకుడు, నటుడు, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో పనిచేశాడు.[1][2] నీరజ్ పాండే 2008లో తీసిన ఎ వెన్స్ డే హిందీ చిత్రాన్ని 2009లో తమిళంలో ఉన్నిపోల్ ఒరువన్ పేరుతో, తెలుగులో ఈనాడు పేరుతో తీశాడు. దర్శకుడిగా చక్రికి ఇది తొలి సినిమా. 2012లో బిల్లా 2 అనే గ్యాంగ్ స్టర్ సినిమాకి దర్శకత్వం వహించాడు.[3][4]

చక్రి తోలేటి
జననం
వృత్తిభారతీయ సినిమా రచయిత
దర్శకుడు
నటుడు
విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టు

జీవిత విషయాలు మార్చు

చక్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో జన్మించాడు.

సినిమారంగం మార్చు

కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 1983లో వచ్చిన సాగర సంగమం సినిమాలో తొలిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ తరువాత దాదాపు 14 సినిమాల్లో నటించాడు. సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో ఫిల్మ్, విఎఫ్ఎక్స్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. 2008లో వచ్చిన దశావతారం సినిమాతో మళ్ళీ దక్షిణ భారతీయ సినిమారంగంలోకి వచ్చాడు.

సినిమాలు మార్చు

దర్శకుడిగా మార్చు

సంవత్సరం సినిమా నటులు భాష ఇతర వివరాలు
2009 ఉన్నిపోల్ ఒరువన్ కమల్ హాసన్, మోహన్ లాల్, దగ్గుబాటి వెంకటేష్ తమిళం
2009 ఈనాడు తెలుగు
2012 బిల్లా 2 అజిత్ కుమార్ తమిళం
2018 వెల్ కం టూ న్యూయార్క్ సోనాక్షి సిన్హా, దిల్జిత్ దోసాంజ్ హిందీ
2019 కోలైయుతిర్ కలాం నయన తార తమిళం
2019 ఖామోషి తమన్నా, ప్రభుదేవా హిందీ

నటుడిగా మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
1983 సాగర సంగమం ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్ తెలుగు
1985 చిన్న వీడు చక్రవర్తి తమిళం
1985 మయూరి మయూరి సోదరుడు తెలుగు
2008 దశావతారం సాయిరామ్ తమిళం
2012 బిల్లా 2 గ్యాంగ్ స్టర్ తమిళం

మూలాలు మార్చు

  1. "Billa 2 - 25 days box office collection". Tamilcinema24. Archived from the original on 13 July 2015. Retrieved 11 April 2021.
  2. "A Wednesday's Tamil teaser trailer out". Times of India. 11 April 2009. p. 1. Retrieved 11 April 2021.
  3. "Billa 2 Review - Tamil Movie Billa 2 Review". NOWRUNNING. Retrieved 11 April 2021.
  4. "Review : (2012)". www.sify.com. Retrieved 11 April 2021.

బయటి లింకులు మార్చు