ఈలా గాంధీ

మహాత్మా గాంధీ మనుమరాలు (మణిలాల్ గాంధీ కుమార్తె)

ఈలా గాంధీ (జననం:జూలై 1 1940), మహాత్మా గాంధీ మనుమరాలు. ఈమె శాంతి ఉద్యమకారిణి.[1] ఈమె 1994 నుండి 2004 మధ్య కాలంలో దక్షిణ ఆఫ్రికాలో పార్లమెంటు సభ్యురాలిగా ఉంది. ఈమె దక్షిణాఫ్రికాలో "ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్" తరపున "క్వాజులు" నాటల్ ప్రొవిన్సీ లోని ఇనండా ఫోనిక్స్ ప్రాంతం నుండి పార్లమెంట్ సభ్యులుగా పనిచేసింది. ఆమెకు పార్లమెంట్ కమిటీ సంక్షేమం, ప్రజా సంబంధాల పై పనిచేసే అవకాశం ఇచ్చింది. అదే విధంగా "సర్రొగేట్ మాతృత్వం" పై అడ్ హాక్ కమిటీలో కూడా పనిచేసింది. ఈమె న్యాయ కమిటీలో కూడా సభ్యులుగా ఉండి న్యాయ, చట్ట వ్యవస్థలపై తన సేవలనందించింది.

ఈలా గాంధీ
ఈలా గాంధీ
జననం (1940-07-01) 1940 జూలై 1 (వయసు 83)
విద్యాసంస్థనాటల్ విశ్వవిద్యాలయం
వృత్తిరాజకీయనాయకులు, ఉద్యమకారిణి.
తల్లిదండ్రులుమణిలాల్ గాంధీ
సుశీలా ముశ్రువాలా

ప్రారంభ జీవితం మార్చు

ఈలా గాంధీ దక్షిణ ఆఫ్రికాలో మహాత్మా గాంధీ కుమారుడైన మణిలాల్ గాంధీకి జన్మించింది. ఆమె దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్ సమీపంలోని ఫియోనిక్స్ వద్ద గల ఆశ్రమంలో పెరిగింది.[2] ఆమె నాటల్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ డిగ్రీని పొంది, తరువాత UNISA నుండి సోషల్ సైన్స్ లో బి.ఎ ఆనర్స్ పట్టాను పొందింది.[3] విద్యాభ్యాసం తరువాత ఆమె వెరులం చైల్ట్ కుటుంబ సంక్షేమ సంస్థలో 15 సంవత్సరాలు సామాజిక కార్యకర్తగా పనిచేసింది. ఆమె డర్బన్ శిశు, కుటుంబ సంక్షేమ సంస్థలో ఐదు సంవత్సరాలు తన సేవలను అందించింది.[4] 1991 వరకు ఆమె నాటల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ వుమెన్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ సభ్యురాలుగా విశేష సేవలందించింది. ఆమె రాజకీయ జీవితం "నాటల్ ఇండియానా కాంగ్రెస్"తో ప్రారంభమై ఆ పార్టీలో ఉపాధ్యక్షురాలుగా ఉంది. ఆమె యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (దక్షిణ ఆఫ్రికా), డెస్కాం క్రైసిస్ నెట్ వర్క్,, ఇనాండా సపోర్ట్ కమిటీలలో కూడా పనిచేసింది.[5] వర్ణవివక్ష కారణంగా గాంధీ 1975 నుండి రాజకీయ కార్యక్రమాలకు నిషేధించబడింది. తొమ్మిది సంవత్సరాల కాలం గృహ నిర్బంధంలో గడిపింది. ఆమె అజ్ఞాతంగా తన కార్యకలాపాలను కొనసాగించింది. వర్ణవివక్ష కోసం చేసే పోరాటంలో ఆమె కుమారుడు మరణించాడు.[2] ఆమె యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లో ఒక సభ్యురాలిగా ఫిబ్రవరి 11 1990 న పోల్స్‌మూర్ జైలులో నెల్సన్ మండేలాను ఆయన విడుదలకు ముందు కలిసింది. 1994 ఎన్నికల ముందు ఆమె ట్రాన్‌సిషినల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యురాలిగా కూడా ఉంది..[6]

పార్లమెంటు తరువాత మార్చు

పార్లమెంటులో పనిచేసిన తరువాత, గృహ హింసకు వ్యతిరేకంగా గాంధీ 24 గంటల కార్యక్రమాన్ని అభివృద్ధి చేసింది. గాంధీ అభివృద్ధి ట్రస్ట్‌ను స్థాపించింది. మతపరమైన వ్యవహారాల కమిటీ సభ్యునిగా పనిచేస్తూ నెలవారీ వార్తాపత్రికను పర్యవేక్షించేది. ఆమె మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహ కమిటీ, మహాత్మా గాంధీ డెవలప్మెంట్ ట్రస్ట్ కు అధ్యక్షత వహించింది.[7] ఈలా గాంధీ డర్బన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ ఛాన్సలర్‌గా చాలా సంవత్సరాలు పనిచేసింది.

పురస్కారాలు , గుర్తింపులు మార్చు

ఈలా గాంధీ రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందింది.

మూలాలు మార్చు

  1. "ELA GANDHI". Voices of Resistance. Voices of Resistance. Archived from the original on 24 ఫిబ్రవరి 2018. Retrieved 23 May 2012.
  2. 2.0 2.1 "A Life Committed to Satyagraha: 2002 International Peace Award Recipient Ela Gandhi". Int'l Peace Award: Community of Christ. Community of Christ. Archived from the original on 28 జూలై 2012. Retrieved 23 May 2012.
  3. "Ela Gandhi (July 01, 1940 - )". South Africa: Overcoming Apartheid, Building Democracy. South African History Online. Retrieved 23 May 2012.
  4. Tiara Walters (5 June 2010). "Ela Gandhi" (News article (interview)). Times Live. AVUSA, Inc. Retrieved 23 May 2012.
  5. "Ela Gandhi". South African History Online. South African History Online. Retrieved 23 May 2012.
  6. "Ela Gandhi". South African History Online. South African History Online. Retrieved 23 May 2012.
  7. "Durban Living Legend - Ela Gandhi". Ulwazi. ulwazi.org. Archived from the original on 12 మార్చి 2012. Retrieved 23 May 2012.
  8. http://www.thehindu.com/news/national/ela-gandhi-honoured-in-south-africa/article5620913.ece

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఈలా_గాంధీ&oldid=3979558" నుండి వెలికితీశారు