ఉండవల్లి గుహలు

గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామం పరిధిలో ఉన్న గుహలు

ఉండవల్లి గుహలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలో ఉన్నాయి.విశ్వకర్మ స్థపతిలచే భారతీయ శిల్పశాస్త్రం ప్రకారం పెద్దశిలను తొలచగా ఏర్పడిన పురాతన గుహాలయాలకు ఇవి ఒక ఉదాహరణగా అవి ఒక గుర్తులాంటివి.ఈ గుహలు విజయవాడ నుండి 6 కి.మీ. దూరంలో, గుంటూరు నగరానికి 22 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక కట్టడాలలో ఇది ఒకటి.[1]

ఉండవల్లి గుహలు
ఉందవల్లి గుహలలో అతిపెద్దది
Map showing the location of ఉండవల్లి గుహలు
Map showing the location of ఉండవల్లి గుహలు
Map showing the location of ఉండవల్లి గుహలు
Map showing the location of ఉండవల్లి గుహలు
ప్రదేశంఉండవల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
పరిశోధన420 - 620 AD

చరిత్ర మార్చు

ఈ గుహలు 7 వ శతాబ్దానికి చెందినవి.ఇందులో 4 వ -5 వ శతాబ్దానికి చెందిన గుప్తులకాలంనాటి శిలా నిర్మాణాలును చూడవచ్చు.గుప్తుల చక్రవర్తిలో ఎక్కువ మంది వైష్ణవులు కాబట్టి, నరసింహ, విష్ణు, రామాయణ కథలకు చెందిన అనేక శిల్పాలను మనం చూడవచ్చు. గుప్తుల సా.శ. 420-620 నాటి విష్ణుకుండిన రాజులతో సంబంధం కలిగి ఉన్నారు.ఈ గుహలు అనంత పద్మనాభస్వామి, నరశింహస్వామి దేవతలకు అంకితం చేయబడ్డాయి.[2] జైనులు, బౌద్ధ సన్యాసులు తరువాత వీటిని విశ్రాంతి గృహాలుగా ఉపయోగించారు.[3]

కాలక్రమం మార్చు

ఈ గుహలు సా.శ. 4 నుండి 5 వ శతాబ్దాలలో ఘన ఇసుకరాయితో ఉన్న ఒక కొండపై చెక్కబడ్డాయి.[4] ఇక్కడ అనేక గుహలు ఉన్నాయి. నాలుగు అంతస్తులు కలిగిన ఒక గుహలో, బాగా తెలిసిన గుహలలో ఒకటైన  రెండవ అంతస్తు లోపల ఒకే నల్లరాయి ఫలకంపై  విశాలమైన భంగిమలో విష్ణువు భారీ విగ్రహాం చెక్కబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక బౌద్ధ కళాఖండాలు, స్థూపాలను హిందూ దేవాలయాలు, దేవతలుగా మార్చారని చెప్పటానికి  ఉండవల్లి ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇది మొదట ఉదయగిరి, ఖండగిరి నిర్మాణాన్ని పోలి ఉండే హిందూ గుహ.విష్ణుకుండిన రాజుల పాలనలో ఈ గుహలు సా.శ. 4-5 వ శతాబ్దం మధ్య చెక్కినట్లు అంచనా వేయబడింది.[5]ప్రధాన గుహ గుప్తుల వాస్తుశిల్పానికి తొలి ఉదాహరణలలో ఒకటిగాచెప్పుకోవచ్చు. ప్రారంభంలో ప్రధానంగా ఇసుకరాయి కొండలలో చెక్కబడిన పురాతన శిల్పాలు, గుహలు ఆనవాలు జైన నివాస ఆకారంలో ఉన్నాయి.[6]ఈ గుహలలో మొదటి అంతస్తు నివాసం ఇప్పటికీ జైన శైలిని కలిగి, విహార జైన సన్యాసులను ప్రదర్శిస్తూ, తీర్థంకరుడు శిల్పాలను కలిగి ఉంటుంది.[7]ఈ గుహలో మొదటి స్థాయిే చెక్కిన విహార బౌద్ధ కళాకృతులు ఉన్నాయి.పురాతన కాలంలో ఈ గుహల ప్రదేశం భిక్షు సన్యాసుల నిలయానికి సముదాయంగా ఉన్నట్లు తెలుస్తుంది.[8] గుహల గోడలుపై చెక్కిన శిల్పాలు నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు చెక్కినట్లు ప్రదర్శిస్తాయి.గుహలు చుట్టూ పచ్చని గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. ఈ పురాతన గుహాలయాల అనేక చక్కటి నమూనాలను కృష్ణా నదికి ఎదురుగా ఉన్న ఎత్తైన కొండ నుండి చూడవచ్చు.

నిర్మాణం మార్చు

ఇది తూర్పు ముఖభాగంతో 29 మీ. పొడవు, 16 మీ. వెడల్పు కలిగిన నాలుగు అంతస్తుల గహాలయం. ప్రతి అంతస్తులో చాలా వైవిధ్యం కనపడుతుంది.క్రింది అంతస్థు అసంపూర్తిగా ఉన్న తక్కువ స్తంభాల కలిగిన పెద్దగదిగా ఉండి, ఇది 8 స్తంభాలు, ముఖభాగంలో 7 తలుపులను కలిగి ఉంది. మొదటి అంతస్తు వెనుక భాగంలో మూడు మందిరాల సముదాయ నిర్మాణంలో, మొదట ప్రతి ఒక్క మందిరం ముందు స్తంభాల హాలుకలిగి ఉంది.ఇవి త్రిమూర్తులకు (శివ, విష్ణు, బ్రహ్మ) అంకితం చేయబడినవి.[9]

గోడలపై ఉన్న శిల్పాలు వైష్ణవ దేవతలను సూచిస్తాయి. రెండవ అంతస్తులో స్తంభాల దీర్ఘచతురస్రాకార మందిరంలో, సర్పం మీద విష్ణుఆకారంలో ఉన్న విగ్రహం ఉంది. శివుడు, వైష్ణవ శిల్పాలు, వైష్ణవ అల్వార్స్ వంటి కొన్ని శిల్పాలు తరువాత చెక్కబడ్డాయి. పై అంతస్తు మూడు పుణ్యక్షేత్రంతో అసంపూర్ణంగా ఉంది. కొన్ని శిల్ప నమూనాలు చాళుక్యుల కాలానికి కారణమని చెప్పవచ్చు. ఇది 5 మీటర్ల పొడవైన అనంతపద్మనాభ స్వామి విగ్రహాన్ని కలిగి ఉంది.[3]

రవాణా మార్చు

గుహలకు అనుసంధాన ఏకైక మార్గం రహదారి ద్వారా మాత్రమే ఉంది.విజయవాడ, గుంటూరు, అమరావతి నుండి ఈ ప్రదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సర్వీసులను నడుపుతుంది.ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణ నది గుండా టూరిస్ట్ బస్-కమ్-బోట్ సేవలను నడుపుతోంది.[10]

మూలాలు మార్చు

  1. "Archeological Survey of India". web.archive.org. 2017-06-26. Archived from the original on 2017-06-26. Retrieved 2020-10-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. https://www.nativeplanet.com/travel-guide/undavalli-caves-near-vijayawada-002648.html
  3. 3.0 3.1 Nandishwarreddy.s. "Vijayawada - The Place Of Victory". www.andhrawishesh.com (in ఇంగ్లీష్). Retrieved 2020-10-25.
  4. "undavalli caves | undavalli caves History information | Ap TourismTempleindia.info". web.archive.org. 2014-03-09. Archived from the original on 2014-03-09. Retrieved 2020-10-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. Goyal, Anuradha (2017-12-25). "Monolithic Undavalli Caves At Guntur, Andhra Pradesh". Inditales (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-25.
  6. Thapar, Binda (2004). Introduction to Indian Architecture. Singapore: Periplus Editions. p. 10. ISBN 0-7946-0011-5.
  7. "Andhra Pradesh Tourism". India Travel Forum (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-25.
  8. https://www.indiatravelforum.in/threads/andhra-pradesh-tourism.4036/#.UphFOdIW2So
  9. "Archaeological Survey of India". asi.nic.in. Retrieved 2020-10-25.
  10. Varma, P. Sujatha (2017-04-10). "First tourist bus-cum-boat to be functional in a week". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-10-25.

బాహ్య లింకులు మార్చు