ఉజ్జిని యాదగిరిరావు

ఉజ్జిని యాదగిరిరావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. భారత కమ్యునిస్టు పార్టీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు. సీపీఐ పార్టీ తరఫున నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుంచి 2009-2014 వరకు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

ఉజ్జిని యాదగిరిరావు
ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు
In office
2009-2014
అంతకు ముందు వారుపల్లా వెంకట్‌రెడ్డి
తరువాత వారుకూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నియోజకవర్గంమునుగోడు శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1956
గడియగౌరారం, చింతపల్లి మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీభారత కమ్యునిస్టు పార్టీ
జీవిత భాగస్వామివి. పద్మ
తల్లిదండ్రులుఉజ్జిని నారాయణరావు (తండ్రి)
నివాసంహైదరాబాదు, తెలంగాణ

జననంసవరించు

యాదిగిరిరావు 1956లో తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలంలోని గడియగౌరారం గ్రామంలో జన్మించాడు.[3] ఇతని తండ్రి ఉజ్జిని నారాయణరావు, మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుంచి 1985-99 కాలంలో సీపీఐ పార్టీ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[4][5]

రాజకీయ జీవితంసవరించు

తన తండ్రి నుండి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న యాదగిరిరావు, సీపీఐ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నాడు. ముఖ్యనేతగా ఎదిగాడు. 2009లో జరిగిన ఎన్నికల్లో  సీపీఐ, టీడీపీ, సీపీఎం, టీఆర్ఎస్ లు కూటమిగా ఏర్పడడంతో, సీపీఐ పార్టీ అభ్యర్థిగా యాదగిరిరావు పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్ రెడ్డిపై 3,594 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6]

ఎన్నిక వివరాలుసవరించు

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు ఓట్లు ప్రత్యర్థి పేరు ఓట్లు
2009 93 మునుగోడు జనరల్ ఉజ్జిని యాదగిరిరావు 57383 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 53789

మూలాలుసవరించు

  1. "IndiaVotes AC Summary: Munugode 2009". IndiaVotes. Archived from the original on 2020-11-11. Retrieved 2022-04-13.
  2. "Munugode Assembly Constituency". www.onefivenine.com. Archived from the original on 2020-06-30. Retrieved 2022-04-13.
  3. Yadagiri Rao.pdf "Vujjini Yadagiri Rao Affidavits (2009)" (PDF). Archived from the original on 2022-04-13. Retrieved 2022-04-13. {{cite web}}: Check |url= value (help)
  4. Sakshi (13 July 2016). "మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు". www.sakshi.com. Archived from the original on 21 July 2021. Retrieved 2022-04-13.
  5. India, The Hans (2016-07-14). "CPI ex-MLA Narayana Rao". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2016-07-17. Retrieved 2022-04-13.
  6. narsimha.lode (2018-11-29). "కారణమిదే: ఆ స్థానంలో ఇంతవరకు టీడీపీ గెలవలేదు". Asianet News Network Pvt Ltd. Archived from the original on 2022-04-13. Retrieved 2022-04-13.

ఇతర లింకులుసవరించు