ఉదయశంకర్
ఉదయశంకర్, సినిమా దర్శకుడు, రచయిత. 1997లో వచ్చిన పూచుడవ అనే తమిళ సినిమాకి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఉదయశంకర్, 2000లో వచ్చిన కలిసుందాం రా సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది,[1] ఉదయశంకర్ కు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు కూడా వచ్చింది.
ఉదయశంకర్ | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1996–ప్రస్తుతం |
కెరీర్
మార్చు1997లో అబ్బాస్, సిమ్రాన్ జంటగా నటించిన పూచూడవ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.[2] ఆ తరువాత తెలుగులో వెంకటేష్, సిమ్రాన్ జంటగా కలిసుందాం రా సినిమా తీశాడు. 2001లో నరసింహ నాయుడు విడుదలయ్యేవరకు ఈ సినిమా, 70 సంవత్సరాలలో తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది.[3]
తరువాత ప్రేమతో రా సినిమా తీశాడు. ఇది ఆశించినంత విజయం సాధించలేదు. తమిళంలో విజయకాంత్ తో తవసి సినిమా తీశాడు, ఈ సినిమా మిశ్రమ సమీక్షలను అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.[4] తెలుగులో తొట్టెంపూడి గోపీచంద్ హీరోగా రారాజు, రవితేజ హీరోగా బలాదూర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.[5][6] చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ భీమవరం బుల్లోడు సినిమా తీశాడు.
సినిమాలు
మార్చు- పూచుడవ (1997) (తమిళం)
- కలిసుందాం రా (2000) (తెలుగు)
- ప్రేమతో రా (2001) (తెలుగు)
- తవాసి (2001) (తమిళం)
- ఒండగోనా బా (2003) (కన్నడ)
- రారాజు (2006) (తెలుగు)
- బలాదూర్ (2008) (తెలుగు)
- భీమవరం బుల్లోడు (2014) (తెలుగు)
అవార్డులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "47th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-24.
- ↑ "Poochudava - Tamil Movie News and Reviews | Tamil Movie News and Reviews". Tamilmovienow.com. 2012-08-08. Archived from the original on 2014-03-24. Retrieved 2022-07-24.
- ↑ "The Leading Celebrity Profile Site on the Net". celebritiesprofile.info. Archived from the original on 2014-03-24. Retrieved 2022-07-24.
- ↑ "Welcome to". Sify.com. Archived from the original on 2003-11-17. Retrieved 2022-07-24.
- ↑ "Raraju review: Raraju (Telugu) Movie Review - fullhyd.com". Movies.fullhyderabad.com. Retrieved 2022-07-24.
- ↑ "Reviews : Movie Reviews : Baladoor - Movie Review". Telugucinema.com. Archived from the original on 2014-03-24. Retrieved 2022-07-24.
- ↑ "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 2022-07-24.