కలిసుందాం రా
కలిసుందాం...రా ఉదయశంకర్ దర్శకత్వంలో 2000 లో విడుదలైన కుటుంబ కథాచిత్రం. వెంకటేష్, సిమ్రాన్ జంటగా నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించటమే కాక ఉత్తమ తెలుగు చిత్రం గా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్నిఅందుకొంది, వెంకటేష్ కు ఉత్తమ నటుడుగా నంది బహుమతిని అందించింది.
కలిసుందాం రా (2000 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఉదయశంకర్ |
నిర్మాణం | దగ్గుబాటి సురేష్ బాబు |
తారాగణం | వెంకటేష్, సిమ్రాన్ |
సంగీతం | ఎస్. ఎ. రాజ్ కుమార్ |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
చిత్ర కథ సవరించు
హీరో వెంకటేష్ కుటుంబం ముంబాయిలో ఉంటుంది. తన తాతయ్య వీరవెంకట రాఘవయ్య ( కె.విశ్వనాథ్) షష్టిపూర్తి వివాహానికై ఆహ్వానం పంపగా కుటుంబంతో వస్తాడు. అందరినీ ఆటపట్టిస్తూ, సంతోషపరుస్తూ ఉంటాడు. హీరోయిన్ సిమ్రాన్. ఎన్నో చిలిపి తగాదాల తరువాత ఇద్దరూ ప్రేమలో పదతారు. ఊరి ఆనకట్ట విషయంలో చాకచక్యంగా మాట్లాడి అందరి మెప్పు పొందుతాడు. మనవడి వాగ్దాటికి తాత మురిసి తనకు బహుకరించేదుకు గొలుసు తేవడనికి వెళతాడు. ఇంతలో శ్రీ హరి కయ్యానికి కాలు దువ్వుతాడు. ఆగ్రహించిన వెంకటేష్ కూడా గొడవ పడతాడు. అక్కడికి వచ్చిన విశ్వానాథ్ అది చూసి వెంకటేష్ ను కొడతాడు. అవమానంతో సారాయి తాగుతుంటాడు. ఇంతలో రాళ్లపల్లి కలుగ చేసుకొని జరిగిన గతమంతా చెబుతాడు. ఆ గతం తెలుసుకున్న వెంకటేష్ శ్రీ హరి కుటుంబాన్ని, విశ్వానాథ్ కుటుంబాన్ని కలపాలనుకుంటాడు. అంతా కలిశాక సిమ్రాన్ ను శ్రీ హరి అక్క కొడుకుకు ఇచ్చి పెళ్ళి చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. దాంతో ఒకప్పుడు తన తండ్రి ప్రేమ వలన విడిపోయిన కుటుంబం, మళ్ళీ తన ప్రేమ వలన విడిపోకుడదనుకుంటాడు. అందువలన తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటాడు. ఆఖరికి కథ సుఖాంతమోతుంది.
తారాగణం సవరించు
- రఘు గా వెంకటేష్
- అలివేలు మంగ తాయారు గా సిమ్రాన్
- వీరవెంకటరాఘవయ్య గా కె. విశ్వనాథ్
- రంగనాథ్
- శ్రీహరి
- రమాప్రభ
- కల్పనా రాయ్
- వెన్నెరాడై నిర్మల
పాటలు సవరించు
- నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
- మనసు మనసు కలిసిపోయే