ప్రేమతో రా

ఉదయ్ శంకర్ దర్శకత్వంలో 2001లో విడుదలైన చిత్రం

ప్రేమతో రా (ఆంగ్లము: Prematho Raa) విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ లో టి. త్రివిక్రమరావు నిర్మాణ సారథ్యంలో ఉదయ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. వెంకటేష్, సిమ్రాన్ హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. ఉదయ్ శంకర్ దర్శకత్వంలో వెంకటేష్, సిమ్రాన్ హీరోహీరోయిన్స్ గా నటించిన కలిసుందాం రా సినిమా తరువాత వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది.[1]

ప్రేమతో రా
Prematho Raa poster.jpg
దర్శకత్వంఉదయ్ శంకర్
నిర్మాతటి. త్రివిక్రమరావు
రచనపి. రాజేంద్రకుమార్ (సంభాషణలు)
స్క్రీన్ ప్లేఉదయ్ శంకర్
కథభూపతిరాజా
నటులు
సంగీతంమణిశర్మ
ఛాయాగ్రహణంఎస్. గోపాలరెడ్డి
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ
విడుదల
9 మే 2001
నిడివి
154 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

చందు (వెంకటేష్), విజయ్ (సురేష్) అన్నదమ్ములు. ధనవంతుల కుటుంబానికి చెందిన వీరిద్దరిలో పెద్దవాడైన విజయ్ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటుంటాడు. చిన్నవాడైన చందు జులాయిగా తిరుగుతుంటాడు.

విజయ్ సంధ్య (ప్రేమ) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఊటికి వెళ్లిన చందు గీత (సిమ్రాన్) ను చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాడు. కాని అదంత ఈజీ కాదని తెలుసుకున్న చందు, గీతను అకట్టుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటాడు. ఒకరోజు చందు తన ప్రేమను గీతకు చెప్తాడు. గీత అంగీకరిస్తుంది. ఆ సమయంలో ఇద్దరు దగ్గరవుతారు. మరుసటి రోజు గీతకు చెప్పకుండా తన అన్న పెళ్ళికోసం చందు హైదరాబాద్ కి వచ్చేస్తాడు. పెళ్ళి సమయంలో సంధ్య, గీతను తీసుకొచ్చి.. గీత తన చెల్లి అని, చందు మోసం చేశాడని చెపుతుంది. అంతేకాకుండా విజయ్ తో పెళ్ళిని తిరస్కరిస్తుంది.

చందు తన తప్పు తెలుసుకొని, తను చేసిన పనికి పశ్చాత్తాపడుతుంటాడు. సంధ్య దగ్గరికి వెళ్లి, తనను క్షమించమని అభ్యర్థిస్తాడు. దాంతో సంధ్య, చందుకి ఒక అవకాశం ఇస్తుంది. ఆరు నెలలకాలంలో చందు మారితే, చందు గీతల పెళ్ళి చేస్తానంటుంది. చందు మారి గీతను ఎలా ఒప్పించాడు అనేదే మిగిలిన సినిమా.

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ప్రేమతో రా
 
మణిశర్మ స్వరపరచిన సినిమా
విడుదల2001
సంగీత ప్రక్రియపాటలు
నిడివి31:57
రికార్డింగ్ లేబుల్ఆదిత్య మ్యూజిక్
నిర్మాతమణిశర్మ
మణిశర్మ యొక్క ఆల్బమ్‌ల కాలక్రమణిక
ఖుషీ
(2001)
ప్రేమతో రా
(2001)
భలేవాడివి బాసూ
(2001)

సంగీతం మణిశర్మ. అన్ని హిట్ పాటలే. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.

సంఖ్య. పాటసాహిత్యంగానం నిడివి
1. "చందమామతో దోస్తి"  చంద్రబోస్కెకె 5:05
2. "హె దగ దగ"  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుఎస్.పి. బాలు, స్వర్ణలత 4:57
3. "ఏమైందో ఏమో"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలు 5:16
4. "పున్నమిలా"  చంద్రబోస్ఉదిత్ నారాయణ్, సుజాత 4:36
5. "బాబు బత్తాయి"  చంద్రబోస్ఎస్.పి. బాలు, కవితా సుబ్రహ్మణ్యం 5:14
6. "గోపాల"  వేటూరి సుందరరామ్మూర్తిశంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమా, ప్రసన్న, కల్పన 4:21
7. "ప్రేమించడమే"  సిరివెన్నెల సీతారామశాస్త్రిశ్రీనివాస్ 2:09
మొత్తం నిడివి:
31:57

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్, సినిమాలు. "ప్రేమతో రా". telugu.filmibeat.com. Retrieved 8 September 2016.