ఉదయ్ కుమార్
బొమ్మసంద్ర శ్రీనివాసయ్య సూర్యనారాయణ మూర్తి ( 1933 మార్చి 16- 1985 డిసెంబర్ 26), ఉదయ్ కుమార్ అనే తెర పేరు తో ప్రసిద్ధి చెందిన కన్నడ సినిమా నటుడు. ఉదయ్ కుమార్, కళ్యాణ్ కుమార్, రాజ్ కుమార్.[1] లాంటి నటులతో కలిసి నటించాడు ఉదయ్ కుమార్ అనేక పుస్తకాలు రచించాడు. పలు నాటకాల్లో కూడా నటించాడు..[2] ఉదయ్ కుమార్ కన్నడ సినిమాల్లో భావోద్వేగ పాత్ర లలో ఎక్కువగా నటించాడు. ఉదయ్ కుమార్ అప్పటి ప్రముఖ కన్నడ నటులందరితో కలిసి నటించాడు.[3] ఉదయ్ కుమార్ తన సినిమా కెరీర్ ప్రారంభంలో వీరోచిత పాత్రలను పోషించారు, తరువాత ప్రతినాయక పాత్రలను ఎక్కువగా పోషించేవాడు, తరచుగా ఉదయ్ కుమార్ చారిత్రక పౌరాణిక కథలలో రాజ్ కుమార్ విరోచిత వ్యక్తిత్వాన్ని ఎదుర్కొన్నారు. ఉదయ్ కుమార్ నిర్మాతగా రచయితగా నటుడిగా కన్నడ సినిమా రంగంలో పనిచేశాడు ఉదయ్ కుమార్ 1985 డిసెంబర్ 26న మరణించాడు.
ఉదయ్ కుమార్ | |
---|---|
జననం | బొమ్మసంద్ర శ్రీనివాసయ్య సూర్యనారాయణ మూర్తి 1933 మార్చి 16 ధర్మపురి తమిళనాడు భారతదేశం |
మరణం | 1985 డిసెంబరు 26 బెంగళూరు, కర్ణాటక భారతదేశం | (వయసు 52)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు సినిమా దర్శకుడు నిర్మాత రచయిత |
క్రియాశీలక సంవత్సరాలు | 1954–1985 |
భార్య / భర్త | కమలమ్మ (m. 1953) |
పిల్లలు | 5 |
ప్రారంభ జీవితం
మార్చుఉదయ్ కుమార్ 1933 మార్చి 5న ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు (కొన్ని ఆధారాలు 16 మార్చి 1933 అని చెబుతున్నాయి). ఉదయ్ కుమార్ బి. ఎస్. శ్రీనివాసయ్య, శారదమ్మ. ఈ దంపతులకు జన్మించాడు. ఉదయ్ కుమార్ కు ఒక అన్న ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఉదయ్ కుమార్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ మూలాలను కలిగి ఉంది, వారి పూర్వీకులు ఉదయ్ కుమార్ పుట్టక ముందు దాదాపు 200 సంవత్సరాల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కర్ణాటక రాష్ట్రంకు వలస వచ్చారు.
ఉదయ్ కుమార్ బెంగళూరు సర్జాపుర గ్రామానికి సమీపంలో ఉన్న హీలాలిగే, ముత్తనల్లూర్ గ్రామాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు, తరువాత మాధ్యమిక పాఠశాల విద్యను పూర్తి చేశారు. పాఠశాల దశలో ఉదయ్ కుమార్ పాఠశాలలో జరిగే అనేక కార్యక్రమాలు క్రీడా పోటీలలో చురుగ్గా పాల్గొనేవాడు.
ఉదయ్ కుమార్ తన మెట్రిక్యులేషన్ పరీక్షలో ఫెయిల్ అయిన తరువాత కమలమ్మను వివాహం చేసుకున్నారు కమలమ్మను వివాహం చేసుకునే నాటికి ఉదయ్ కుమార్ కు 20 ఏళ్లు. ఆ తరువాత ఉదయ్ కుమార్ పాఠశాలలో వాయామ ఉపాధ్యాయుడిగా పని చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఉదయ్ కుమార్ తన స్నేహితుడి సలహా మేరకు బెంగళూరు నగరానికి మకాం మార్చాడు గుబ్బి వీరన్న నాటక సంస్థలో చేరాడు, అక్కడ ఉదయ్ కుమార్ నటుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. గుబ్బి వీరన్న నాటక సంస్థలో ఉదయ్ కుమార్ అనేక నాటకాలు వేసేవాడు. నాటకాలు వేసిన అనుభవంతో ఉదయ్ కుమార్ కొన్ని రోజుల తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించాడు.
సినీ కెరీర్
మార్చు1954లో కన్నడ సినిమా కథ రచయిత అయిన కనగల్ ప్రభాకర శాస్త్రి, గుబ్బి వీరన్న నాటక సంస్థ వేస్తున్న నాటకాన్ని చూసేందుకు వచ్చాడు. ఆ సమయంలో , ఉదయ్ కుమార్మాండ్య వేదికపై గుబ్బి వీరన్న నాటకంలో బుద్ధుడిగా నటించారు, ఆ సమయంలో కనగల్ ప్రభాకర శాస్త్రి ఉదయ్ కుమార్ ను గమనించి దగ్గరికి పిలిపించి తన ప్రముఖ కన్నడ దర్శకుడు ఎస్. కె. భగవాన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఉదయ్ కుమార్ కు అవకాశం ఇప్పించాడు. కొన్ని రోజుల తర్వాత కనగల్ ప్రభాకర్ శాస్త్రి ఉదయ్ కుమార్ కు సినిమాల్లో రచయితగా అవకాశాలు ఇప్పించారు కొన్ని రోజుల తర్వాత ఉదయ్ కుమార్ సినిమా నిర్మాతగా మారి ఉదయ్ ప్రొడక్షన్స్ ను స్థాపించాడు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా అనేక సినిమాలు నిర్మించాడు.
ఉదయ్ కుమార్ కన్నడలో 171, తెలుగులో 15, తమిళంలో 6, హిందీలో ఒకటి సహా 193 సినిమాలలో నటించాడు. ముఖ్యంగా కన్నడ సినిమాలలో ఉత్తమ నటనకు గాను ఉదయ్ కుమార్ అనేక ప్రాంతీయ జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం. | సినిమా | పాత్ర ( | గమనికలు |
---|---|---|---|
1956 | భాగ్యదయా | ||
1956 | దైవా సంకల్పం | ||
1956 | పంచరత్న | ఈశ్వర | |
1957 | వరదక్షిణే | రఘు | |
1957 | బెట్టడ కల్లా | భైరవ | |
1957 | రత్నగిరి రహస్య | రాజ్కుమార్ చక్రవర్తి | |
1957 | ప్రేమద పుత్రి | ||
1958 | భక్త ప్రహ్లాదుడు | ||
1958 | మానే తుంబిద హెన్నూ | ||
1958 | స్కూల్ మాస్టర్ | రవికుమార్ | |
1958 | సెంగోట్టై సింగం | సింగం | తమిళ సినిమా |
1959 | మహిషాసుర మర్దిని | రామభేశ | |
1959 | వీర్ భాస్కరాడు | తెలుగు సినిమా | |
1960 | యానై పాగన్ | తమిళ సినిమా | |
1960 | దశావతార | కంసా | |
1960 | ఇవాన్ అవనేథాన్ | తమిళ సినిమా | |
1960 | రణధీరా కంఠీరవ | విశ్వనాథ శాస్త్రి | |
1960 | భక్త కనకదాస | ||
1960 | శివలింగ సాక్షి | ||
1961 | మహావత | ||
1961 | విజయనగర వీరపుత్ర | ||
1961 | రాజా సత్య వ్రత | ||
1961 | సీతారామ కళ్యాణం | కుంభకర్ణుడు | తెలుగు సినిమా |
1962 | రత్నా మంజరి | ||
1962 | గాలి గోపురా | కామియో | |
1962 | విధివిలాస | ||
1962 | తాయ్ కరులు | ||
1962 | భూదాన | రాముడు | |
1962 | నంద దీపా | రవి | |
1962 | కరుణే కుటుంబడ కన్ను | రంగన్న | |
1963 | శాంత తుకారాం | ||
1963 | జెను గూడు | రాజన్న | |
1963 | చంద్ర కుమార్ | ||
1963 | వీరా కేసరి | ||
1963 | శ్రీ రామాంజనేయ యుద్ధం | ||
1963 | బెవు బెల్లా | ||
1963 | మానా మెచిడా మడాడి | దేవరాజయ్య | |
1963 | మల్లి మదువే | ||
1964 | అమరశిల్పి జకనాచారి | ||
1964 | చందవల్లియా తోట | శివానంజయ గౌడ | |
1964 | కలావతి | సురేష్ | |
1964 | నందు | కామియో | |
1965 | మిస్ లీలావతి | కపనిపతి రావు | కామియో |
1965 | వీర విక్రమ | ||
1965 | చంద్రహాస | శేఖర్ | |
1965 | కవలేరు కులవండూ | ||
1965 | ఐడియా మహాసుద్దీన | రాజా | |
1965 | మడువే మాడి నోడు | భీమన్న | |
1965 | బెట్టడ హులీ | భైరవ | |
1965 | సతీ సావిత్రి | ||
1965 | సత్య హరిశ్చంద్ర | విశ్వామిత్ర | |
1965 | పాతివ్రథ | ||
1965 | వాత్సల్య | ఆనంద్ | |
1966 | దేవ మానవ | ||
1966 | మధు మాలతి | ||
1966 | సంధ్యా రాగ | రాముడు | |
1966 | కటారి వీరా | ||
1966 | మోహిని భస్మాసుర | శివ. | |
1966 | బడుకువా దరి | ||
1966 | మానే కట్టి నోడు | ||
1966 | మంత్రాలయ మహాత్మె | తిమ్మన్న భట్ | |
1966 | శ్రీ కృష్ణ పాండవీయం | భీముడు | |
1967 | రాజదుర్గద రహస్య | ||
1967 | పడవిధార | ||
1967 | ఇమ్మడి పులకేశి | కుబ్జ విష్ణువర్ధనుడు | |
1967 | పార్వతి కళ్యాణ | నారద | |
1967 | బంగారద హూవు | రవి | |
1967 | సతీ సుకన్య | ||
1967 | రాజశేఖర | జగమల్ల | |
1967 | చక్ర తీర్థ | కాశీపతయ్య | |
1967 | శ్రీ పురందర దాసరు | వ్యాసతీర్థ | |
1968 | హూవు ముల్లు | భీముడు | |
1968 | అరుణోదయ | ||
1968 | సింహా స్వప్న | ||
1968 | అన్నా తమ్మ | ||
1968 | ధూమకేతు | ||
1968 | మైసూర్ టాంగా | ||
1968 | మనేయ్ మహా మందిర | ||
1968 | నమ్మ ఊరు | ||
1968 | జెడారా బాలే | గోపినాథ్ కుమార్ | |
1968 | మహసథి అరుంధతి | ||
1968 | నానే భాగ్యవతి | ||
1969 | చదురంగ | ||
1969 | భలే బసవ | బసవా | |
1969 | మదువే మదువే | ||
1969 | అడే హృదయ అడే మమతే | ||
1969 | మాతృభూమి | ||
1969 | మధుర మిలనా | రమేష్ | |
1969 | కల్ప వృక్ష | ||
1969 | ముకుంద చంద్ర | ||
1969 | ఒడహుట్టిదవరు | సుందర్ | |
1969 | శివ భక్తుడు | ||
1969 | మక్కలే మనేగే మాణిక్య | ||
1969 | భాగీరథి | ||
1970 | తక్కా బిట్రే సిక్కా | ||
1970 | కల్లారా కల్లా | శంకర్ | |
1970 | హాసిరు తోరానా | సూరి | |
1970 | ఆరు మూరు ఓంభట్టు | ||
1970 | మృత్యుంజయ పంచరదళ్ళి గుడారచారి 555 | భాస్కర్ | |
1970 | సెడిగే సెడు | ||
1970 | ముక్తి | ||
1970 | రంగమహల్ రహస్య | కుమార్ | |
1970 | ప్రతీకారా | ||
1970 | మోడాలా రథ్రి | సి. బి. ఐ. హెడ్ | |
1971 | సిడిలా మారి | ||
1971 | బాలే రాణి | ||
1971 | జాతకరత్న గుండ జోయిసా | ||
1971 | బాలే భాస్కర్ | ||
1971 | సంశయా ఫలా | ||
1971 | కాసిద్రే కైలాస | రాముడు | |
1971 | పూర్ణిమ | ||
1971 | సిగ్నల్మాన్ సిద్దప్ప | ||
1971 | మహదీమనే | ||
1972 | కుల్లా ఏజెంట్ 000 | ||
1972 | కాంచ్ ఔర్ హీరా | ||
1972 | నారి మునిడారే మారి | ||
1973 | బెట్టడ భైరవ | ||
1973 | మన్నినా మగలు | ||
1973 | కౌబాయ్ కుల్లా | ||
1973 | భారత రత్న | ||
1973 | త్రివేణి | ||
1973 | ప్రేమా పాషా | ||
1974 | చాముండేశ్వరి మహిమే | ||
1974 | నాను బాలాబేకు | రమానాథ్ | |
1975 | సర్ప కావలు | ||
1975 | ఆశిర్వాదా | ||
1975 | బిలీ హెండ్తి | ||
1975 | జాగృతి | ||
1975 | మంత్ర శక్తి | ||
1976 | సూత్రదా బాంబే | ||
1976 | రాజనర్తకియ రహస్య | ||
1977 | బనశంకరి | ||
1977 | శనిప్రభవ | ||
1977 | హేమావతి | ||
1977 | శ్రీ రేణుకడవి మహాత్మె | ||
1977 | శ్రీమంతన మగలు | ||
1978 | మాతు తప్పడ మాగా | వజ్రాల స్మగ్లర్ | |
1978 | మధుర సంగమ | ||
1978 | పరశురామన్ | ||
1978 | భలే హుడుగ | ||
1978 | దేవదాసి | ||
1979 | పుతాని ఏజెంట్ 123 | ||
1979 | సీతారాము | ||
1980 | వజ్రదా జలపథ | ||
1980 | మరియా నా డార్లింగ్ | మహాదేవ/"రామ్దాస్" | |
1980 | మూగానా సెడు | పాపన్న | |
1980 | చిత్రకూట | ||
1980 | కాళింగ | వినాయక్ పాటిల్ | |
1981 | కుల పుత్ర | ||
1981 | గర్జేన్ | ||
1981 | తయ్య మాదిలల్లి | ||
1982 | సహసా సింహ | చౌదరి | కామియో |
1982 | మావా సోస్ సావల్ | ||
1982 | కెంపు హోరి | ||
1983 | నోడి స్వామి నావిరోడ్ హిగ్ | అపర్ణ తండ్రి | |
1983 | మాగా మహారాజు | తెలుగు సినిమా | |
1983 | భయంకర భస్మాసుర | ||
1983 | దేవర తీర్పు | ||
1983 | కల్లువీనే నూదియితు | ||
1984 | గండు భేరుండా | ||
1984 | అగ్ని గుండం | ||
1984 | కనూనిగే సావల్[4] | పబ్లిక్ ప్రాసిక్యూటర్ | |
1984 | భార్యా | తెలుగు సినిమా | |
1984 | మరియాడే మహలు | ||
1984 | పోలీసు పాపన్న | ||
1984 | ఈ చరిత్ర ఇంకెన్నల్లు | ||
1985 | విశాఖ[5] | కపాల భైరవ | |
1985 | పీతమహా | ||
1985 | హావు ఎని ఆటా | ||
1985 | లక్ష్మీ కటక్ష | నారాయణదాస | |
1988 | వర్ణ చక్రం |
అవార్డులు
మార్చు- 1967-68-ఉత్తమ సహాయ నటుడు
- 1977-78-ఉత్తమ సహాయ నటుడు [6]
మూలాలు
మార్చు- ↑ "TOTAL KANNADA Save Our Movieland "Kannada Cinema FAQs"". totalkannada.com. 2006-09-15. Archived from the original on 2006-09-15. Retrieved 2020-06-17.
- ↑ "Archived copy". popcorn.oneindia.in. Archived from the original on 2 June 2009. Retrieved 13 January 2022.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Archive News". The Hindu. 2006-03-09. Archived from the original on 23 March 2018. Retrieved 2020-06-17.
- ↑ Kanunige Sawal-ಕಾನೂನಿಗೆ ಸವಾಲ್ | Kannada Full Movie | FEAT. Srinivas Murthy,Sujatha, Babay Rekha (in ఇంగ్లీష్), retrieved 2024-02-05
- ↑ Visha Kanya Telugu Full Movie | Sarath Babu | Jayamalini | Jyothi Lakshmi | South Cinema Hall (in ఇంగ్లీష్), retrieved 2023-10-20
- ↑ "Awards". Kalakesari Udaykumar. Archived from the original on 29 March 2016. Retrieved 2020-06-17.