సీతారామ కళ్యాణం (1961 సినిమా)
మరికొన్ని ఇటువంటి పేరులు గల వ్యాసాల కోసం సీతా కళ్యాణం అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి.
సీతారామ కళ్యాణం చిత్రం, సంక్రాంతి కానుక గా1961 జనవరి 6 న విడుదలైన పౌరాణిక చిత్రం. ఎన్. ఎ. టీ. పిక్చర్స్ పతాకంపై నిర్మాత ఎన్. త్రివిక్రమ రావు నిర్మించిన ఈ చిత్రంలో. నందమూరి తారక రామారావు, బి. సరోజాదేవి, హరనాథ్, గీతాంజలి, ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం గాలి పెంచల నరసింహారావు అందించారు. ఎన్. టీ. ఆర్ . దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
సీతారామ కల్యాణం (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నందమూరి తారక రామారావు |
---|---|
నిర్మాణం | నందమూరి త్రివిక్రమరావు |
తారాగణం | హరనాథ్, గీతాంజలి, ఎన్.టి.రామారావు, బి.సరోజాదేవి , చిత్తూరు నాగయ్య, గుమ్మడి, మిక్కిలినేని, కాంతారావు, ఛాయాదేవి, కస్తూరి శివరావు, వల్లభజోస్యుల శివరాం, శోభన్ బాబు, కొమ్మినేని శేషగిరిరావు,కె.జె.సారథి |
సంగీతం | గాలిపెంచల నరసింహారావు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | రవికాంత్ నగాయిచ్ |
కళ | టి.వి.యస్.శర్మ |
నిర్మాణ సంస్థ | ఎన్.ఏ.టి. పిక్చర్స్ |
విడుదల తేదీ | జనవరి 6, 1961 |
భాష | తెలుగు |
ఇది 1961లో విడుదలైన తెలుగు చిత్రం. భూకైలాస్ తరువాత రామారావు ఈ చిత్రంలో రావణ పాత్ర ధరించారు.ఈ సినిమాలో రామారావు పోషించిన రావణ పాత్ర మిక్కిలి ప్రాచుర్యం పొందింది. రావణ తన అభిమాన పాత్రగా ఆ రోజుల్లో ఎన్.టి.ఆర్ చెప్పుకున్నారు (ఆంధ్ర పత్రిక - వారపత్రిక). హరినాథ్ గీతాంజలి శ్రీరామ, సీత పాత్రలు ధరించారు. నారద పాత్ర కాంతారావు ధరించారు. ప్రాచుర్యంలో ఉన్న కథలకు భిన్నంగా రావణుడు, శూర్పణఖలు సీత, రాముల్ని సీతా స్వయంవరం కన్నా ముందే మోహించడం ఇందులో చూపబడింది. ఇందుకు రామారావు గారు ఆశ్చ్యర్య రామాయణం, విచిత్ర రామాయణం వంటి గ్రంథాలను పరిశీలించారు. చిత్రానికి తొలుత ఎస్.రాజేశ్వరరావు పనిచేశారు. రుద్రవీణతో శివుని ప్రసన్నం చేసుకునే సందర్భంలో వచ్చే పాట 'కానరార కైలాస నివాస', 'జటాకటాహ' (శివతాండవ స్తోత్రం - రావణ బ్రహ్మ విరచితంగా చెబుతారు) మొదలైనవి రాజేశ్వరరావు గారు స్వరపరచారు. తెలుగు చిత్రగీతాల్లో 'ఆల్ టైమ్ సూపర్ హిట్' గా చెప్పదగిన 'సీతారాముల కళ్యాణము చూతము రారండి' పాట ఇందులోనిదే. "జానక్యా కమలాంజలీ పుటేయా పద్మ రాగాయతే" అన్న సంస్కృత పదం - "జానకి దోసిట కెంపుల పోగై" వంటి చక్కటి తెలుగుపదంగా మారింది.)
నిర్మాణం
మార్చుచిత్రీకరణ
మార్చుసినిమాకు ఛాయాగ్రాహకునిగా రవికాంత్ నగాయిచ్ వ్యవహరించారు. తర్వాతి కాలంలో ప్రముఖ ఛాయాగ్రాహకునిగా, దర్శకునిగా పేరొందిన రవికాంత్ కి ఇదే తొలి సినిమా.[1]
పాటలు
మార్చుసినిమాకి సంగీత దర్శకత్వం గాలిపెంచల నరసింహారావు వహించారు. 1961లో ఈ సినిమా నిర్మించేనాటికి నరసింహారావు సినిమాల నుంచి విరమించుకుని విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఆ సమయంలో ఆయనని రామారావు సంగీత దర్శకత్వానికి ఒప్పించి ఈ సినిమాకు అజరామరమైన గీతాలు చేయించుకున్నారు.[2]
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
జగదేక మాతా గౌరీ కరుణించవే భవానీ కరుణించవే భవానీ | సముద్రాల రాఘవాచార్య | గాలిపెంచల నరసింహారావు | పి.సుశీల |
సీతారాముల కళ్యాణం చూతము రారండి | సముద్రాల రాఘవాచార్య | గాలిపెంచల నరసింహారావు | పి.సుశీల, బృందం |
- ఇనుప కట్టడాలు గట్టిన మునులె ఐనా కోరి యముతో (పద్యం) - పి.బి. శ్రీనివాస్
- ఓ సుకుమారా నినుగని మురిసితిరా నిను వలచేర - పి.లీల, ఘంటసాల - రచన: సముద్రాల
- కానరార కైలాస నివాస పాలేందుధరా జటాధర - ఘంటసాల - రచన: సముద్రాల
- జయత్వదభ్రవిభ్రమ భ్రమభుజంగ (రావణాష్టకం నుండి) - ఘంటసాల
- జయ గోవింద మాధవ దామోదరా జగదానంద కారణ - ఘంటసాల - రచన: సముద్రాల
- జనకుండు సుతుడును జన్నంబు చేసిన వనితా (పద్యం) - ఘంటసాల - రచన: ధనేకుల
- జగదేక మాతా గౌరీ కరుణించవే భవాని కరుణించవే - సుశీల
- దానవకుల వైరి దర్పంబు వర్ణించు చదువులెవ్వరుగాని (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
- దేవ దేవ పరంధామ నీలమేఘశ్యామా - పి.బి. శ్రీనివాస్
- నెలతా ఇటువంటి నీ మాట నీదు పాట నీ వలపు (పద్యం) - ఘంటసాల - రచన: ధనేకుల
- పరమశివాచార పరులలో అత్యంత ప్రియుడన్న (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
- పాడవే రాగమయీ వీణా పాడవే రాగమయీ - సుశీల
- పొలుపగు బ్రహ్మ వంశమున బుట్టి ఋతుల్ పఠియించి (పద్యం) - పి.లీల
- లక్ష్మీ క్షీరసముద్రరాజ తనయాం (శ్లోకం) - ఎం. ఎస్. రామారావు
- వేయి కన్నులు చాలవుగా వేడుకైన మా సీతను చూడ - పి.లీల
- సరసాల జవరాలను నేనె కదా సరసాల జవరాలను మురిపాలు - పి.లీల
- హే పార్వతీనాధ కైలసశైలాగ్రవాసా శశాంకార్ధమౌళి - ఘంటసాల - రచన: సముద్రాల
- కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంద్యా ప్రవర్తతే (శ్లోకం), ఎం.ఎస్.రామారావు, విశ్వామిత్ర కృతం
- చిరునగవు చిందు మోము తామరల నేలు కనులు (పద్యం), పి.బి శ్రీనివాస్
- నంది నవమానపరచి పన్నగభూష వరమడుగు వేళ(పద్యం), పి.బి.శ్రీనివాస్
- పద్మసినే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయే , ఎం.ఎస్.రామారావు.
- పూని బొమ్మకు ప్రాణము పోయగలరు ఎందు కనరాని(పద్యం), పి.లీల
- భూమికి ప్రదక్షిణము చేసి మూడుమార్లు ఎవడు ,(పద్యం), పి.బి.శ్రీనివాస్
- శ్రీరాఘవం దశరదాత్మజ మప్రమేయం సీతాపతిం, ఎం.ఎస్.రామారావు
- శ్రీరామ రామ త్రీలోఖాభిరామా గుణశీల నీవుగదా (దండకం) ఎం.ఎస్.రామారావు
- షష్టి ర్యోజన విస్తీర్ణం శతయోజన మున్నత , ఎం.ఎస్.రామారావు
- మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాద్మమే, ఎం.ఎస్.రామారావు .
మూలాలు
మార్చు- ↑ "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015.
"నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన
- ↑ "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015.
"నిర్మాతగా ఎన్టీఆర్ కి వజ్రోత్సవం" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- కొల్లూరి భాస్కరరావు గారి ఘంటసాల గళామృతంలో పాటల వివరాలు.