ఉప్పల మల్సూర్
ఉప్పల మల్సూర్ తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు, రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. 1952-56,1962-72 మధ్యకాలంలో సి.పి.ఎం. పార్టీ తరపున సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. 1947 నుంచి కమ్యూనిస్టు పార్టీలో చేరిన మల్సూర్, 1956లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత 1964 నుంచి ఆ కమిటీ ఉపాధ్యక్షుడిగా, తర్వాతి సంవత్సరం నుంచి అధ్యక్షుడిగా పనిచేశాడు.
ఉప్పల మల్సూర్ | |||
మాజీ శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1952-56 – 1962-72 | |||
నియోజకవర్గం | సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1926 సిరికొండ, మోతె మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ | ||
మరణం | 1999, జనవరి 13 సిరికొండ, మోతె మండలం | ||
రాజకీయ పార్టీ | సి.పి.ఎం. పార్టీ | ||
జీవిత భాగస్వామి | లచ్చమ్మ |
జననం
మార్చుమల్సూర్ 1926లో మల్లయ్య - లచ్చమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా, మోతె మండలంలోని సిరికొండలో జన్మించాడు.[1]
వ్యక్తిగత జీవితం
మార్చుమల్సూర్ కు లచ్చమ్మతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. మల్సూర్ జీవించి ఉండగా తన ఐదొందల గజాల స్థలాన్ని పాఠశాలకు ఇస్తానన్న మాట ప్రకారం ఆయన కుమారుడు నెరవేర్చాడు.[2]
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మల్సూర్ సొంత ఇల్లు కూడా లేకుండా బతికాడు. అసెంబ్లీకి ఎన్నికైనా చెప్పులు కుట్టుకునే తన కులవృత్తిద్వారా వచ్చిన డబ్బుతోనే జీవనం సాగించి, చివరిదాకా తన కుల వృత్తి అయిన చెప్పులు కుడుతూ బతికాడు.
తెలంగాణ సాయుధ పోరాటం
మార్చు16 సంవత్సరాల వయసులోనే తెలంగాణ సాయుధ పోరాటంలోకి వెళ్ళాడు. అశ్వదళ సభ్యుడిగానూ, కోటపాడు ఊదర బాంబు దాడిలో కీలకంగా పనిచేశాడు. సాయుధ పోరాటంలో పాల్గొన్నందుకు అరెస్టుకాబడి నల్లగొండ, ఖమ్మం, గుల్బర్గా జైల్లలో శిక్షను అనుభవించి 1951లో విడుదలయ్యాడు.
1965 జనవరి 20న ‘మీసా’ చట్టం క్రింద ప్రభుత్వం అరెస్టు చేయగా, విశాఖపట్నం, హైదరాబాదు జైళ్ళలో ఏడాదికి పైగా శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలయిన తర్వాత ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే ఉద్యమంలో పాల్గొనడంతోపాటు హక్కుల సాధన కోసం పార్టీ పిలుపు మేరకు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.[3]
రాజకీయ జీవితం
మార్చుఉప్పల మల్సూర్, సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం నుండి 1952 నుండి 1972 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశాడు. 1952-56 మధ్య పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున హైదరాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956-57, 1957-62, 1962-67, 1967-72 (సిపిఎం పార్టీ)లో రిజర్వుడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.[4] 1972లో ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. ప్రజాభీష్టంమేరకు తన సొంత గ్రామానికి సర్పంచిగా కూడా పనిచేశాడు.
తాను గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎవరైనా సమస్యతో తన వద్దకు వస్తే అక్కడికక్కడే సంతకం చేసి స్టాంప్ ముద్ర వేసి పంపించేవాడు. ఎల్లప్పుడూ ఆయన జేబులో స్టాంప్, ఇంకు ప్యాడ్ ఉండేది. అందుకే ఆయన్ను అందరూ ప్రేమగా ఇంకు ప్యాడ్ ఎమ్మెల్యే అని అంటుండేవారు.
సంవత్సరం | గెలుపొందిన సభ్యుడు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|
1962 | ఉప్పల మల్సూర్ | సి.పి.ఎం. | 24028 | ఇ.గోపయ్య | కాంగ్రెస్ పార్టీ | 20915 |
1967 | ఉప్పల మల్సూర్ | సి.పి.ఎం. | 27180 | ఎం.మైసయ్య | కాంగ్రెస్ పార్టీ | 23945 |
మరణం
మార్చుమల్సూర్ 1999, జనవరి 13న మరణించాడు.
ఇతర వివరాలు
మార్చుమల్సూర్ సొంతవూరు సిరికొండ గ్రామంలో 2016లో సిరికొండలో విగ్రహం ప్రతిష్ఠించబడింది.[5]
మూలాలు
మార్చు- ↑ Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
- ↑ dishadaily (2020-07-11). "ఐదుమార్లు ఎమ్మెల్యే.. ఆరోసారి సర్పంచిగా.. ఎవరా నేత". www.dishadaily.com. Archived from the original on 2021-01-16. Retrieved 2023-04-26.
- ↑ "ఆదర్శ ప్రజాప్రతినిధి". NavaTelangana. 2022-01-13. Archived from the original on 2022-01-26. Retrieved 2023-04-28.
- ↑ Eenadu (3 November 2023). "మనసున్న నేత.. మల్సూర్". Archived from the original on 3 November 2023. Retrieved 3 November 2023.
- ↑ ABN (2021-01-16). "మల్సూర్ ఆశయాలను కొనసాగించాలి". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-04-26. Retrieved 2023-04-26.