ఉప్పుగూడ
ఉప్పుగూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] ఇది పాతబస్తీలో భాగంగా ఉంది. చారిత్రాత్మక చార్మినార్ నుండి 3.5 కి.మీ.ల దూరంలో, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీస్ నుండి 2.5 కి.మీ.ల దూరంలో ఉంది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నంబరు 27లో ఉంది.[2]
ఉప్పుగూడ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 053 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ఉపప్రాంతాలు
మార్చుఅరుంధతి నగర్ కాలనీ, రాజీవ్ గాంధీ కాలనీ, శివాజీ నగర్, తనాజీ నగర్, చాత్రిమెట్, లలితా బాగ్, భయ్యలాల్ నగర్, అంబికా నగర్, ఛత్రినాక, తోవాలా బస్కావ్, కంద్య బాలక్
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉప్పుగూడ మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు 75ఎ, 75యు, 8యు, 2యు, 9ఎం, 72ఎల్, 67బి బస్సులు నడుపబడుతున్నాయి.[3] ఇక్కడ బస్ డిపో కూడా ఉంది.
ఉప్పుగూడ రైల్వే స్టేషను నుండి ఎంఎంటిఎస్ రైలు సర్వీసు ఉంది. ఇక్కడినుండి ఉమ్దానగర్ (శంషాబాద్), మహబూబ్‌నగర్, వికారాబాద్, నాందేడ్, కర్నూలు, నిజామాబాద్, గుంటూరు, లింగంపల్లి మొదలైన ప్రాంతాలకు వెళ్ళే రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. వెంకటద్రి ఎక్స్‌ప్రెస్, తిరుపతి-హజ్రత్ నిజాముద్దీన్, బెంగళూరు ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎగ్మోర్, బెంగళూరు-హజ్రత్ నిజాముద్దీన్ మొదలైన రైళ్ళు ఈ స్టేషన్ గుండా వెళతాయి.
దేవాలయాలు, మసీదులు
మార్చుఇక్కడ మంగల్ముఖి హనుమాన్ దేవాలయం, మహంకాళి దేవాలయం, నరసింహస్వామి దేవాలయం, కాళికాదేవి దేవాలయం, లలితాంబికదేవి మందిరం, నల్లపోచమ్మ దేవాలయం, ఊరపోచమ్మ దేవాలయం, హనుమాన్ నగర్ అంజనేయ స్వామి దేవాలయం, శివాలయం, సాయిబాబా దేవాలయం, మసీదు-ఇ-బిలాల్ ఉన్నాయి.
ఇతర వివరాలు
మార్చుఇక్కడ అర్మేనియన్ స్మశానవాటిక ఉంది.
మూలాలు
మార్చు- ↑ "Uppuguda Locality". www.onefivenine.com. Retrieved 2021-01-30.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-30.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-30.