ఉమర్జీ అనూరాధ

భారతీయ రచయిత్రి

ఉమర్జీ అనూరాధ తెలుగు సినిమా, జర్నలిజం యొక్క భారతీయ రచయిత్రి. ఆమె భారతదేశంలోని అత్యధిక సర్క్యులేషన్ గల తెలుగు సినిమా పత్రిక అయిన సితార వారపత్రికకు వెండితెర నిర్దేశకులు అనే శీర్షికను అవిరామంగా రాస్తున్నారు. ఆమె ఆలిండియా రేడియో, టెలివిజన్ ఛానళ్ళకు అనేక నాటకాలను రాసారు. ఆమె "పెళ్ళి చేసుకుందాం రా" అనే సీరియల్ ను ఈటీవీ కు, "వైశాలి" సీరియల్ ను జీ తెలుగు ఛానల్ కు, "ఘర్షణ" సీరియల్ ను ఈటీవీకి రాసారు. ఆమెకు అక్కినేని అభినందన పురస్కారం 2010లో ఉత్తమ సంభాషణా రచయితగా అందుకున్నారు. ఆమె "ఏ మాయ చేశావె" సినిమాకు సూపర్ హిట్ ఫిల్ం వీక్లీ పురస్కారం అందుకున్నారు.[1]

ఉమర్జీ అనూరాధ కావూరి
వృత్తిరచయిత
జాతీయతభారతీయులు
విద్యబి.ఎ., ఇంగీషు లిటరేచర్, ఎం.ఎ.తెలుగు
పురస్కారాలుఅక్కినేని అభినందన పురస్కారం (2010లో ఉత్తమ సంభాషణ రచయితగా), సూపర్‌హిట్ ఫిలిం వీక్లీ అవార్డు
భాగస్వామిడా.కావూరి వెంకట శ్రీధర్ కుమార్ (గౌతం కశ్యప్)
సంతానంకుమారుడు, నాహుషి కావూరి

ప్రారంభ జీవితం మార్చు

ఆమె మరాఠీ మాట్లాడే మాధ్వా కుటుంబంలో జన్మించింది. ఆమె మామయ్య రైల్వే స్టేషన్ మాస్టరుగా ఉన్నందున కృష్ణా జిల్లా లోని విజయవాడ, గుంటూరు జిల్లాలోని మంగళగిరి ప్రాంతాలలో విద్యాభ్యాసం చేసారు. ఆమె పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పటి నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేసే వరకు ఆమెకు ఆసక్తి ఉన్న నాటకాలను రచన కొనసాగించారు. ఆమె తల్లిదండ్రులు వేమగంటి సుశీల, జి.నాగరాజన్. ఆమె కొంతకాలం కుప్పురావు శ్రీనివాసరావు అనే రైల్వే స్టేషన్ మాస్టర్ ఇంట్లో పెరిగారు. ఆమె తల్లి వేమగంటి సుశీల కూడా రచయిత్రి, ఆలిండియా రేడియో మద్రాసులో నటి.[1]

జీవితం మార్చు

జర్నలిజం మార్చు

ఆమె తన భర్త శ్రీధర్ కుమార్ తో పాటు ఈనాడు దినపత్రికలో రచనలు చేస్తూ ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆమె భర్త యొక్క స్క్రీన్ పేరు గౌతం కశ్యప్. ఆయన ఈనాడులో ఫోటో జర్నలిస్టుగా పనిచేసేవాడు. తరువాత ఆయన పి.హెచ్.డి కొరకు సినీ నిర్మాత భారతీరాజా వద్ద చేరాడు. అనూరాధ ఈనాడు దినపత్రికకు మొట్టమొదటి మహిళా స్టాఫ్ రిపోర్టరుగా గుర్తింపబడ్డారు. ఆమె ఈనాడు, తమిళనాడు ఎడిసన్ కు ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వహించారు. తరువాత ఆమె భర్త గౌతం కశ్యప్ రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉషాకిరణ్ మువీస్ కొరకు స్క్రిప్ట్ రచయితగా చేరినందున ఆమె హైదరాబాదు బదిలీపై వచ్చారు. ఆమె అనేక ఆర్టికల్స్, కాలమ్స్, వివిధ సినిమా ప్రముఖుల యొక్క చరిత్రలను ఈనాడు సినిమా పేజీలో ప్రచురించడానికి, సితార సినీ పత్రికకు వ్రాసారు. తరువాత ఆమె మహారాష్ట్రకు డెస్క్ ఇన్‌ఛార్జ్ గా పదోన్నతి పొందారు. ఆమె ముంబైలో ఈనాడు పత్రిక స్థాపించడానికి కృషిచేసారు. ఆమె ఈనాడు ముంబై ఎడిసన్ ప్రారంభ వేడుకలను పర్యవేక్షించారు. ఆమె ఈనాడు పత్రికకు స్టాఫ్ రిపోర్టరుగానూ, సినిమా డెస్క్ ఇన్‌ఛార్జ్ గానూ, మహారాష్ట్ర డెస్క్ ఇన్‌ఛార్జ్ గాను తన సేవలనందించారు.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-28. Retrieved 2016-11-17.

ఇతర లింకులు మార్చు