పురస్కారాలు
(పురస్కారం నుండి దారిమార్పు చెందింది)
అంతర్జాతీయస్థాయి పురస్కారాలు
మార్చు- నోబెల్ పురస్కారం: వివ్విధ శాస్త్ర, సాహిత్య, సామాజిక రంగాల్లో విశిష్ట సేవ చేసిన ప్రముఖులకు ఏటా ఇచ్చే పురస్కారం
- బుకర్ బహుమతి: ప్రతి సంవత్సరం సాహిత్యంలో ఉత్తమ నవలకు ఇచ్చే పురస్కారం.
- ఆస్కార్ పురస్కారం: చలచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే పురస్కారం
జాతీయస్థాయి పురస్కారాలు
మార్చు- భారతరత్న: ప్రసిద్ధి చెందిన వ్యక్తులకు ఇచ్చే పురస్కారం
- పద్మ పురస్కారం: పద్మవిభూషణ, పద్మభూషణ, పద్మశ్రీ పురస్కారాలు.
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు: సినిమా రంగ ముఖ్యులకు ఇచ్చే పురస్కారం
- జ్ఞానపీఠ అవార్డు: భారతీయ సాహితీకారులకు ఇచ్చే పురస్కారం
- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు: వివిధ భారతీయ భాషల్లో వచ్చే అత్యుత్తమ పుస్తకాలకు ఇచ్చే ఏటా పురస్కారం
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు:
- జాతీయ సాహస పురస్కారాలు - అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన బాలబాలికలకు భారత ప్రభుత్వం ప్రదానం చేసే అవార్డుల సముదాయం
- అశోక చక్ర పురస్కారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురస్కారాలు
మార్చు- నంది పురస్కారాలు: తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు
- రఘుపతి వెంకయ్య పురస్కారం: జీవిత కాలంలో అత్యుత్తమ కృషి చేసిన తెలుగు సినిమా కళాకారులకు ఇచ్చే పురస్కారం
- రాజాలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం: తెలుగు ప్రముఖులకు ఇచ్చే పురస్కారాలు
- కళాప్రపూర్ణ: కళాకారులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చే గౌరవ డాక్టరేట్.
తెలంగాణ ప్రభుత్వ పురస్కారాలు
మార్చు- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు: ప్రతి సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి అందించే పురస్కాం.[1]
- దాశరథి సాహితీ పురస్కారం: ప్రతి సంవత్సరం దాశరథి కృష్ణమాచార్య జయంతి (జూలై 22) సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యరంగంలో కృషిచేసినవారికి అందజేసే పురస్కారం.[2]
- కాళోజీ సాహిత్య పురస్కారం: ప్రతి సంవత్సరం కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబరు 9) సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ భాషా దినోత్సవం వేడుకలలో భాగంగా భాషా, సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన వారికి అందజేసే పురస్కారం.[3]
మూలాలు
మార్చు- ↑ జనంసాక్షి. "50 మందికి ఆవిర్భావ పురస్కారాలు". Retrieved 28 December 2016.
- ↑ నమస్తే తెలంగాణ (18 July 2018). "ప్రముఖ కవి వజ్జల శివకుమార్‌కు దాశరథి అవార్డు". Archived from the original on 2018-07-26. Retrieved 27 July 2018.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు. "తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి". Retrieved 19 December 2016.[permanent dead link]