ఉమర్ అమీన్

పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు

ఉమర్ అమీన్ (జననం 1989, అక్టోబరు 16) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. 2010 ఆసియా కప్‌లో శ్రీలంకతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[1]

ఉమర్ అమీన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1989-10-16) 1989 అక్టోబరు 16 (వయసు 34)
రావల్పిండి, పంజాబ్, పాకిస్తాన్
ఎత్తు6 ft 0 in (1.83 m)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రటాప్-ఆర్డర్ బ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 200)2010 జూలై 13 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2010 ఆగస్టు 6 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 176)2010 జూన్ 15 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2018 జనవరి 19 - న్యూజీలాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.84
తొలి T20I (క్యాప్ 51)2013 జూలై 27 - వెస్టిండీస్ తో
చివరి T20I2018 జనవరి 28 - న్యూజీలాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.84
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008–2015Rawalpindi Rams
2015/16–2018/19Sui Southern Gas Company
2016; 2021ఇస్లామాబాద్ యునైటెడ్
2017–2018క్వెట్టా గ్లేడియేటర్స్ (స్క్వాడ్ నం. 20)
2019–2020పెషావర్ జాల్మి (స్క్వాడ్ నం. 200)
2019–presentNorthern (స్క్వాడ్ నం. 84)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 4 16 163 153
చేసిన పరుగులు 99 271 10,695 5,353
బ్యాటింగు సగటు 12.37 18.06 41.13 39.07
100లు/50లు 0/0 0/1 28/53 11/29
అత్యుత్తమ స్కోరు 33 59 281 156
వేసిన బంతులు 132 42 3,546 1,025
వికెట్లు 3 0 49 22
బౌలింగు సగటు 21.00 34.30 40.54
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/7 5/67 3/31
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 6/– 130/– 69/–
మూలం: Cricinfo, 2022 డిసెంబరు 10

ఇంగ్లాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు పాకిస్థాన్ జట్టులో అమీన్ కూడా ఉన్నాడు.[2] 2010, జూలై 13న యుకె, లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో తన తొలి టెస్టును ఆడాడు.

జననం మార్చు

అమీన్ 1989, అక్టోబర్ 16న పాకిస్థాన్‌, పంజాబ్, రావల్పిండిలో జన్మించాడు.[3] 2001లో, ఏడవ తరగతిలో అమీన్ యూత్ లీగ్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.

దేశీయ క్రికెట్ మార్చు

పాకిస్తాన్ అండర్19 జట్టుకు ఎంపికయ్యాడు, ఆ తర్వాత అతను పాకిస్తాన్ ఎ స్క్వాడ్‌కి ఎంపికయ్యాడు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ నుండి కూడా పిలుపు అందుకున్నాడు. కెప్టెన్ కమ్రాన్ అక్మల్ నేతృత్వంలోని ఎన్బీపి జట్టులో ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాలో పర్యటించిన పాకిస్థాన్ ఎ జట్టులో అమీన్ సభ్యుడిగా ఉన్నాడు.

2018 ఏప్రిల్ లో, అమీన్ 2018 పాకిస్తాన్ కప్ కోసం సింధు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[4] [5] 2018-19 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో సుయ్ సదరన్ గ్యాస్ కార్పొరేషన్ తరపున తొమ్మిది మ్యాచ్‌లలో 728 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[6] 2019 మార్చిలో, 2019 పాకిస్తాన్ కప్ కోసం సింధు జట్టులోకి ఎంపికయ్యాడు.[7][8]

2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజామ్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం నార్తర్న్ జట్టులో అమీన్ ఎంపికయ్యాడు.[9][10] 2021 జనవరిలో, 2020–21 పాకిస్తాన్ కప్ కోసం నార్తర్న్ జట్టులోకి ఎంపికయ్యాడు.[11][12]

అంతర్జాతీయ క్రికెట్ మార్చు

2010 ఆసియా కప్‌లో శ్రీలంకపై అరంగేట్రం చేసి ఏడు పరుగులు చేయడంతో అమీన్ అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమైంది.[13] భారత్‌తో జరిగిన రెండవ మ్యాచ్‌లో, అమీన్ ఐదు పరుగులు మాత్రమే చేశాడు.[14] చివరి మ్యాచ్‌లో 22 పరుగులు చేశాడు.[15]

అమీన్ ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేసాడు. తన తొలి ఇన్నింగ్స్‌లో ఒక పరుగు సాధించి, రెండవ ఇన్నింగ్స్‌లో 33 పరుగులు చేశాడు.[16] తన టీ20 అరంగేట్రంలో 34 బంతుల్లో 47 పరుగులు చేశాడు.[17]

2013 అక్టోబరు-నవంబరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా అమీన్ పాకిస్థాన్ ఎ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

మూలాలు మార్చు

  1. "Umar Amin set for ODI debut in Asia Cup opener". The News International. 13 June 2010. Archived from the original on 14 అక్టోబర్ 2017. Retrieved 9 అక్టోబర్ 2023. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  2. "Pakistan Name Test & T20 Squads For England Tour". Cricket World. 20 June 2010.[permanent dead link]
  3. "Umar Amin profile and biography, stats, records, averages, photos and videos" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-06-04.
  4. "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 21 April 2018.
  5. "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 21 April 2018.
  6. "Quaid-e-Azam Trophy, 2018/19 – Sui Southern Gas Corporation: Batting and bowling averages". Retrieved 22 November 2018.
  7. "Federal Areas aim to complete hat-trick of Pakistan Cup titles". Pakistan Cricket Board. Retrieved 25 March 2019.
  8. "Pakistan Cup one-day cricket from 2 April". The International News. Retrieved 25 March 2019.
  9. "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 4 September 2019.
  10. "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPNcricinfo. Retrieved 4 September 2019.
  11. "Pakistan Cup One-Day Tournament promises action-packed cricket". Pakistan Cricket Board. Retrieved 7 January 2021.
  12. "Pakistan Cup One-Day Tournament: Fixtures Schedule, Teams, Player Squads – All you need to Know". Cricket World. Retrieved 7 January 2021.
  13. "1st Match: Sri Lanka v Pakistan at Dambulla, Jun 15, 2010 – Cricket Scorecard – ESPN Cricinfo". ESPNcricinfo.
  14. "4th Match: India v Pakistan at Dambulla, Jun 19, 2010 – Cricket Scorecard – ESPN Cricinfo". ESPNcricinfo.
  15. "Afridi's century flattens Bangladesh". ESPNcricinfo.
  16. "1st Test: Australia v Pakistan at Lord's, Jul 13–16, 2010 – Cricket Scorecard – ESPN Cricinfo". ESPNcricinfo.
  17. "1st T20I: West Indies v Pakistan at Kingstown, Jul 27, 2013 – Cricket Scorecard – ESPN Cricinfo". ESPNcricinfo.

బాహ్య లింకులు మార్చు