ఉమామహేశ్వర జలాశయం
ఉమామహేశ్వర జలాశయం అనేది తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూర్ మండలంలోని మైలారం గ్రామ సమీపంలో నిర్మించబడుతున్న జలాశయం.[1]
ఉమామహేశ్వర జలాశయం | |
---|---|
ప్రదేశం | మైలారం, బల్మూర్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా |
స్థితి | నిర్మాణంలో ఉంది |
యజమాని | తెలంగాణ ప్రభుత్వం |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | బ్యారేజి |
జలాశయం | |
సృష్టించేది | ఉమామహేశ్వర జలాశయం |
మొత్తం సామర్థ్యం | 2.5 టీఎంసీలు |
విద్యుత్ కేంద్రం | |
నిర్వాహకులు | తెలంగాణ రాష్ట్రం |
Type | జలాశయం |
ప్రతిపాదన
మార్చునాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్ మండలాల్లోని 57,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంకోసం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 1,534 కోట్ల రూపాయలతో అచ్చంపేట ప్రాంతంలో అచ్చంపేట ఎత్తిపోతల పథకం నిర్మించబడుతోంది.[2]
నల్లమల ప్రాంతం ఎత్తుగా ఉండటంతో అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి నీటిని అందించడంకోసం మొదటి దశ పనుల్లో భాగంగా 2.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఉమామహేశ్వర జలాశయ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి.
నీరు తరలింపు
మార్చుపాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చేపట్టిన ఏదుల గ్రామంలోని వీరాంజనేయ జలాశయం నుంచి 5 టీఎంసీలను ఈ జలాశయానికి తరలిస్తారు. దీని కింద సీఎం అండ్ సీడీ పనులు, అప్రోచ్ ఛానల్, కెనాల్ లైనింగ్ వంటి పనులు చేపడతారు. జలాశయం నుండి రాంపురం రంగాపురం ప్రధాన కాలువ కెనాల్ ఏర్పాటు చేస్తారు. రంగాపురం కెనాల్ కు అనుసంధానంగా బ్రాహ్మణపల్లి పెనిమిళ్ళ కెనాల్ ఉంటుంది. ఏదుల జలాశయం నుంబి 29 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ద్వారా లింగాల మండలంలోని సూరాపూర్ కు నీటిని తరలిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే పంపు వద్ద 83 మీటర్ల ఎత్తున 8 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు పంపుల ద్వారా ఎత్తిపోసిన ఉమామహేశ్వర జలాశయానికి తరలిస్తారు. ప్రతిరోజు 0.1 టిఎంసిల నీటిని ఎత్తిపోస్తూ 30 రోజులపాటు 2.6 7 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పథకానికి రూపకల్పన చేశారు.[3]
మూలాలు
మార్చు- ↑ ABN (2023-05-13). "1534 కోట్లతో అచ్చంపేట ఎత్తిపోతల తొలి దశ". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-05-13. Retrieved 2023-05-23.
- ↑ "'ఉమామహేశ్వర'తో నల్లమలకు సాగునీరు". EENADU. 2023-05-19. Archived from the original on 2023-05-20. Retrieved 2023-05-23.
- ↑ "చిగురిస్తున్న ఆశలు". Sakshi. 2023-05-15. Archived from the original on 2023-05-23. Retrieved 2023-05-23.