ఉలవపాడు

ఆంధ్రప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామం


ఉలవపాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉలవపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది ఒక గ్రామపంచాయితి.ఈ గ్రామం మామిడికాయల పంటకు ప్రసిద్ధి చెందింది.పటం

గ్రామం
పటం
Coordinates: 15°12′N 80°00′E / 15.2°N 80°E / 15.2; 80
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలంఉలవపాడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08599 Edit this on Wikidata )
పిన్‌కోడ్523292 Edit this on Wikidata

సమీపగ్రామాలు మార్చు

మన్నేటికొట 2.5 కి.మీ,ఆత్మకూరు 4.4 కి.మీ,సానంపూడి 5 కి.మీ,చాగల్లు 6 కి.మీ,కరేడు 6.1 కి.మీ.

సమీప పట్టణాలు మార్చు

సింగరాయకొండ 9.9 కి.మీకందుకూరు 11.1 కి.మీగుడ్లూరు 15.7 కి.మీ

ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు, మామిడికాయలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

విద్యా సౌకర్యాలు మార్చు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు

  • ఈ పాఠశాలలో చదువుచున్న ఎస్.కె.అబ్దుల్ షరీఫ్ అను విద్యార్థి, ఇటీవల ప్రదర్శనలో దక్షిణభారత దేశ స్థాయిలో ప్రతిభ కనబరచి, జపానుదేశం సందర్శించే అర్హత సాధించాడు. ఎస్.సి.ఇ.ఆర్.టి. ద్వారా, భారత దేశ సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద ఎంపికచేయబడిన 25 మంది విద్యార్థులలో ఇతడు ఒకడు. ఈ విద్యార్థులందరూ మే/2015 లో జపానులో నిర్వహించు యూత్ ఎక్ఛేంజ్ కార్యక్రమంలో పాల్గొంటారు.
  • ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న టి.మహేష్ కుమార్ అను విద్యార్థి, 2015,డిసెంబరు-21వ తేదీనాడు కర్నూలులో నిర్వహించిన పైకా ఫుట్ బాల్ పోటీలలో తన ప్రతిభ ప్రదర్శించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనాడు.

మౌలిక వసతులు మార్చు

బ్యాంకులు మార్చు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

  • శ్రీ జాలమ్మ తల్లి ఆలయం
  • శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం
  • వేణు గోపాల స్వామి దేవాలయం.

గ్రామ ప్రముఖులు (నాడు/నేడు) మార్చు

అభ్యుదయ కళాకారుడు గంజి వెంకటేశ్వర్లు, ఉలవపాడు మండలానికి చెందిన వారే. వీరు నాటకాలలో హాస్యనటుణిగా పేరుపొంది, సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, జి.వరలక్ష్మి, హరనాథ్ వంటి సినీ ప్రముఖులచే పురస్కారాలు అందుకున్నారు. 2014, అక్టోబరులో ఆయన అకాలమృత్యువు బారిన పడినారు.

గ్రామ విశేషాలు మార్చు

  • ఈ గ్రామానికి చెందిన భవనాశి వెంకటేష్ అను జవాను, శ్రీనగర్ లో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయినాడు. 2014, అక్టోబరు-28న, ఇతని మృతదేహాన్ని, గ్రామానికి తీసికొని వచ్చి, గ్రామంలో ఊరేగించి, అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
  • ఈ గ్రామానికి చెందిన మానికొండ సాయిరమ్య, ఒంగోలులోని రైస్ ప్రకాశంలో మూడవ సంవత్సరం బి.టెక్ చదువుచున్నది. ఈమెకు త్వరలో సింగపూరులో జరుగనున్న నాల్గవ అంతర్జాతీయ క్లౌడ్ కంప్యూటింగ్ సదస్సులో పాల్గొనటానికి ఆహ్వానం అందినది. ఈ సదస్సుకు మనదేశం నుండి ఎంపికచేయబడిన ఏడుగురు ఆహ్వానితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈమె ఒక్కరే ఎంపిక కావడం విశేషం.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉలవపాడు&oldid=4045305" నుండి వెలికితీశారు