ఉలవపాడు మండలం

ఆంధ్రప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండలం


ఉలవపాడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3][4]ఈ మండలం కందుకూరు శాసనసభ నియోజకవర్గ పరిధి కిందకు వస్తుందిOSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°10′01″N 80°00′00″E / 15.167°N 80°E / 15.167; 80
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండల కేంద్రంఉలవపాడు
విస్తీర్ణం
 • మొత్తం186 కి.మీ2 (72 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం53,918
 • జనసాంద్రత290/కి.మీ2 (750/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి999

మండల గణాంకాలు

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం ఉలవపాడు మండలం మొత్తం జనాభా 53,918. వీరిలో 26,972 మంది పురుషులు కాగా, 26,946 మంది మహిళలు ఉన్నారు. 2011 లో ఉలవపాడు మండలంలో మొత్తం 14,240 కుటుంబాలు నివసిస్తున్నాయి. [5]

2011 జనాభా లెక్కల ప్రకారం ఉలవపాడు మండలం జనాభా అంతా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో సగటు అక్షరాస్యత రేటు 57.1%, లింగ నిష్పత్తి 999. మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5935. ఇది మొత్తం జనాభాలో 11%. 0 - 6 సంవత్సరాల మధ్య 3034 మంది మగ పిల్లలు, 2901 ఆడ పిల్లలు ఉన్నారు. ఈ విధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఉలవపాడు మండలం పిల్లల సెక్స్ రేషియో 956, ఇది మండల సగటు సెక్స్ రేషియో 999 కన్నా తక్కువ.మొత్తం అక్షరాస్యత రేటు 57.08%. పురుష అక్షరాస్యత రేటు 57.3%, స్త్రీ అక్షరాస్యత రేటు 44.28%.[5]

2001 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం - మొత్తం 50,375 - పురుషుల సంఖ్య 25,556 -స్త్రీల సంఖ్య 24,819.అక్షరాస్యత - మొత్తం 51.70% - పురుషుల సంఖ్య 61.05% -స్త్రీల సంఖ్య 42.11%

మామిడి పంటకు ప్రసిద్ధి

మార్చు

ఈ మండలంలోని పలుగ్రామాలలో మామిడి పంటను ఎక్కువుగా పండిస్తారు.ఈ ప్రాంతంలో పండిన వివిధ రకాల మామిడి కాయలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, పుణె, బిలాస్‌పూర్‌, ఢిల్లీ , బాంబే, విజయవాడ లాంటి నగరాలకు ఎగుమతి అవుతాయి.దీంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతాయి. ఉలవపాడు మామిడి అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ప్రత్వేకంగా పేరు ఉంది. ఇక్కడ పండించిన బంగినపలి మామిడికాయలు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. 16 వ నెంబరు జాతీయరహదారి పై ఒంగోలు – కావలి పట్టణానికి మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో షుమారు 15 వేల ఎకరాలలో మామిడి సాగు జరుగుతుంది. ఇక్కడ బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు, బెంగుళూరు, నీలం, కొబ్బరిమామిడి, పునారస్, హిమామ్‌పసంద్‌ అనే రకాలు సాగు చేస్తారు.[6][7]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
 1. ఆత్మకూరు
 2. బద్దెపూడి
 3. భీమవరం
 4. చాగల్లు
 5. చాకిచర్ల
 6. కె.రాజుపాలెం
 7. కారేడు
 8. కృష్ణాపురం
 9. మన్నేటికోట
 10. రామాయపట్నం
 11. వీరేపల్లి

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు
 1. ఉలవపాడు
 2. పెదపట్టపుపాలెం

మూలాలు

మార్చు
 1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
 2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
 4. "Ulavapadu Mandal Villages, Prakasam, Andhra Pradesh @VList.in". vlist.in. Archived from the original on 2019-11-23. Retrieved 2020-06-08.
 5. 5.0 5.1 "Ulavapadu Mandal Population, Religion, Caste Prakasam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
 6. "ప్రపంచ పటంలో ఉలవపాడు మామిడి..." Sakshi. 2021-11-29. Retrieved 2022-06-26.
 7. "మధురఫలం కొనేవారేరి..!". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2021-05-27. Retrieved 2022-06-26.

వెలుపలి లంకెలు

మార్చు