ఉల్లంపర్రు అనేది పశ్చిమ గోదావరి జిల్లా లోని పాలకొల్లు మండలం లోని గ్రామం.[1]..[1]. ఇది పాలకొల్లు ఒక కిలోమీటరు దూరంలో రాజమండ్రి వెళ్ళే దారిలో ఉంది. ఈ గ్రామం పాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలోని ప్రధాన కాలువ వద్ద ఉన్న కనకదుర్గమ్మవారి ఆలయం ప్రసిద్ధికాంచింది. నియోజకవర్గాల పునర్విభజనకు ముంది ఈ ఊరు ఆచంట నియోజకవర్గంలో ఉండేది.ఇప్పుడు ఈగ్రామం పాలకొల్లు నియోజకవర్గంలో కలవడంవల్ల అభివ్రుద్దికి నోచుకొంటుంది. ఇక్కడ గ్రామదేవతల (వేగులమ్మ, గోగులమ్మ, ముత్యలమ్మ, చల్లలమ్మ) తీర్దం ప్రతీ సంవత్సరం ఉగాదికి 15 రోజుల తరువాత జరుగుతుంది ఇది పాలకొల్లు చుట్టుప్రక్కల చాలాప్రసిద్ధిగాంచింది. ఈ అమ్మవారు కోర్కలుతీర్చే తల్లిగా గ్రామస్థులు, చుట్టుప్రక్కల గ్రామాలు ప్రజలుకూడా నమ్మకం. ఈ గ్రామంలో రైస్.మిల్లులు ఎక్కువ సంఖ్యలో ఉండడంవల్ల ఆదాయం కలిగిన పంచాయితీగా ప్రసిద్ధి, కాని దానికనుగునంగా అబివ్రుద్దికి మాత్రం నోచుకోవడంలేదు. ప్రస్తుత కాలంలో ఈగ్రామాన్ని పాలకొల్లు మునిసిపాలిటిలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఉల్లంపర్రు
—  రెవిన్యూ గ్రామం  —
ఉల్లంపర్రు is located in Andhra Pradesh
ఉల్లంపర్రు
ఉల్లంపర్రు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°31′59″N 81°43′36″E / 16.533061°N 81.726579°E / 16.533061; 81.726579
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పాలకొల్లు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 2,601
 - స్త్రీలు 2,717
 - గృహాల సంఖ్య 1,433
పిన్ కోడ్ 534250
ఎస్.టి.డి కోడ్

విద్యా సౌకర్యాలుసవరించు

  • ఇది గ్రామ పంచాయితీ అవ్వడం వలన, బాగా సమీపంలో పాలకొల్లు ఉండటం వలన ప్రైవేటు యాజమాన్యాలు ఇక్కడ విద్యా సౌకర్యాల అభివృద్ధిపై దృష్టిపెట్టి మంచిపాఠశాలలు నిర్మించారు. వాటిలో కొన్ని ఐ.టి.ఐ, సర్.సి.వి.రామన్ పాలిటెక్నిక్ కళాశాల, మాంటిస్సోరిస్ వారి ప్రాథమిక పాఠశాల నుండి జూనియర్ స్థాయి వరకూ గల పాఠశాల ఉంది. ఇక్కడ ప్రజాపరిషత్.పాఠశాలలో ఏడోతరగతి వరకు విద్యాసౌకర్యం ఉంది.

ఇతర విశేషాలుసవరించు

  • ఇక్కడ మొయిన్ రోడ్డులో కొన్ని నర్సరీలు ఉన్నాయి. తద్వారా మొక్కలకు కడియం వరకూ వెళ్ళే అవసరం ఉండదు.

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 5, 318 - పురుషుల సంఖ్య 2, 601 - స్త్రీల సంఖ్య 2, 717 - గృహాల సంఖ్య 1, 433

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.