ఉల్లిపాలెం

భారతదేశంలోని గ్రామం

ఉల్లిపాలెం, కృష్ణా జిల్లా, కోడూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 328., యస్.ట్.డీ కోడ్=08671.

ఉల్లిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
ఉల్లిపాలెం is located in Andhra Pradesh
ఉల్లిపాలెం
ఉల్లిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°01′26″N 81°03′30″E / 16.023789°N 81.058412°E / 16.023789; 81.058412
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి గుడిసేవ వెంకటరావమ్మ
జనాభా (2011)
 - మొత్తం 4,831
 - పురుషులు 2,457
 - స్త్రీలు 2,374
 - గృహాల సంఖ్య 1,419
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో సాలెంపాలెం, పెదయాదర, కోడూరు (కృష్ణా), కృష్ణపురం, కోన గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి, మచిలీపట్నం

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కొత్తమాజేరు, మోపిదేవి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 78 కి.మీ

కృష్ణానదిపై వారధిసవరించు

ఉల్లిపాలెం - పల్లెతుమ్మలపాలెం గ్రామాల మధ్య కృష్ణానదిపై వారధి నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. 12-8-2014న టెండరు తెరిచారు. త్వరలో నిర్మాణం మొదలు పెట్టెదరు. [4]

ఈ వారధి నిర్మాణం 2016, ఆగస్టు-12న ప్రారంభమగు కృష్ణా పుష్కరాలనాటికి పూర్తి చేయుటకు నిర్ణయించారు. [6]

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాలసవరించు

ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేయుచున్న శ్రీ కాశీభొట్ల నాగభూషణం గారికి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, సెప్టెంబరు, 5-2013 న హైదరాబాదు రవీంద్రభారతిలో జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి శ్రీ కె.పార్ధసారథి చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందజేశారు. కాని ఆయన చొరవతొనే ఊరిలోని మైన్ స్కూల్ తొలగించి వారిని ఎం పి యు పి స్కూల్ లోనికి మార్చారు ఇది గ్రామస్థులు, రాజకీయ నాయకుల చేతకాని తనం వలన. మళ్ళి అక్కడ స్కూల్ రాదు. ఈ వురినుండి సుమారుగా 100 మంది కోడూరు కాన్వెంట్ కు వెళతారు. ఒకసారి ఆలోచించండి [2] ఈ పాఠశాలలో 21.2 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదుల విభాగాన్ని, 2015, నవంబరు-1వ తేదీనాడు ప్రారంభించారు. [5]

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

రక్షిత మంచినీటి చెరువు:- ఈ చెరువు వద్ద, పశువుల దాహార్తి తీర్చేటందుకు, పంచాయతీలోని 14వ ఆర్థిక సంఘం నిధులు 80, 000-00 రూపాయలతో నిర్మిచిన తొట్టెలను 2016, మే-21న ప్రారంభించారు. [7]

గ్రామ పంచాయతీసవరించు

  1. హరిపురం గ్రామం, ఉల్లిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. కీ.శే.సిద్దినేని రత్నారావు, మాజీ సర్పంచ్.
  3. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి గుడిసేవ వెంకటరావమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. శ్రీ అడుసుమిల్లి ప్రసాదు ఉపసర్పంచిగా ఎన్నికైనారు.[3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ రాజ్యలక్ష్మీ గోదాదేవి సమేత శ్రీమన్నారాయణస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వైభవంగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ కన్నులపండువగా నిర్వహించెదరు. [ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; మే-13,2014; 2వపేజీ]

ఈ ఆలయప్రాంగణంలో భగవత్ రామానుజాచార్యుల ఆలయ నిర్మాణానికి, 2017, మే-29వతేదీ సోమవారంనాడు శంకుస్థాపన నిర్వహించారు. [8]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, చేపలు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, చేపల పెంపకం

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 4, 831 - పురుషుల సంఖ్య 2, 457 - స్త్రీల సంఖ్య 2, 374 - గృహాల సంఖ్య 1, 419;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5332.[4] ఇందులో పురుషుల సంఖ్య 2684, స్త్రీల సంఖ్య 2648, గ్రామంలో నివాసగృహాలు 1448 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2250 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Koduru/Ullipalem". Archived from the original on 24 నవంబర్ 2017. Retrieved 27 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
  2. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ, 6-9-2013. రెండవ పేజీ.
  3. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; జనవరి-8,2014. 2వ పేజీ.
  4. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.

వెలుపలి లింకులుసవరించు

[4] ఈనాడు కృష్ణా; 2014, ఆగస్టు-19; 3వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-2; 41వపేజీ. [6] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, మే-14; 3వపేజీ. [7] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, మే-22; 1వపేజీ. [8] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, మే-30; 2వపేజీ.