ఉస్మాన్ సాగర్ (చెరువు)

ఉస్మాన్ సాగర్ ను గండిపేట చెరువు అనికూడా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉంది.[1] ఈ చెరువు చుట్టూ 46 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, జలాశయం 29 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది. జలాశయం 1,790 అడుగుల లోతు, 3.9 టిఎంసి అడుగుల సామర్థ్యం కలిగివుంది.[2]

ఉస్మాన్ సాగర్
Gandipet.jpg
చెరువు దృశ్యం
స్థానంరంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
భౌగోళికాంశాలు17°23′N 78°18′E / 17.383°N 78.300°E / 17.383; 78.300Coordinates: 17°23′N 78°18′E / 17.383°N 78.300°E / 17.383; 78.300
సరస్సు రకంజలాశయం
జల ప్రవాహంమూసీనది
నీటి విడుదలమూసీనది
ప్రవహించే దేశాలుభారతదేశం

చరిత్రసవరించు

1908లో హైదరాబాద్ నగరంలో ఉన్న మూసీనదికి జలప్రళయం వచ్చిన తరువాత హైదరాబాద్ వాసులకు త్రాగునీటిని అందించడానికి హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ ఆలీ ఖాన్ 1920 లో మూసీనదిపై ఉస్మాన్ సాగర్ వంతెన నిర్మించాడు. ఉస్మాన్ ఆలీ ఖాన్ పేరుమీదుగా ఈ వంతెనకు ఉస్మాన్ సాగర్ గా పేరు పెట్టడం జరిగింది.

సరస్సుకు ఎదురుగా సాగర్ మహల్ అనే ఒక భవనం ఉంది. చివరి నిజాం తన వేసవి విడిదికోసం ఈ భవనాన్ని నిర్మించాడు. ప్రస్తుతం సాగర్ మహల్ వారసత్వ భవనంగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది.

చెరువు చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

  1. ఆంధ్రజ్యోతి (10 March 2017). "ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరదనీరు". మూలం నుండి 27 జూలై 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 28 July 2018. Cite news requires |newspaper= (help); Check date values in: |archivedate= (help)
  2. "Hyderabadis can bid goodbye to water woes". The Hindu. 10 October 2016. Retrieved 20 March 2017.