ఊర్వశి ధోలకియా (జననం 1978 జూలై 9) భారతీయ టెలివిజన్ నటి. ఆమె ప్రజాదరణ పొందిన ధారావాహిక కసౌతి జిందగీ కే(2001)లో ప్రతినాయక కొమోలిక పాత్రలో నటించి మెప్పించింది. ఆమె బిగ్ బాస్ ఆరవ సీజన్‌లో విజేతగా నిలిచింది.[1][2]

ఊర్వశి ధోలకియా
2022లో ఊర్వశి ధోలకియా
జననం (1978-07-09) 1978 జూలై 9 (వయసు 46)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1984 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • దేఖ్ భాయ్ దేఖ్
  • కసౌతి జిందగీ కే (2001 టీవీ సిరీస్)
  • కభీ సౌతాన్ కభీ సహేలి
  • బిగ్ బాస్ (హిందీ సీజన్ 6)
గుర్తించదగిన సేవలు
  • కసౌతీ జిందగీ కే
  • బిగ్ బాస్ 6

ఆమెను ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు, ఇండియన్ టెలీ అవార్డు, స్టార్ ఇంటర్నేషనల్ అవార్డు, అప్సర అవార్డు, గోల్డ్ అవార్డు, సిన్సుయ్ టెలివిజన్ అవార్డు, కళాకర్ అవార్డు.. వంటి పలు పురస్కారాలు వరించాయి. కాగా కసౌతి జిందగీ కేలో ఆమె నటనకు గాను 2022లో గోల్డెన్ గ్లోరీ అవార్డు, ఐకానిక్ గోల్డ్ అవార్డులు దక్కాయి.[3]

బాల్యం

మార్చు

తల్లి పంజాబీ, తండ్రి గుజరాతీలకి ఆమె 1978 జులై 9న ఢిల్లీలో జన్మించింది.[4]

కెరీర్

మార్చు

టెలివిజన్

మార్చు

ఆమె తన 6వ ఏట రేవతితో కలిసి లక్స్ సోప్ టీవీ వాణిజ్య ప్రకటనలో నటించింది.[5] ఆమె బాలనటిగా దూరదర్శన్ టీవీ సిరీస్ శ్రీకాంత్‌లో రాజలక్ష్మితో గుర్తింపుపొందింది. ఆమె మొదటి టీవీ అడల్ట్ రోల్ దూరదర్శన్ దేఖ్ భాయ్ దేఖ్‌లో శిల్పా పాత్రలో, తర్వాత వక్త్ కి రాఫ్తార్ నటించింది.[6]

ఏక్తా కపూర్ షోలు ఘర్ ఏక్ మందిర్, కభీ సౌతాన్ కబీ, సహేలి, కసౌటి జిందగీ కే, కహిన్ తో హోగాలలో ఆమె నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఇది ఆమెకు పలు అవార్డులు తెచ్చిపెట్టింది. దీంతో ఆమె 2000ల దశాబ్దంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల జాబితాలోకి చేరింది.[7]

2012లో, ఆమె కలర్స్ టీవీ బిగ్ బాస్ 6లో పాల్గొంది. అందులో 2013 జనవరి 12న ఆమె సీజన్ విజేతగా నిలిచింది.[8] అలాగే ఆమె కలర్స్ టీవీ హిస్టారికల్ ఫాంటసీ సిరీస్ చంద్రకాంత(2017)లో క్వీన్ ఇరావతిగా నటించింది.[9]

2022లో ఆమె నాగిన్ 6లో ఊర్వశిగా మళ్లీ ఫిక్షన్ జానర్‌లోకి వచ్చింది.[10]

సినిమాలు

మార్చు
Year Movie Role Language
1986 బాబుల్ రాణి / నందిని హిందీ
1988 కబ్ తక్ చుప్ రహంగీ లక్ష్మి
1991 ఇజ్జత్ అను
2006 స్వప్నం యామిని/కొమోలిక మలయాళం/హిందీ

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె 16 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంది. 17 సంవత్సరాల వయస్సులో ఆమె క్షితిజ్, సాగర్ అనే కవల అబ్బాయిలకు జన్మనిచ్చింది, వారికి ఆమె సింగిల్ పేరెంట్.[11]

మూలాలు

మార్చు
  1. "PICS: Kasautii Zindagii Kay's Original Komolika, Urvashi Dholakia Celebrates 41st Birthday in Style!". ABP Live. 10 July 2019. Archived from the original on 1 ఆగస్టు 2019. Retrieved 1 జూలై 2023.
  2. "Bigg Boss winners 'Lost and Found'". The Free Press Journal.
  3. Standard, Business (2021-12-27). "Dr Aishwarya Selvaraj bags Brands Impact Golden Glory Award - 2021". www.business-standard.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-07-01. {{cite web}}: |first= has generic name (help)
  4. "Urvashi Dholakia to judge Gujarati reality show". Yahoo! News. 2 November 2011. Retrieved 8 February 2018.
  5. "Serial thriller". The Telegraph. 28 January 2004. Archived from the original on 26 October 2012.
  6. "Sinfully yours: Arguably the biggest vamp on the small screen, Urvashi Dholakia." The Hindu. Chennai, India. 1 June 2006. Archived from the original on 28 December 2007.
  7. Pisharoty, Sangeeta Barooah (12 August 2004). "The queen of bad things". The Hindu. Chennai, India. Archived from the original on 4 August 2017. Retrieved 17 February 2015.
  8. "Urvashi Dholakia television's favorite Komolika crowned the winner of Bigg Boss 6". zeenews.india.com. 12 January 2013.
  9. "Urvashi Dholakia on her comeback in Chandrakanta, Ekta Kapoor giving her a magic wand and her pride in others imitating Komolika". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 29 June 2017. Retrieved 28 July 2017.
  10. "Naagin 6 Character Revelation: Urvashi Dholakia will play Tejashwi Prakash's mother, Sudha Chandran will be the villain". news ncr. Archived from the original on 2023-04-10. Retrieved 2023-07-01.
  11. "Urvashi Dholakia as mother". TVGupshup. 2017. Archived from the original on 13 July 2018. Retrieved 24 August 2022.