ఎందుకంటే...ప్రేమంట!

2012 సినిమా

{{}}

ఎందుకంటే...ప్రేమంట!
(2012 తెలుగు సినిమా)
Endukante premanta poster.jpg
దర్శకత్వం ఎ. కరుణాకరన్
నిర్మాణం స్రవంతి రవికిషోర్
కథ ఎ. కరుణాకరన్
తారాగణం రామ్
తమన్నా
సుమన్
సాయాజీ షిండే
సంగీతం జి. వి. ప్రకాష్ కుమార్
గీతరచన రామజోగయ్య శాస్త్రి
శ్రీమణి
సంభాషణలు కోన వెంకట్
ఛాయాగ్రహణం ఐ. ఆండ్రూస్
నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్
పంపిణీ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్
నిడివి 155 నిమిషాలు
భాష తెలుగు

ఎందుకంటే... ప్రేమంట! 2012 లో కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. రామ్, తమన్నా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.[1] ఈ చిత్రానికి ఆధారం జస్ట్ లైక్ హెవెన్ అనే హాలీవుడ్ చిత్రం.

కథసవరించు

పారిశ్రామికవేత్తయైన కృష్ణారావు (సాయాజీ షిండే) కొడుకు రాం అల్లరి కుర్రాడు. బాధ్యతలు లేకుండా తిరుగుతుంటాడు. అతనిని దారిలో పెట్టడానికి, ధనం విలువ, కాలం విలువ తెలియజెప్పడానికి అతని తండ్రి తెలివిగా ప్యారిస్ లోని తన స్నేహితుడి ద్రాక్ష తోటల్లోకి పంపుతాడు. అక్కడ కూడా హాయిగా కాలం గడుపుదామన్న రాం కి రోజంతా పనులు చెబుతుంటే చేయలేక అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అతను తెలివిగా అక్కడినుంచి బయట పడతాడు కానీ అతని పాస్ పోర్టు యజమాని దగ్గరే ఉండి పోతుంది. ఏం చేయాలో ఆలోచిస్తుండగా అతనికి స్రవంతి విచిత్రమైన పరిస్థితుల్లో తారసపడుతుంది. ఆమె తన సమస్యలు తీర్చిన తరువాత అతనికి అతనికి సాయం చేస్తున్నది కేవలం స్రవంతి ఆత్మ మాత్రమేననీ ఆమె శరీరం హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో కోమాలో ఉందని తెలుస్తుంది. అందుకు కారణాలు కూడా ఆమె వివరిస్తుంది. ఆమె సాయంతో హైదరాబాదు కు వెళ్ళిన రాం ఆమెను చంపాలని చూస్తున్నదేవరు? వారి నుంచి అతను ఆమెను ఎలా కాపాడుకున్నాడన్నదే మిగతా కథ.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. మహేష్, కోనేరు. "ఎందుకంటే ప్రేమంట సమీక్ష". 123telugu.com. 123telugu.com. Retrieved 12 October 2016.

బయటి లంకెలుసవరించు