ఎం.వి. వాసుదేవరావు
భారతీయ సినిమా నటుడు.
ఎం.వి. వాసుదేవరావు (1920 - 22 మార్చి 2002) భారతీయ సినిమా నటుడు. 1928లో బాల నటుడిగా సినిమారంగంలోకి వచ్చిన వాసుదేవరావు, దాదాపు 200కి పైగా సినిమాలలో నటించాడు. శివరామ కారంత్ రాసిన నవల ఆధారంగా 1975లో రూపొందిన చోమన దుడి సినిమమాలోని చోమ పాత్రకు 23వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు.[1]
ఎం.వి. వాసుదేవరావు | |
---|---|
జననం | ముదాబిద్రి వెంకట్ రావు వాసుదేవరావు 1920 బ్రిటీష్ ఇండియా |
మరణం | 2002 మార్చి 22 | (వయసు 81–82)
జాతీయత | భారతదేశం |
వృత్తి | నటుడు |
పురస్కారాలు | జాతీయ ఉత్తమ నటుడు (1975) కర్ణాటక రాష్ట్ర ఉత్తమ సినిమా నటుడు అవార్డు (1975-76) |
శ్యామ్ బెనగళ్ తీసిన అనుగ్రహం అనే తెలుగు సినిమాలో ముఖ్య పాత్రతో నటించాడు. మృణాళ్ సేన్ తీసిన ఒక ఊరి కథ సినిమాలో, మణిరత్నం తీసిన నాయకుడు, బొంబాయి సినిమాల్లో కూడా నటించాడు. చోమన దుడి సినిమా తరువాత ఎక్కువగా చిన్న పాత్రలు పోషించాడు.[2]
సినిమాలు
మార్చుమరణం
మార్చువాసుదేవరావు 2002, మార్చి 22న బెంగళూరులో మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ "Vasudeva Rao Dead". chitraloka.com. 22 March 2002. Archived from the original on 17 December 2014. Retrieved 27 July 2021.
- ↑ Rao, M. K. Bhaskar (14 April 2002). "A natural". Deccan Herald. Archived from the original on 25 April 2002. Retrieved 27 July 2021.