నాయకుడు 1987లో తమిళం నుండి తెలుగులోకి అనువదించబడిన డబ్బింగ్ సినిమా. దీని మూలం మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం "నాయకన్".

నాయకుడు
(1987 తెలుగు సినిమా)
Nayakudu.JPG
దర్శకత్వం మణి రత్నం
నిర్మాణం రవి కిశోర్
తారాగణం కమల్ హసన్, నాజర్, శరణ్య
సంగీతం ఇళయరాజా
సంభాషణలు రాజశ్రీ
ఛాయాగ్రహణం పి.సి.శ్రీరామ్
కళ తోట తరణి
నిర్మాణ సంస్థ సుజాతా ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణంసవరించు

ప్రధానపాత్రలు
సహాయ పాత్రలు
 • హుస్సేన్ భాయ్ గా ఎం.వి.వాసుదేవరావు
 • అయ్యర్ గా ఢిల్లీ గణేష్
 • సూర్య గా నిలగళ్ రవి
 • రాజమ్మ భర్త, అసిస్టెంట్ కమిషనర్ గా నాజర్
 • షకీలా గా తార
 • చెట్టియార్ సోదరులు గా ఆర్.ఎన్.సుదర్శన్, ఆర్.ఎన్.జయగోపాల్
 • వీర్నాయుడి సాయం కోరే పోలీస్ కమిషనర్ గా ఎ.ఆర్.శ్రీనివాసన్
 • ఇన్స్పెక్టర్ కేల్కర్ గా ప్రదీప్ శక్తి

నిర్మాణంసవరించు

కథాంశం అభివృద్ధిసవరించు

"నేను బొంబాయిలో చదువుకున్న రెండేళ్ళూ (1975-77), ఆయన (వరదరాజన్ ముదలియార్) అత్యంత ప్రభావశీలమైన స్థితిలో ఉన్నారు. మాతుంగ బెల్ట్ ప్రజలు ఆయనని దేవుడని భావించేవారు. సాటి మనిషిని దేవుడిలా ఎవరైనా ఎందుకు కొలుస్తారని నేను ఆశ్చర్యపోయేవాణ్ణి. వాళ్ళెందుకు ఇలా చేస్తారో నాకు ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. అది నాకు ఆర్షణీయమైంది. ఈ వ్యక్తి తమిళనాడు నుంచి బాంబే వచ్చి నగరాన్ని పరిపాలిస్తున్నాడు, అదొక డ్రామా ఉన్న కథ. ఈ ఆలోచనని కమల్ హసన్ కి స్థూలంగా వినిపించాను. అంతే అది నిర్ణయమైపోయింది."

 – ఈ సినిమా చేసేందుకు తనకున్న ప్రేరణ గురించి మణిరత్నం, సినీవిమర్శకుడు భరద్వాజ్ రంగన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.[1]

స్థూలంగా నాయకుడు సినిమా కథాంశాన్ని తమిళనాడు నుంచి బొంబాయి వెళ్ళి అక్కడ మాఫియా నాయకునిగా ఎదిగిన వరదరాజన్ మొదలియార్ (వరదా భాయ్) జీవితాన్ని ఆధారం చేసుకుని తయారైంది. సినిమాపైన అమెరికన్ క్రైమ్ సినిమా గాడ్‌ఫాదర్‌ ప్రభావం కూడా ఉంది. మొట్టమొదట చిత్రనిర్మాత శ్రీనివాసన్ పగ్లా కహీ కా అనే చిత్ర కథని శివాజీ గణేశన్ కి వినిపించగా, ఆయన సినిమాలో నటించేందుకు అంగీకరించారు. కథానాయకి పాత్రకి అమలను అనుకున్నారు. అయితే కమల్ హాసన్ తో పనిచేస్తున్న అనంతు ఇది చివరకి శివాజీ గణేశన్ సినిమా అవుతుందేమోనని భావించారు, ఈ పాత్రకి కమల్ అయితే మరింత ఒప్పుతారని అనుకున్నారు. చివరకు ప్రాజెక్టు వదిలేశారు. నిర్మాత ముక్తా శ్రీనివాసన్ కి కొత్తగా సినిమారంగంలోకి వస్తున్న దర్శకుడు మణిరత్నాన్ని గురించి చెప్పారు. మణిరత్నం తన తొలిచిత్రం పల్లవి అనుపల్లవి(1983)కి కమల్ హాసన్ ని హీరోగా తీసుకుందామని భావించారు. అయితే అప్పటికే కమల్ రాజా పరువాయ్ చిత్రానికి కమిట్ అయివుండడంతో ఇది సాగలేదు.[2]

1986లో శ్రీనివాసన్ రత్నం ఇంటికివెళ్ళి పగ్లా కహీ కా(1970) సినిమా క్యాసెట్ ఉన్న ఎన్వలప్ ఇచ్చివచ్చారు. సినిమా చూశాకా రత్నం కమల్ హాసన్ ని కలిసి ఇది తన తరహా చిత్రం కాదని మొదట్లో రిజెక్ట్ చేశారు. కమల్ "ఎలాంటి సినిమాలైతే చేయడానికి ఇష్టపడతారని" అడగగా, రత్నం రెండు కథలను చెప్పారు: డర్టీహారీ(1971), బెవర్లీ హిల్స్ కాప్(1984) అనే రెండు ఆంగ్లచిత్రాల తరహా కథాంశం, రెండోది అండర్ వరల్డ్ డాన్ వరదరాజన్ ముదలియార్ జీవితాన్ని ఆధారం చేసుకున్న కథ.[1][3] రెండో కథ బాగా నచ్చడంతో కమల్ హాసన్ ఆ సెప్టెంబరులోనే సినిమా డేట్స్ నిర్మాత శ్రీనివాసన్ కి ఇచ్చారు.[1]

క్యాస్టింగ్సవరించు

రత్నం కమల్ హాసన్ వీలైనంత వాస్తవికంగా పాత్ర పోషించాలని భావించారు. ఆయన సంప్రదాయ హిందూ దుస్తులు, ముఖ్యంగా లుంగీ చొక్కా, వేసుకోవాలని భావించారు. కమల్ మొదట్లో ఇందుకు సందేహించారు, సాగరసంగమం సినిమాలో వలె గడ్డంతో పాత్ర పోషించాలని భావించారు. గడ్డం ఉండడంతో అతని దవడలు కనిపించకుండా తక్కువ వయసు కలవాడే ఈ పాత్రను పోషించడాన్న అభిప్రాయం రాకుండా ఉంటుందని భావించారు. రత్నం కమల్ అంతకుముందు పెద్దవయసు వాడిగా వేసిన ఏ ఇతర సినిమాల్లోలాగా కనిపించకూడదని భావించారు.[4] పళ్ళసెట్టును పెట్టుకుని అతని ప్రస్తుతపు వీరయ్యనాయుడి ముసలివయసు లుక్ తీసుకువచ్చారు.[5]

వీరయ్యనాయుడు భార్య నీల పాత్రని శరణ్య పొన్వణ్ణన్ పోషించారు. ఈ పాత్రని, మొదట వేశ్యాగృహంలో తారసపడేనాటి నుంచి, మరణించేవరకూ ఉన్నదంతా నిర్మాత శ్రీనివాసన్ సృష్టించారు. ఈ పాత్ర లేకుంటే సినిమా పూర్తి వయొలెంట్ కంటెంట్ గా తయారయ్యి కుటుంబ ప్రేక్షకులకు నచ్చదని ఆయన ఈ పాత్రను ప్రవేశపెట్టారు. శరణ్య పొన్వణ్ణన్ కి ఇదే తొలి చిత్రం[6] ఈ పాత్రకి కొత్తముఖం ఉంటేనే సరిగా ఆస్వాదించగలరని భావించారు.[7] శరణ్య తన ఫోటోను ఆడిషన్ కోసం రత్నంకు పంపారు. విజయవంతమైన స్క్రీన్ టెస్ట్ అనంతరం ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేశారు. ఆ పాత్రకు స్క్రీన్ టెస్ట్ చేసిన మొదటి, ఏకైక నటి ఆమే.[8] మణిరత్నం రాజమ్మ భర్త పాత్రకి రఘువరన్ ని పరిశీలిస్తుండగా కమల్ హాసన్ నాజర్ ని ఆ పాత్రకు సూచించినట్టు భావిస్తున్నారు.[9] షకీలా పాత్రకు తారను ఎంపికచేశారు..[10]

చిత్రీకరణసవరించు

మణిరత్నం ప్రారంభంలో సినిమాను 60రోజుల్లో, 70రోల్స్ లో పూర్తిచేసేందుకు ప్రణాళిక వేసుకున్నారు. కమల్ హాసన్ 17.5 లక్షల రూపాయలు పారితోషికం అందుకున్నారు. ప్రాథమికంగా సినిమా బడ్జెట్ రూ.60 లక్షలు. అయితే త్వరలోనే సమయం, వ్యయం పెరిగిపోయి రూ.కోటికి బడ్జెట్ చేరుకుంది.[6] 10రోజుల పాటు మొదటి షెడ్యూల్లో 1986 నవంబర్ నుంచి ముఖ్యమైన ఫోటోగ్రఫీ ప్రారంభమైంది. నిర్మాతకు తెలియకుండా 10రోజుల పాటు 1986 డిసెంబర్లో స్క్రిప్టు ఫైనలైజ్ కాకుండానే, ఓ టెస్ట్ షూట్ చేశారు. ఈ టెస్ట్ షూట్లో కమల్ హాసన్ సినిమాలో చూపించే గెటప్స్ తో నటించారు. సినిమా తుదిప్రతిలో ఈ టెస్ట్ షూట్ సీన్లేమీ లేకున్నా సినిమాకు సంబంధించిన టెక్నికల్ విషయాలు సరైన దారిలో సాగేందుకు ఉపకరించింది.[11]

నిజానికి అసలైన ఫోటోగ్రఫీ 1987 జనవరిలో ప్రారంభమైంది. 15 రోజుల పాటు బొంబాయిలోని ధారావికి చెందిన మురికివాడల్లో సాగింది[11]. అక్కడ తీసిని ఫోటోలను ఉపయోగించుకుని సినిమా ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి చెన్నైలోని వీనస్ స్టూడియోలో సెట్ తయారుచేశారు. మురికివాడల్లోని వాతావరణాన్ని పునర్నిర్మించేందుకు వేలమంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకువచ్చారు.[6][3] దీనికితోడు, పావురాలను కూడా అందుకే తీసుకువచ్చారు.[12] జనగ్ రాజ్, ఢిల్లీ గణేశ్ వంటివారికి మేకప్ వేసేందుకు కమల్ సహకరించారు.[13] వీర్నాయుడు పాత్రను అనుభూతి చెందేందుకు ఆయన అత్తరు తెప్పించుకుని జల్లుకునేవారు.[3] మణిరత్నం డమ్మీ తుపాకీ వాడాల్సిన అవసరం లేకుండా కమల్ తన స్వంత తుపాకీ తీసుకువచ్చేవారు. ఇన్స్ పెక్టర్ ని చంపే సన్నివేశాల కోసం తాను అమెరికా నుంచి తెచ్చుకున్న చక్కెర సీసా కూడా కమల్ తీసుకువచ్చారు.[13] మణిరత్నం 12 లక్షల రూపాయలు పోరాట సన్నివేశాల కోసం ఖర్చుచేశారు.

పాటలుసవరించు

 • ఏదో తెలియని
 • నా నువ్వే దీపావళి
 • నీ గుడు
 • నీలి కన్నుల్లో
 • చలాకీ చిన్నది
 • సందె పొద్దు మేఘం

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 Rangan 2012, p. 44.
 2. Haasan, Kamal (20 October 2012). "'Of course Velu Nayakan doesn't dance'". The Hindu. మూలం నుండి 2 మార్చి 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 20 October 2012.
 3. 3.0 3.1 3.2 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; MAGAZINE అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 4. Rangan 2012, pp. 46-47.
 5. Rangan 2012, pp. 47.
 6. 6.0 6.1 6.2 V. Srinivasan, Muktha (28 October 2012). "Living in past glory". The Hindu. మూలం నుండి 2 మార్చి 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 5 April 2013.
 7. Rangan 2012, p. 51.
 8. Rangan 2012, p. 52.
 9. Rangan 2012, p. 64.
 10. Kuhajane, Muralidhara (14 March 2012). "Time to give back to film industry: Tara". The Hindu. మూలం నుండి 19 అక్టోబర్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 19 October 2014.
 11. 11.0 11.1 Rangan 2012, p. 45.
 12. Rangan 2012, p. 59.
 13. 13.0 13.1 Rangan 2012, p. 46.

బయటి లింకులుసవరించు