మాటాడ పాటిల్ ప్రకాష్ (1940 జూలై 11 – 2011 ఫిబ్రవరి 9), [3] ఒక భారతీయ రాజకీయ నాయకుడు, సినిమా నటుడు, దర్శకుడు 2005 నుండి 2006 వరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా పనిచేసారు.ప్రకాష్ నాటక రంగ ప్రేమికుడు. కన్నడ నాటకాలకు దర్శకత్వం వహించి నటించారు.అతను 71 సంవత్సరాల వయస్సులో 2011 ఫిబ్రవరి 9న బెంగుళూరులో మరణించాడు.[4]

ఎం. పి. ప్రకాష్
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి
In office
2005 ఆగస్టు 8[1][2] – 2006 జనవరి 28
అంతకు ముందు వారుసిద్దరామయ్య
తరువాత వారుబి.ఎస్.యడ్యూరప్ప
నియోజకవర్గంహూవిన హడగలి, బళ్లారి జిల్లా
Member of the కర్ణాటక శాసనసభ Assembly
for హడగలి
In office
1983–1989
అంతకు ముందు వారుకరిబసవనగౌడ్ కోగలి
తరువాత వారుఇ.టి.శంబునాథ
In office
1994–1999
అంతకు ముందు వారుఇ.టి.శంబునాథ
తరువాత వారువి.బి. హాలప్ప
In office
2004–2008
అంతకు ముందు వారువి.బి. హాలప్ప
తరువాత వారుబి. చంద్ర నాయక్
వ్యక్తిగత వివరాలు
జననం(1940-07-11)1940 జూలై 11
హూవిన హడగలి, హైదరాబాద్ రాష్ట్రం (ప్రస్తుతం కర్ణాటక), బ్రిటిష్ ఇండియా
మరణం2011 ఫిబ్రవరి 9(2011-02-09) (వయసు 70)
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్ (2008-2011)
ఇతర రాజకీయ
పదవులు
జనతా పార్టీ (1983–1988)
జనతా దళ్ (1988–1999)
జనతా దళ్ (యునైటెడ్) (1999–2004)
జనతా దళ్ (సెక్యులర్) (2004–2008)
జీవిత భాగస్వామిరుద్రాంభ
సంతానం4

జీవిత గమనం

మార్చు

బళ్లారి జిల్లా, హగరి బొమ్మనహళ్లి తాలూకా లోని వల్లభాపురలో 1940 జూలై 11న జన్మించిన ప్రకాష్ వృత్తిరీత్యా న్యాయవాది. అతను నాలుగుసార్లు కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యారు.1983లో జనతా పార్టీ టిక్కెట్‌పై హూవినా హడగలి శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టి మూడుసార్లు తిరిగి ఎన్నికయ్యారు. రామకృష్ణ హెగ్డే, ఎస్ఆర్ బొమ్మై, హెచ్ డి దేవెగౌడ, జె హెచ్ పటేల్, ధరమ్ సింగ్, హెచ్ డి కుమారస్వామి వంటి వివిధ ముఖ్యమంత్రుల హయాంలో అన్ని జనతా ప్రభుత్వాలలో వివిధ శాఖలను నిర్వహించే మంత్రిగా అతను పనిచేశారు.2005-2006లో కొంతకాలం పాటు కాంగ్రెస్ - జనతాదళ్-సెక్యులర్ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసారు.

మరణం

బెంగుళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో క్యాన్సర్ కారణంగా 2011 ఫిబ్రవరి 9న మరణించాడు. అతని అంత్యక్రియలు బళ్లారిలోని అతని స్వస్థలమైన హడగలిలో జరిగాయి.

మూలాలు

మార్చు

బాహ్య లింకులు

మార్చు
  1. Staff Reporter: State says Maharashtra's flood problems are of its own making., The Hindu, 9 August 2005.
  2. M. Madan Mohan: Another honour for north Karnataka., The Hindu,9 August 2005.
  3. "Former Karnataka Dy CM M P Prakash passes away". Netindian.in. 2011-02-09. Retrieved 2011-02-27.
  4. "Former Karnataka deputy chief minister MP Prakash dead". 2011-02-09. Retrieved 2011-02-27.