మార్గశయం వెంకటరమణ (జననం 1966 ఏప్రిల్ 24) భారత మాజీ క్రికెట్ ఆటగాడు. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తమిళనాడు తరపున ఆడిన రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. 1987-88 రంజీ ట్రోఫీ సీజన్‌లో అరంగేట్రం చేసాడు. రైల్వేస్‌తో జరిగిన ఫైనల్‌లో 94 పరుగులకు 7 వికెట్లతో కెరీర్‌లో అత్యుత్తమంగా 35 వికెట్లు పడగొట్టాడు. 1988-89 సీజన్‌లో మరో 30 వికెట్లు తీసి అతను పర్యాటక న్యూజిలాండ్ క్రికెట్ జట్టుతో ఆడిన భారత వన్డే జట్టులో చోటు సంపాదించాడు. వడోదరలో తన ఏకైక మ్యాచ్ ఆడి 2 వికెట్లు తీశాడు. 1988-89లో జమైకాలో వెస్టిండీస్ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ వెంకటరమణ ఆడిన ఏకైక టెస్ట్ మ్యాచ్. అతను మొదటి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. రెండవ ఇన్నింగ్సులో డెస్మండ్ హేన్స్‌ను ఔట్ చేసాడు. అదే అతని ఏకైక టెస్టు వికెట్‌. వెంకటరమణ టెస్టు, ODI రెండింటిలోనూ స్టంపింగుతో మొదటి వికెట్ సాధించిన మొదటి ఆటగాడు.

ఎం. వెంకటరమణ
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 185)1989 ఏప్రిల్ 28 - వెస్టిండీస్ తో
ఏకైక వన్‌డే (క్యాప్ 70)1988 డిసెంబరు 17 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే
మ్యాచ్‌లు 1 1
చేసిన పరుగులు 0 0
బ్యాటింగు సగటు
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 0* 0*
వేసిన బంతులు 70 60
వికెట్లు 1 2
బౌలింగు సగటు 58.00 18.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/10 2/36
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/–
మూలం: Cricinfo, 2005 సెప్టెంబరు 10

అతను తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 247 వికెట్లు పడగొట్టాడు, వాటిలో 212 తమిళనాడు తరపున. 2000లో రిటైరయ్యాక, కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. అతను 2011 వరకు సింగపూర్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. చెన్నైలోని BCCI అకాడమీలో స్పెషలిస్ట్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో దిండిగల్ డ్రాగన్స్‌కు కోచ్‌గా పనిచేస్తున్నాడు. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచింగ్ ఫ్యాకల్టీలో భాగంగా ఉన్నాడు. అక్కడ అతను రాబోయే యువ భారత స్పిన్ బౌలర్లతో కలిసి పనిచేస్తాడు.

మూలాలు

మార్చు