ఎత్తిపోతల జలపాతం
ఎత్తిపోతల జలపాతం, నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లా తాళ్ళపల్లె వద్ద ఉంది.[1] 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతం కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉంది.చంద్రవంక నది నల్లమల శ్రేణుల తూర్పు కొండలలో ముటుకూరు వద్ద పుట్టి, తుమృకోట అభయారణ్యంలో తాళ్ళపల్లి వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి ఉత్తర దిశగా ప్రయాణించి, తుమృకోటకు వాయవ్యాన కృష్ణా నదిలో కలుస్తుంది.[2] ఇక్కడ మొసళ్ళ పెంపక కేంద్రం ఉంది.[3] యతి అను పేరుగల ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపో + తలం (ఎత్తిపోతల) గా ప్రసిద్ధిగాంచింది.ఈ ప్రదేశం సినిమాల ద్వారా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగుతో, వీటిని చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది.
ఆలయాలు
మార్చుఈ లోయలో వెలిసిన దత్తాత్రేయస్వామి సుగాలీయుల ఇలవేలుపు. ప్రతి ఏటా తొలి ఏకాదశినాడు జరిగే తిరునాళ్ళకు సమీప జిల్లాల్లోని సుగాలీలు అసంఖ్యాకంగా హాజరవుతారు. మధుమతీదేవి, రంగనాధస్వామి, చౌడేశ్వరీదేవి ఆలయాలు కూడా ఇక్కడున్నాయి. ఈ దేవాలయాలు ఎత్తిపోతల జలపాతానికి దిగువభాగంలో ఉన్న అతిపురాతన దేవాలయాలు. వీటిని గురించి బయటి ప్రపంచానికి తెలిసినది అంతంతమాత్రమే. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ ఆలయాలకు అత్యంత ప్రత్యేకత ఉంది. దేవాలయం మొత్తం, కొండను తొలిచి లోపల విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. ఇప్పటికీ దేవాలయానికి వెళ్ళాలంటే తలదించుకొని వెళ్ళావలసినదే. లేదంటే తలకు పైభాగం రాతి ప్రాంతానికి తగిలి తల బొప్పి కట్టవలసినదే. ప్రతి తొలి ఏకాదశి]], దత్త జయంతి మొదలగు పర్వదినాలలో, రాష్ట్రంలోని నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు తరలివచ్చెదరు. మాచర్ల మండలంలో ఉన్న ఈ దేవాలయాలకు సరిహద్దులో ఉన్న నల్లగొండ, గుంటూరు, ప్రకాశం, మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల నుండి ఎక్కువమంది భక్తులు వస్తుంటారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ప్రతి శని, ఆదివారాలలో ప్రత్యేకపూజలు నిర్వహించుచుంటారు. అయినా ఇక్కడ సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి[4]
రంగనాధస్వామి దేవాలయం:శాతవహనలుకు సామంతలుగా ఉండి మంచికల్లు రాజధానిగా పలనాటిసీమను పాలించిన పల్లవుల ఇలవేల్పు ఈ రంగనాధస్వామి దేవాలయం 3 వ శాతబ్దం కాలంలో విగ్రహ్హన్ని ప్రతిస్తించి ఉంటారు.
ఇక్కడ నీరు నది ద్వారా వచ్చి ఇక్కడ పడడం లేదు. ప్రకాశం జిల్లాలో నుండి అంతర్వాహినిగా నీరు ప్రవహించి ఇక్కడ బయల్పడి జలపాతం ఏర్పడింది. ఇదొక వింత.ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి పున్నమి అతిథి గృహం ఇక్కడ ఉంది.
-
మధుమతీదేవి గుడి
-
రంగనాధస్వామి దేవాలయం
మూలాలు
మార్చు- ↑ Encyclopaedia of Tourism Resources in India By Manohar Sajnani పేజీ.64
- ↑ Andhra Pradesh District Gazetteers By Andhra Pradesh (India), Bh Sivasankaranarayana, M. V. Rajagopal, N. Ramesan [1]
- ↑ B Srinivas, K Vara Prasad and BC Choudhury. "Status of Crocodiles in Andhra Pradesh". Wildlife Institute of India. Archived from the original on 2008-11-23. Retrieved 2009-05-08.
- ↑ "గుంటూరు రూరల్". ఈనాడు. 2014-08-07. p. 4.