ఎన్.రమణి
ఎన్.రమణి లేదా ఫ్లూట్ రమణి అని పిలువ బడే నటేశన్ రమణి (15 అక్టోబరు 1934 – 9 అక్టోబరు 2015) ఒక కర్ణాటక సంగీత వేణుగాన కళాకారుడు. ఇతడు కర్ణాటక సంగీతంలో పొడుగైన వేణువును ప్రవేశపెట్టాడు.[1]
ఎన్.రమణి | |
---|---|
![]() ముంబైలో జరిగిన ఒక కచేరీలో ఎన్.రాజం, టి.ఎస్.నందకుమార్‌లతో ఎన్.రమణి | |
వ్యక్తిగత సమాచారం | |
జననం | తిరువరూర్, తమిళనాడు, భారతదేశం | 1934 అక్టోబరు 15
మరణం | 2015 అక్టోబరు 9 మైలాపూర్, చెన్నై, India | (వయసు 80)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | కర్ణాటక వాద్య కళాకారుడు |
వాయిద్యాలు | వేణువు |
క్రియాశీల కాలం | 1939–2015 |
ఆరంభ జీవితం, నేపథ్యం సవరించు
ఇతడు తమిళనాడు లోని తిరువారూర్ నగరంలో సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించాడు.[1] తిరువారూర్ నగరం కర్ణాటక సంగీత త్రిమూర్తులకు పుట్టినిల్లు.[2] ఇతడు మొదట తన తాత, వేణుగాన విద్వాంసుడు అయిన అళియూర్ నారాయణస్వామి అయ్యర్ వద్ద తన ఐదవ యేటి నుండే సంగీతం నేర్చుకున్నాడు.[2][3]
ఇతడు తన మొదటి కచేరీ 8వ యేట ఇచ్చాడు.[1] తన మేనమామ టి.ఆర్.మహాలింగం దృష్టిలో పడి అతని శిష్యుడిగా మారడం ఇతని జీవితంలో ఒక గొప్ప మలుపు.[2]
వృత్తి సవరించు
ఇతడు 1945లో ఆకాశవాణిలో మొదటి కచేరీ చేడాడు.[1] 1956లో మద్రాసు సంగీత అకాడమీలో తొలి ప్రదర్శన ఇచ్చాడు.[2] ఇతడు తన 22వ యేటికే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాడు.[1]
శిష్యులు సవరించు
ఇతడు "రమణి అకాడమీ ఆఫ్ ఫ్లూట్"ను స్థాపించి[1] వందలాది మంది శిష్యులకు శిక్షణను ఇచ్చాడు. ఇతని శిష్యులలో ఎ.ఎన్.భాగ్యలక్ష్మి, చిత్తూరు రాఘవరామన్, చిత్తూరు శ్రీనివాసన్, గోపి గణేష్ సోదరులు, వి.కార్తికేయన్, కె.కార్తికేయన్, ఎల్.వి.ముకుంద్, నందిని హరీష్, బి.రామకృష్ణ, వి.రంగరాజన్ మొదలైన వారున్నారు.[1]
పర్యటనలు సవరించు
ఇతడు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలోని సంగీత సభలు, ఇతర ప్రదేశాలలో ప్రదర్శన్లు ఇచ్చాడు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండు, శ్రీలంక వంటి ప్రపంచదేశాలలో పర్యటించి ముప్పైకి పైగా కచేరీలు నిర్వహించాడు.[1]
కర్ణాటక ఫ్లూట్ ఆవిర్భావం సవరించు
19వ శతాబ్దపు చివరి వరకు దక్షిణ భారతపు 8 రంధ్రాల వెదురుతో చేసిన వేణువు/మురళి/పిల్లనగ్రోవి లేదా ఉత్తర భారతదేశపు 6 రంధ్రాల "బాన్సురి" కర్ణాటక సంగీత కచేరీలలో ఉపయోగించేవారు కాదు. శరభశాస్త్రి అనేక ప్రయోగాల తరువాత వేణువును కచేరీలలో ఒక వాద్యపరికరంగా వినియోగించడం ఆరంభించాడు. శరభశాస్త్రి బాణీని అతని శిష్యుడు పల్లడం సంజీవరావు కొనసాగించాడు. కానీ ఈ "కర్ణాటక వేణువాద్యం"లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ప్రచారంలోనికి తెచ్చి, జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఆపాదించింది మాలి, అతని శిష్యుడు ఎన్.రమణి.[4]
పురస్కారాలు, ప్రశంసలు సవరించు
ఆకాశవాణిలో ఇతని ప్రదర్శనలకు అనేక హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల నుండి ప్రశంసలు లభించాయి.
ఇతనికి లభించిన పురస్కారాలలో కొన్ని:
- 1996లో మద్రాసు సంగీత అకాడమీ వారి సంగీత కళానిధి
- 2007లో ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటి, మద్రాస్ వారి "సంగీత కళాశిఖామణి"
- వాసర్ కాలేజ్ నుండి "సంగీత ఆచార్య"
- మేరీల్యాండ్, ఓహియో, అమెరికా "గౌరవ పౌరసత్వం"
- 1987లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం
- ఆరిజోనా ది వరల్డ్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్
- 1984లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిచే సంగీత నాటక అకాడమీ అవార్డు
- 2011లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిచే "టాగూర్ అకాడమీ ఫెలో"
మరణం సవరించు
నటేశన్ రమణి తన చివరి దశలో గొంతు క్యాన్సర్ బారిన పడి కచేరీలకు దూరంగా ఉన్నాడు. ఇతడు 2015, అక్టోబర్ 9వ తేదీన చెన్నైలోని మైలాపూర్‌లో మరణించాడు.[5][6] ఇతనికి నలుగు సంతానం ఉన్నారు.
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Parthasarathy, T. S. (1997). "The Sadas". The Journal of the Music Academy, Madras. Music Academy. LXVIII: 54.
- ↑ 2.0 2.1 2.2 2.3 Parthasarathy, T. S. (1997). "The 70th Madras Music Conference". The Journal of the Music Academy, Madras. Music Academy. LXVIII: 2.
- ↑ Aruna Chandaraju (23 June 2006). "The Hindu : Friday Review Hyderabad / Interview : Notes from various masters". The Hindu. Archived from the original on 2 నవంబరు 2012. Retrieved 16 May 2008.
- ↑ Dr. N. Ramani Interview about Mali
- ↑ Flute Ramani dies aged 81
- ↑ "Flautist N. Ramani passes away". The Hindu. 9 October 2015. Retrieved 9 October 2015.