ఎన్. రామచందర్ రావు
నారపరాజు రామచందర్ రావు తెలంగాణ రాష్ట్ర చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2015 నుండి 2021 వరకు హైదరాబాద్, రంగారెడ్డి & మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా పని చేశాడు.
నారపరాజు రామచందర్ రావు | |||
![]()
| |||
సభ్యుడు ,బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
మాజీ శాసనమండలి సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2015 - 2021 | |||
నియోజకవర్గం | మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం | ||
---|---|---|---|
హైదరాబాద్ జిల్లా బిజెపి అధ్యక్ష్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2017 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హైదరాబాద్ | 1959 ఏప్రిల్ 27||
జాతీయత | ![]() | ||
ఇతర రాజకీయ పార్టీలు | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఏబీవీపీ, భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | ఎన్.వి.ఆర్.ఎల్.ఎన్. రావు | ||
జీవిత భాగస్వామి | ఎన్. సావిత్రి | ||
సంతానం | అముక్త , అవనీష్ | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ | ||
వృత్తి | న్యాయవాది & రాజకీయ నాయకుడు |
రామచందర్ రావు తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా 2025 జూన్ 30న ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి శోభా కరంద్లాజే జులై 1న అధికారికంగా ప్రకటించింది.[1][2]
జననం & విద్యాభాస్యం
మార్చుఎన్. రామచందర్ రావు 1959 ఏప్రిల్ 27న సికింద్రాబాద్‌లో జన్మించి 1977లో సికింద్రాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో ఉన్నత విద్యను, 1980లో సికింద్రాబాద్‌లోని రైల్వే డిగ్రీ కళాశాల నుండి బి.ఎ., 1982లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్ (రాజకీయ శాస్త్రం)లో మాస్టర్స్ పూర్తి చేసి 1985లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ పట్టా పొందాడు. ఆయన 1985లో హైదరాబాద్‌లో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించి 2014లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
మార్చుఎన్. రామచందర్ రావు ఎమర్జెన్సీ సమయంలో పికెట్ కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి రైల్వే డిగ్రీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుతున్నప్పుడు వరుసగా మూడు సంవత్సరాలు స్టూడెంట్స్ యూనియన్ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి అనుబంధంగా) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఉస్మానియా లా కళాశాల స్టూడెంట్ యూనియన్ కార్యదర్శి (ఏబీవీపీ)గా పని చేశాడు.
ఎన్. రామచందర్ రావు భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి చింతల కనకారెడ్డి చేతిలో 2,768 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
ఎన్. రామచందర్ రావు 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి జి. దేవీప్రసాద్ రావు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు చేతిలో 73,698 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
ఎన్. రామచందర్ రావు 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణి దేవి చేతిలో ఓడిపోయాడు.[3]
ఎన్. రాంచందర్ రావును 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.[4]
నిర్వహించిన పదవులు
మార్చు- 1977-80 : అధ్యక్ష్యుడు స్టూడెంట్స్ యూనియన్, రైల్వే డిగ్రీ కాలేజీ
- 1982-85 : స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీ
- తొలి రాష్ట్ర కార్యదర్శి - భారతీయ జనతా యువ మోర్చా
- లీగల్ సెల్ కన్వీనర్ - భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ
- లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ - భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ
- 2008 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి
- 2011-2013 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
- 2014 : సభ్యుడు, బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా
- 2015 - 2021 : మాజీ ఎమ్మెల్సీ - మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం [5]
- 2017 : అధ్యక్షుడు, హైదరాబాద్ జిల్లా బిజెపి [6]
మూలాలు
మార్చు- ↑ "Who is BJP Telangana's new president N. Ramachander Rao?" (in Indian English). The Hindu. 1 July 2025. Archived from the original on 1 July 2025. Retrieved 1 July 2025.
- ↑ "కమల దళపతి రాంచందర్‌రావు". Andhrajyothy. 1 July 2025. Archived from the original on 1 July 2025. Retrieved 1 July 2025.
- ↑ The New Indian Express (23 March 2021). "Telangana Graduates' MLC polls: Defeated BJP MLC N Ramchander Rao demands CBI probe". Archived from the original on 2 August 2021. Retrieved 2 August 2021.
- ↑ Andhrajyothy (9 January 2024). "17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
- ↑ Sakshi (26 March 2015). "టీఆర్‌ఎస్‌కు ఝలక్!". Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.
- ↑ Sakshi (16 January 2017). "బీజేపీ నగర అధ్యక్షుడిగా రామచంద్రరావు". Sakshi. Archived from the original on 2 August 2021. Retrieved 2 August 2021.