జి. దేవీప్రసాద్ రావు
గుండవరపు దేవీప్రసాద్ రావు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఉద్యోగ సంఘాల నేత.ఆయన తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్‌గా, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ (టీఎన్‌జీఓస్) అధ్యక్ష్యుడిగా పనిచేశాడు.
జి. దేవీప్రసాద్ రావు | |||
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 5 ఏప్రిల్ 1958 అల్లీపూర్ గ్రామం, చిన్న కోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ | ||
తల్లిదండ్రులు | రాధాకిషన్ రావు, విజయలక్ష్మి | ||
జీవిత భాగస్వామి | లక్ష్మి | ||
సంతానం | సహజ, చైతన్య కుమార్ | ||
వృత్తి | తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ |
జననం, విద్యాభాస్యం
మార్చుదేవీప్రసాద్ రావు 1958 ఏప్రిల్ 5లో తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, చిన్న కోడూరు మండలం, అల్లీపూర్ గ్రామంలో రాధాకిషన్ రావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు.ఆయన పదవ తరగతి వరకు సిద్దిపేట లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, పెద్దపల్లి లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఐటిఐ పూర్తి చేశాడు.
ఉద్యోగ జీవితం
మార్చుదేవీప్రసాద్ రావు 1979లో నీటిపారుదల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. ఆయన 1979లో మెదక్ జిల్లా టిఎన్జీవో కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికై, 1981లో మెదక్ తాలూకా సెక్రటరీగా, 1983లో మెదక్ తాలూకా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1998 వరకు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టి, 1998 నుంచి 2008 వరకు మూడు పర్యాయాలు మెదక్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడిగా పనిచేశాడు. దేవీప్రసాద్ రావు 2008లో టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 2012 వరకు ఈ బాధ్యతలను నిర్వహించాడు.[1] ఆయన 2012 జూలై టి.ఎన్.జి.ఓ కేంద్ర సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆయన తిరిగి 2014 మేలో రెండోసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక దేవి ప్రసాద్ రావు 2015లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసేందుకు మెదక్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు.[2]
రాజకీయ జీవితం
మార్చుజి. దేవీప్రసాద్ రావు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.[3] దేవీప్రసాద్ రావును 2017 జూన్లో తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన 2017 జూన్ 16న ఛైర్మన్‌గా పదవి బాధ్యతలు స్వీకరించాడు.[4]
మూలాలు
మార్చు- ↑ Sakshi (26 October 2014). "ఉద్యోగుల విభజనపై కేంద్రం ఆలస్యం చేస్తోంది: దేవీప్రసాద్". Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
- ↑ Sakshi (26 February 2015). "హైదరాబాద్‌లో దేవీప్రసాద్.. నల్లగొండలో పల్లా". Sakshi. Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
- ↑ The New Indian Express (23 February 2015). "TRS Fields Deviprasad in MLC Polls". Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
- ↑ Sakshi (17 June 2017). "ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ". Sakshi. Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.