మైనంపల్లి హన్మంతరావు

మైనంపల్లి హన్మంతరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అంతకు ముందు రామాయంపేట, మెదక్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేసి,[2][3] 2018లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

మైనంపల్లి హన్మంతరావు
మైనంపల్లి హన్మంతరావు

మైనంపల్లి హన్మంతరావు


శాసనసభ్యుడు
పదవీ కాలం
2018–2023
ముందు కనకా రెడ్డి
నియోజకవర్గం మల్కాజ్‌గిరి

వ్యక్తిగత వివరాలు

జననం (1966-01-10) 1966 జనవరి 10 (వయసు 58)
కొరివిపల్లి (శంకరంపేట (ఆర్) మండలం) , మెదక్ జిల్లా
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి (2014-2023), తెలుగుదేశం పార్టీ (2014 వరకు)
తల్లిదండ్రులు కిషన్ రావు, సరోజినీ
జీవిత భాగస్వామి వాణి[1]
సంతానం మైనంపల్లి రోహిత్, మైనంపల్లి శివాంక్
నివాసం అశోక బిల్డర్స్ , దూలపల్లి , మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా
మతం హిందూ

జననం, విద్యాభాస్యం మార్చు

మైనంపల్లి హన్మంతరావు తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా కొర్విపల్లి గ్రామంలో 1966 జనవరి 10న కిషన్ రావు, సరోజినీ దంపతులకు జన్మించాడు. ఆయన 1992లో యూ.ఎస్ లోని అలబామా యూనివర్సిటీ నుండి బిఎ పూర్తి చేశాడు.[5]

రాజకీయ జీవితం మార్చు

మైనంపల్లి హన్మంతరావు 1998లో తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2008 జరిగిన ఉప ఎన్నికలలో రామాయంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు . మైనంపల్లి హన్మంతరావు 2009 జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శశిధర్ రెడ్డిపై 21151 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన మెదక్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు.

తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హన్మంతరావు మల్కాజ్‌గిరి నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశించాడు, 2014లో ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ పొత్తుతో భాగంగా ఆయనకు టికెట్ దక్కకపోవడంతో 2014 ఏప్రిల్ 6న మైనంపల్లి హన్మంతరావు టీడీపీకి రాజీనామా చేశాడు.[6][7] ఆయన 2014 ఏప్రిల్ 8న కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో [8] హన్మంతరావు 2014 ఏప్రిల్ 8న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[9]

ఆయన 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సి.హెచ్. మల్లారెడ్డి పై 28371 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.ఆయన 2015 ఏప్రిల్ 21లో తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[10] ఆయన 2017లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[11] మైనంపల్లి హన్మంతరావు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్. రామచందర్ రావు పై 73698 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేగా గెలవడంతో 2018 డిసెంబరు 12న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు.

మైనంపల్లి హన్మంతరావు 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మల్కాజ్‌గిరి, కుమారుడు రోహిత్ కు మెదక్ సీట్లు డిమాండ్ చేయగా 2023 ఆగస్టు 21న బీఆర్ఎస్ పార్టీ ఒకటే టికెట్ కేటాయించడంతో దానికి మంత్రి హరీష్‌రావు కారణమని ఆయనపై తీవ్ర విమర్శలు చేయగా[12] ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా తీసుకొని ఆయనకు షోకాజ్ నోటీసులను జారీ చేసింది. మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి 2023 సెప్టెంబరు 22న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు.[13] ఆయన సెప్టెంబరు 28న ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[14]

మైనంపల్లి హన్మంతరావుకు కాంగ్రెస్ అధిష్టానం అక్టోబరు 15న 55 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేయగా ఆయనకు ఆ జాబితాలో మ‌ల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం దక్కింది.[15] ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు, ఆ తరువాత ఆయనను 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో 2024 మార్చి 31న మ‌ల్కాజ్‌గిరి లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ప్రకటించింది.[16]

మూలాలు మార్చు

  1. Andhrajyothy (14 November 2023). "భార్యలే ఐశ్వర్యవంతులు! టాప్‌లో ఓ మహిళా కాంగ్రెస్ అభ్యర్థి!". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  2. News18 (2018). "Malkajgiri Assembly constituency (Telangana): Full details, live and past results". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Namasthe Telangana (6 March 2021). "బండ చెరువు నాలా పనులను జీహెచ్‌ఎంసీకి అప్పగించాలి". Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  4. TV9 Telugu (2 November 2023). "టీడీపీ టూ కాంగ్రెస్.. వయా బీఆర్ఎస్.. మైనంపల్లి రాజకీయ ప్రస్థానం ఇదిగో." Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Suryaa (23 November 2018). "Graduated in 1992 but qualification is intermediate". suryaa. Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  6. The Hans India (6 April 2014). "Miffed TDP MLA Hanumantha Rao resigns" (in ఇంగ్లీష్). Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  7. Sakshi (6 April 2014). "టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  8. Sakshi (8 April 2014). "బాబుకు మైనంపల్లి.. మైనంపల్లికి కాంగ్రెస్.. షాక్". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  9. Sakshi (8 April 2014). "కారు ఎక్కిన మైనంపల్లి". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  10. Sakshi (21 April 2015). "టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షునిగా మైనంపల్లి". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  11. Sakshi (31 March 2017). "నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  12. Mana Telangana (21 August 2023). "హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి". Archived from the original on 22 September 2023. Retrieved 22 September 2023.
  13. Eenadu (22 September 2023). "భారాసకు మైనంపల్లి హన్మంతరావు రాజీనామా". Archived from the original on 22 September 2023. Retrieved 22 September 2023.
  14. V6 Velugu (28 September 2023). "కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం". Archived from the original on 28 September 2023. Retrieved 28 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  15. Sakshi (15 October 2023). "కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. లిస్ట్‌ ఇదే." Archived from the original on 15 October 2023. Retrieved 15 October 2023.
  16. Andhrajyothy (31 March 2024). "లోక్‌సభ నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను ప్రకటించిన కాంగ్రెస్.. హైదరాబాద్‌కు ఎవరంటే." Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.

వెలుపలి లంకెలు మార్చు