మాచాని సోమప్ప

భారతీయ పారిశ్రామికవేత్త

మాచాని సోమప్ప యెమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (YWCS) వ్యవస్థాపకుడు, యెమ్మిగనూరు అభివృద్ధికి నాంది వేసిన వ్యక్తి, పద్మశ్రీగ్రహీత.[1] ఆయన చేనేత సహకార పితామహుడు[2] ఆయన 1938లో స్థాపించిన వైడబ్ల్యూసిఎస్ సొసైటీ ద్వారా చేనేతలు వేసిన చేనేత బట్టలపై ఇందిరాగాంధీ, లాల్‌బహుదూర్ శాస్ర్తీ కూడా ప్రశంసించారు.[3][4]

మాచాని సోమప్ప
జననం1904
మరణం1978
వృత్తిసమాజ సేవకుడు, పారిశ్రామికవేత్త
పురస్కారాలుపద్మశ్రీ

జీవిత విశేషాలు మార్చు

మాచాని సోమప్ప భారతీయ పారిశ్రామికవేత్త, విద్యావేత్త, సమాజ సేవకులు, మాచాని సోమప్ప గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు.[5] ఆయనా 1904 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాకు చెందిన యెమ్మిగనూరు గ్రామంలో జన్మిచారు. 1934 లో కరువు వచ్చినప్పుడు ఆయన తన ప్రాంతంలోని చేనేత కార్మికులకు సహాయాన్నందించాడు.[6] ఆయన "యెమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ"ని స్థాపించారు.[7] in 1938.[8] ఆయన ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తూ ఉండేది. మాచాని సోమప్ప ఎమ్మిగనూరులో సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో నూలు మిల్లును స్థాపించి వెయ్యిమందికి ఉపాధి కల్పించారు. అలాగే చేనేత సహకార సంఘాన్ని స్థాపించి నాగలదిన్నె, కోసిగి, నందవరం, మంత్రాలయం, ఎమ్మిగనూరులలో ఉన్న 3వేల మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాడు. ఎమ్మిగనూరు సహకార సొసైటీ పేరున దేశంలో ఉన్న అన్నిపట్టణాల్లో దుకాణాలను తెరచి చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను విక్రయించి చేనేతలకు ఉపాధి కల్పించాడు. చేనేత రంగానికి వన్నె తెచ్చాడు. రెండు సంవత్సరాల అనంతరం ఆయన మాచాని గ్రూప్ ను ప్రారంభించారు. ఆ వ్యాపార గ్రూపు 1940 నుండి అభివృద్ధి చెందింది. ఆ సంస్థ ద్వారా ఇంజనీరింగ్, రవాణా, వ్యవసాయం, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, శక్తి, రిటైల్ బ్రాండ్స్ పై శ్రద్ధ వహించేది.[9][10] 1960లో ఆయన "స్టాంప్, షెడ్యూల్, సోమప్ప"ను జర్మన్ స్ప్రింగ్ ఉత్పత్తి కోసం స్థాపించారు.[11] ఆయన 1978లో మాచాని సోమప్ప ఇంగ్లీషు మీడియం హైస్కూలు స్థాపించి విద్యారంగంలో ప్రవేశించారు.[12]

తోళ్ల పరిశ్రమ, చెప్పుల పరిశ్రమ కూడా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి 200 మంది కార్మికులకు ఉపాధి చూపాడు. పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరికొంతమందికి ఉపాధి చూపాడు. ఎంజి.బ్రదర్స్ లారీ సర్వీస్ ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా ఎమ్మిగనూరు పేరును వ్యాపింపచేశాడు. సహకార సంఘాల ఆధ్వర్యంలో పరిశ్రమలు స్థాపించి వేల కుటుంబాలకు ఉపాధి కల్పించినందుకు కేంద్రప్రభుత్వం మాచాని సోమప్పకు పద్మశ్రీబిరుదు ఇచ్చింది. ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధికి ఆయన కృషి చేయడమేకాకుండా ఎమ్మిగనూరు కేంద్రంగా ఎన్నో పరిశ్రమలను స్థాపించి ఉపాధి కల్పించారు. అందువలన సోమప్ప ఎమ్మిగనూరు ప్రజల గుండెల్లో ఇప్పటికీ ఉన్నారు. నాలుగురోడ్ల కూడలిలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎమ్మిగనూరు ప్రజలు ప్రతిరోజు తలచుకుంటున్నారు.[13]

పురస్కారాలు మార్చు

భారత ప్రభుత్వం 1954లో ఆయనను పద్మశ్రీ పురస్కారాన్ని యిచ్చి గౌరవించింది.[14] ఆయన పద్మశ్రీ అవార్డు పొందిన ప్రథములు.

మూలాలు మార్చు

 1. చితికిన చేనేత బతుకులు!29/05/2013[permanent dead link]
 2. 5 కోట్ల చేనేత వస్త్రాల అమ్మకాలు 08/08/2012[permanent dead link]
 3. Karnool Rss Feed[permanent dead link]
 4. "జిల్లా చరిత్ర, eenadu.net". Archived from the original on 2016-06-02. Retrieved 2016-05-20.
 5. "Machani Group". Machani Group. 2015. Archived from the original on 2013-01-07. Retrieved March 31, 2015.
 6. "Root Vin". Root Vin. 2015. Archived from the original on 2016-05-03. Retrieved March 31, 2015.
 7. "YWCS" (PDF). Shodh Ganga. 2015. Archived from the original (PDF) on 2017-11-16. Retrieved March 31, 2015.
 8. "Brainly". Brainly. 23 February 2015. Retrieved March 30, 2015.
 9. "India Mart". India Mart. 2015. Retrieved March 31, 2015.
 10. "Somappa Bhavan". Machani Somappa Bhavan. 2015. Retrieved March 31, 2015.
 11. "SSS India". SSS India. 2015. Archived from the original on 2016-06-07. Retrieved March 31, 2015.
 12. "School". Machani Somappa English Medium High School. 2015. Archived from the original on 2016-03-04. Retrieved March 31, 2015.
 13. రాళ్లలో కలిసిన రాజాపురం! 25/05/2014[permanent dead link]
 14. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved November 11, 2014.

ఇతర లింకులు మార్చు