స్టూవర్టుపురం

(స్టువర్టుపురం నుండి దారిమార్పు చెందింది)

స్టూవర్టుపురం బాపట్ల జిల్లా బాపట్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

స్టూవర్టుపురం
—  గ్రామం  —
స్టూవర్టుపురం is located in Andhra Pradesh
స్టూవర్టుపురం
స్టూవర్టుపురం
అక్షాంశరేఖాంశాలు: 15°52′09″N 80°24′23″E / 15.869210°N 80.406483°E / 15.869210; 80.406483
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం బాపట్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర

మార్చు

ఇక్కడ గోరా గారి సంస్కరణ కేంద్రం ఉంది. 1914 లో సాల్వేషన్ ఆర్మీ అనే క్రైస్తవ సంస్థ ఇక్కడున్న ఎరుకల వారికి 1860 ఎకరాల మెట్ట పొలం పంపిణీ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం G.O.Ms.No.1200 REVENUE (Asn.V) DEPARTMENT Dated.18thOctober, 2008 ద్వారా ఈపూరుపాలెం వాడ మురుకొండపాడు గ్రామాల్లో ఉన్న 644 ఎకరాల భూమిని ఎరుకలవారికి ఇచ్చింది.

స్టూవర్టుపురం గ్రామం బ్రిటీష్ పరిపాలన కాలంలో నేరజాతుల చట్టానికి అనుగుణంగా ఏర్పాటుచేసిన సెటిల్మెంట్లలో ఒకటి. 1911 సంవత్సరం 3 నెంబర్ క్రిమినల్ ట్రైబ్స్ ఆక్టు సెక్షన్ 16 ప్రకారం ఈ ప్రాంతంలో బ్రిటీష్ వారు నేరజాతులుగా ముద్రవేసిన కొన్ని కుటుంబాలకు సెటిల్మెంటుగా ఏర్పరిచారు. బ్రిటీష్ కాలంలో ఆ చట్టం సదరు జాతుల్లో జన్మించిన వారికి జామీను తీసుకునే హక్కు కూడా ఇవ్వలేదు. ఆ చట్టంలోని సెక్షన్ 10బి ప్రకారం ఆయా జాతులవారు కుటుంబాలతో సహా ఎవరెవరు ఎక్కడ నివసిస్తున్నదీ, ఏయే ప్రాంతాలకు తమ నివాసాలు మార్చుకుంటున్నది, అందుకు గల కారణాలు, వారి కొత్త నివాసాలు స్థానిక పోలీసు అధికారులకు తెలియజేయాల్సివుండేది. చివరకు వారు ఊరు విడిచి కొద్దిరోజులు వెళ్ళాలన్నా ఆ గైర్హాజరు సమయానికి ముందుగా తెలియపరిచి అనుమతి పొందాల్సివుండేది. ఈ అతికఠినమైన చట్టాన్ని అమలుచేసేందుకు ఏర్పరిచిన సెటిల్మెంట్లలో ఇదీ ఒకటి.[1]

గ్రామ భౌగోళికం

మార్చు

ఈ గ్రామం బాపట్ల - చీరాల మధ్య వెదుళ్ళపల్లి దగ్గరలో వుంటుంది.

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

మార్చు
  • రాగాల వెంకటరాహుల్ - ప్రముఖ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు
  • ఈ గ్రామానికి చెందిన శ్రీమతి నీలిమ & శ్రీ మధు ఇతడి తల్లిదండ్రులు. ఇతడు ప్రస్తుతం పూణేలో జరుగుచున్న కామన్ వెల్త్ యూత్, సీనియర్, జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో, పతకాలు సాధించాడు. 85 కిలోల జూనియర్స్ విభాగంలో 327 కిలోల బరువునెత్తి సరికొత్త రికార్డు సృష్టించాడు. సీనియర్స్ విభాగంలో అంతే బరువునెత్తి రజత పతకం స్వంతం చేసుకున్నాడు. కామన్ వెల్త్ యూత్, జూనియర్, సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఇతడు ఉత్తమ లిఫ్టరుగా నిలిచాడు. జూనియర్ విభాగంలో మీట్ రికార్డ్ సృష్టించి, అత్యుత్తమ లిఫ్టర్ అవార్డ్ స్వంతం చేసుకున్నాడు.
  • రాగాల వరుణ్ - ఇతడు రాహుల్ కి స్వయానా తమ్ముడు. అన్నకు వలె ఇతడు గూడా వెయిట్ లిఫ్టింగ్ లో రాణించుచున్నాడు. ఏడవ తరగతి నుండి తండ్రి శిక్షణలో సాధన చేయుచూ, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలలో తన ప్రతిభతో విజయం సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనాడు. అక్కడ సత్తా చాటి రజతపతకాన్ని గెలుచుకున్నాడు. ఈ విజయాలతో హైదరాబాదులోని హకీంపేట క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందినాడు. గత 3 సంవత్సరలుగా అక్కడే చదువుచూ శిక్షణ తీసుకుంటున్నాడు. తాజాగా ఇతడు 2015, డిసెంబరు-25న విజయవాడలో నిర్వహించుచున్న జాతీయ స్కూల్ గేంస్ పోటీలలో పాల్గొంటాడు. 2016, ఫిబ్రవరిలో బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించు జాతీయ సబ్-జూనియర్, జూనియర్ పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించాడు. ఆ పోటీలలో పాల్గొన్న ఇతడు, 2016, ఫిబ్రవరి-24న ఒక స్వర్ణ పతకం, రెండు రజత పతకాలు సాధించాడు. ఇతడు ఇటీవల పంజాబు రాష్ట్రంలోని పాటియాలా నగరంలో నిర్వహించిన జాతీయ క్రీడా శిక్షణ సంస్థలో నిర్వహించిన జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో విజేతగా నిలిచి, మూడు అంతర్జాతీయస్థాయి పోటీలలో పాల్గొనడానికి ఎంపికైనాడు. 2016, అక్టోబరు-19 నుండి 28 వరకు, మలేషియా దేశంలోని కౌలాలంపూర్ నగరంలో నిర్వహించు ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలోనూ, కామన్ వెల్త్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలోనూ ఇతడు మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించెదడు. ఇంతేగాక, 2016, నవంబరులో జపాను దేశంలో నిర్వహించు ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలోనూ పాల్గొంటాడు. 2016, అక్టోబరు-24న మలేషియా దేశంలోని పెనాంగ్ పట్టణంలో నిర్వహించిన కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలఓ 69 కిలోగ్రాముల విభాగంలో, ఇతడు మూడు రజతపతకాలు సాధించాడు.

మూలాలు

మార్చు
  1. "Wayback Machine" (PDF). web.archive.org. 2016-03-04. Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2022-09-23.