ఎర్రబాలెం గుంటూరు జిల్లా, మంగళగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఎర్రబాలెo
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం మంగళగిరి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522503
ఎస్.టి.డి కోడ్ 08645

గ్రామ చరిత్ర మార్చు

సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.మంగళగిరి మండలం లోని కురగల్లు దాని పరిధిలోని హామ్లెట్స్, కృష్ణాయపాలెం. నవులూరు(గ్రామీణ) దాని పరిధిలోని హామ్లెట్స్, నిడమర్రు, యర్రబాలెం, బేతపూడి గ్రామాలు ఉన్నాయి.

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామంలోని విద్యా సౌకర్యములు మార్చు

డాన్ బాస్కో ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల విద్యార్థి, డి.రాజు, 2014, సెప్టెంబరు-23న పశ్చిమగోదావరి జిల్లాలోని గోపన్నపాలెంలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో గుంటూరు జిల్లా జట్టు తరఫున పాల్గొనగా, జిల్లా జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ పోటీలలో ప్రతిభ కనబరచిన డి.రాజు, త్వరలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ జట్టుకి ఎంపికైనాడు.

గ్రామములోని మౌలిక సదుపాయాలు మార్చు

త్రాగునీటి సౌకర్యం మార్చు

రక్షిత మంచినీటి పథకం:- ఈ పథకం గ్రామములోని శ్రీనగర్ కాలనీలో ఉంది.

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో బొడ్డు వెంకటప్పయ్య, సర్పంచిగా ఎన్నికైనాడు. ఆకుల వెంకట బిక్ష్యం ఈ ఊరి మొదటి సర్పంచ్

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ విశ్వేశ్వరస్వామి ఆలయం:- ఈ ఆలయ ఆవరణలో, గ్రామస్థుల సహకారంతో నిర్మించిన కల్యాణమండపాన్ని, 2014,డిసెంబరు-11వ తేదీ గురువారం నాడు ప్రారంభించారు.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

మేకప్‌శాస్త్రి మార్చు

యర్రబాలెంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన వీరు, చలనచిత్రరంగంలో నటులకూ, నాటకరంగంలో అనేకమంది ప్రముఖ కళాకారులకు మేకప్ వేసినారు. ఆ వృత్తి మానివేసిన తరువాత, సమాచార హక్కు చట్టం కార్యకర్తగా ప్రభుత్వ విభాగాలలోని లొసుగులను ప్రశ్నించారు. వీరు 2017,మే-31న తన స్వగృహంలో కన్నుమూసారు.

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామానికి చెందిన రావుల అమృతాచారి, 2015,అక్టోబరు, 9,10,11 తేదీలలో, ఆంధ్రకళా సమితి ఆధ్వర్యంలో, కర్నాటక రాష్ట్రంలోని బళ్ళారి, హొసపేట, బెంగళూరులలో జానపద సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని కర్నాటక తెలుగు సంఘం వారు ఘనంగా సన్మానించారు.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఎర్రబాలెo&oldid=3574687" నుండి వెలికితీశారు