నవులూరు (గ్రామీణ)
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
నవులూరు, గుంటూరు జిల్లా, మంగళగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. మంగళగిరి పట్టణంలో భాగంగా కలిసిపోయిన గ్రామం ఇది. మంగళగిరి పట్టణ శివారు (ఔట్‌గ్రోత్) గా దీన్ని పరిగణిస్తారు.
నవులూరు (గ్రామీణ) | |
— రెవెన్యూయేతర గ్రామం (మంగళగిరి పట్టణ శివారు) — | |
అక్షాంశరేఖాంశాలు: 16°26′41″N 80°32′58″E / 16.444798°N 80.549401°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | మంగళగిరి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ బాణావత్ బాలాజీ నాయక్ |
జనాభా (2011) | |
- మొత్తం | 24,861 |
- పురుషుల సంఖ్య | 12,431 |
- స్త్రీల సంఖ్య | 12,430 |
- గృహాల సంఖ్య | 6,638 |
పిన్ కోడ్ | 522503 |
ఎస్.టి.డి కోడ్ | 08645 |
గ్రామ చరిత్ర
మార్చుసీఆర్డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి మండలం లోని కురగల్లు దాని పరిధిలోని హామ్లెట్స్, కృష్ణాయపాలెం. నవులూరు(గ్రామీణ) దాని పరిధిలోని హామ్లెట్స్, నిడమర్రు, యర్రబాలెం, బేతపూడి గ్రామాలు ఉన్నాయి.
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
మార్చుతాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
సమీప గ్రామాలు
మార్చుకురగల్లు 3 కి.మీ, నిడమర్రు 4 కి.మీ, పెనుమాక 5 కి.మీ, నీరుకొండ 6 కి.మీ, చినకాకాని 6 కి.మీ.
గ్రామంలో మౌలిక వసతులు
మార్చుషారోన్ వెల్ఫేర్ సొసైటీ అనాథబాలల ఆశ్రమం.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో బాణావత్ బాలాజీ నాయక్, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ గంగానమ్మ తల్లి, పోతురాజుస్వామి వారల ఆలయం
మార్చు- ఈ ఆలయంలో, విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2015,ఫిబ్రవరి-8, ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు.
- ఈ ఆలయ పునఃప్రతిష్ఠానంతర ప్రథమ వార్షికోత్సవాన్ని, 2016,ఫిబ్రవరి-26వ తేదీ శుక్రవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామివారి దేవస్థానం
మార్చుఈ ఆలయంలో శ్రీ అయ్యప్పస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, 2015,ఫిబ్రవరి-11వ తేదీ బుధవారం నిర్వహించెదరు. పదునెట్టంబడి శిఖర మహోత్సవం, విఘ్నేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, మాలికవురత్తమ్మ విగ్రహ ప్రతిష్ఠలు గూడా నిర్వహించెదరు.
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధరిత వృత్తులు
గణాంకాలు
మార్చు2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 18,702. ఇందులో పురుషుల సంఖ్య 9,450, స్త్రీల సంఖ్య 9,252, గ్రామంలో నివాస గృహాలు 4,417 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 955 హెక్టారులు.