మరాఠి సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో జడ్చర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[3]

ఎం. సత్యనారాయణ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 1996
ముందు సుధాకర్‌రెడ్డి
తరువాత ఎర్ర శేఖర్‌
నియోజకవర్గం జడ్చర్ల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1965
పెద్దచింతకుంట, ధన్వాడ మండలం, (ప్రస్తుతం మరికల్ మండలం), నారాయణపేట జిల్లా, తెలంగాణ[1]
మరణం 1996[2]
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
బంధువులు ఎర్ర శేఖర్‌ (సోదరుడు)
నివాసం జడ్చర్ల

రాజకీయ జీవితం మార్చు

ఎర్ర సత్యం తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి తొలిసారి టీడీపీ పార్టీ తరపున 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి నర్సప్పపై 53,779 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

మరణం మార్చు

ఎర్ర సత్యం 1996 ఆగస్టు 12లో జడ్చర్ల నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఓ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో జి. మాధవ్ రెడ్డి అనే మాజీ పోలీస్ కానిస్టేబుల్ ఆయనను కాల్చి చంపాడు, దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.[5]

మూలాలు మార్చు

  1. Eenadu (25 October 2023). "ప్రజాప్రతినిధుల వాడ.. ధన్వాడ". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  2. The Hindu (5 January 2011). "Close associates turn killers" (in Indian English). Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
  3. Sakshi (24 November 2018). "జడ్చర్లలో రికార్డు సత్యం..!". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
  4. Sakshi (6 April 2014). "రెండు సార్లు ఓకే మూడోసారి డౌటే". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
  5. Sakshi (23 September 2017). "ఎర్ర సత్యం హత్య". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.