ఎర్ర శేఖర్
ఎం.చంద్రశేఖర్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను 1967, జూన్ 24 న జన్మించాడు.[2] సోదరుడు ఎర్రసత్యం మరణానంతరం జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎన్నికైనాడు.[3]
ఎర్ర శేఖర్ | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1996 - 2004 2009 - 2014 | |||
నియోజకవర్గం | జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1968 పెద్దచింతకుంట, ధన్వాడ మండలం, (ప్రస్తుతం మరికల్ మండలం), నారాయణపేట జిల్లా, తెలంగాణ[1] | ||
రాజకీయ పార్టీ | బీఆర్ఎస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ బీజేపీ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | భవాని | ||
సంతానం | ఒక కుమారుడు |
రాజకీయ జీవనం
మార్చుఎర్రశేఖర్గా పిలువబడే చంద్రశేఖర్ తొలిసారిగా సోదరుడు ఎర్ర సత్యం[4] మరణంతో ఖాళీ అయిన జడ్చర్ల స్థానం నుంచి 1996 ఉపఎన్నికలలో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు. ఆ తర్వాత 1999లో కూడా విజయం సాధించి వరుసగా రెండో సారి శాసనసభలో అడుగుపెట్టాడు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి చేతిలో ఓడిపోగా, 2008 ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిపై పోటీచేసి పరాజయం పొందినాడు. 2009 ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి మల్లు రవిపై విజయం సాధించి మూడవసారి శాసనసభలో ప్రవేశించాడు.[5]
ఎర్ర శేఖర్ తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీడీపీ ప్రాభవం కోల్పోవడంతో చాలా కాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉండి బీజేపీలో చేరాడు. అయన ఆ తరువాత మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి బీజేపీకి గుడ్ బై చెప్పి 2020 డిసెంబరు 20న[6][7], గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో 2022 జూలై 7న కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[8] 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ కోసం పనిచేసినప్పటికీ తగిన గుర్తింపు లభించడంలేదని 2023 అక్టోబరు 29న కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[9][10][11]
మూలాలు
మార్చు- ↑ Eenadu (25 October 2023). "ప్రజాప్రతినిధుల వాడ.. ధన్వాడ". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ సూర్య దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-05-2009
- ↑ Eenadu (12 November 2023). "అసెంబ్లీలో.. అన్నదమ్ములు". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
- ↑ ETV Bharat News (13 May 2022). "సోదరుడి హత్య కేసులో మాజీ ఎమ్మెల్యేను నిర్దోషిగా తేల్చిన కోర్టు". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ Sakshi (14 July 2021). "ఆది నుంచీ అంతే: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో జోష్!". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
- ↑ TV9 Telugu (20 December 2020). "బీజేపీకి షాక్... మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాజీనామా..." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ News18 తెలుగు (20 December 2020). "బండి సంజయ్ పర్యటన.. బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్ రాజీనామా". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "erra shekhar joins congress". Vaartha. 7 July 2022. Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ Mana Telangana (29 October 2023). "జడ్చర్లలో కాంగ్రెస్కు షాక్.. బిఆర్ఎస్లో చేరిన ఎర్రశేఖర్". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ Andhrajyothy (30 October 2023). "బీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్ర శేఖర్, పి.చంద్ర శేఖర్". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.
- ↑ Namasthe Telangana (30 October 2023). "బీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్ర శేఖర్". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.