ఎలిమినేటి కృష్ణారెడ్డి

ఎలిమినేటి కృష్ణారెడ్డి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు.[1]

ఎలిమినేటి కృష్ణారెడ్డి
ఎలిమినేటి కృష్ణారెడ్డి


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2017 మార్చి 30 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1936-11-22) 1936 నవంబరు 22 (వయసు 88)
వడపర్తి, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు నర్సిరెడ్డి, లక్ష్మమ్మ
జీవిత భాగస్వామి కౌసల్య
సంతానం ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

జీవిత విషయాలు

మార్చు

కృష్ణారెడ్డి 1936, నవంబరు 22న నర్సిరెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలంలోని వడపర్తి పట్టణంలో జన్మించాడు.[2] ఇతని తమ్ముడు ఎలిమినేటి మాధవ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుండి వివిధ మంత్రిత్వ శాఖలలో పనిచేసాడు.[3] మరియాలలో జెడ్‌పిహెచ్‌ఎస్ నుండి ఎస్‌ఎస్‌సి పూర్తిచేశాడు. బిఏ, బిఎడ్ వరకు చదువుకున్న కృష్ణారెడ్డి, వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు.

వ్యక్తిగత వివరాలు

మార్చు

కృష్ణారెడ్డికి కౌసల్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు.

రాజకీయరంగం

మార్చు

తెలంగాణ రాష్ట్ర సమతి పార్టీలో చేరిన కృష్ణారెడ్డి జిల్లాలో ముఖ్యనేతగా ఎదిగాడు. టిఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గా కూడా కొంతకాలం పనిచేశాడు.[4] 2017, మార్చి 30న శాసన సభ్యుల కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]

ఇతర వివరాలు

మార్చు

హాంకాంగ్, నేపాల్, సింగపూర్, థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలలో పర్యటించాడు.

మూలాలు

మార్చు
  1. ఈనాడు, జిల్లా వార్తలు (31 July 2021). "పేదల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం". EENADU. Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.
  2. Telangana data, MLCs (29 September 2020). "Telangana Assembly Constituency MLC Alimineti Krishna Reddy". www.telanganadata.news. Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.
  3. "Telangana CM declares candidates for seven MLC seats, prefers defectors". The New Indian Express. Retrieved 2021-08-01.
  4. "TRS to contest all three MLC seats from MLAs quota". The Hindu (in Indian English). Special Correspondent. 2017-03-05. ISSN 0971-751X. Retrieved 2021-08-01.{{cite news}}: CS1 maint: others (link)
  5. Sakshi (31 March 2017). "నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.