విక్రమ్ గాంధీ

(ఎస్.ఎస్.విక్రమ్ గాంధీ నుండి దారిమార్పు చెందింది)

విక్రమ్ గాంధీ తెలుగు సినిమా దర్శకుడు.[1] విక్ర‌మ్ గాంధీ అస‌లు పేరు ఎస్ఎస్ శ్రీ‌నివాస గాంధీ. ఇండ‌స్ట్రీలో ఆయ‌న్ని అంద‌రూ విక్ర‌మ్ గాంధీ అంటుంటారు.[2]

విక్రమ్ గాంధీ

జీవిత విశేషాలు

మార్చు

ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లాలోని గన్నవరం. ఆయన అసిస్టెంట్ డైరక్టరుగా 100 సినిమాలకు పనిచేసారు.[3]

దర్శకునిగా

మార్చు

ఆయన శివాజీ హీరోగా నటించిన స్టేట్ రౌడీ, వేణుమాధవ్ హీరోగా నటించిన ప్రేమాభిషేకం (2008 సినిమా) చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు.[4] ఆ రెండు చిత్రాలు పరాజయం పాలు కావడంతో విక్రం కు సినిమాలు రాలేదు. అయితే అంతకుముందే దర్శకత్వ శాఖలో వందకు పైగా చిత్రాలకు పనిచేసాడు.[5]

గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న 45 ఏళ్ల విక్రమ్ గన్నవరం (కృష్ణా జిల్లా)లోని ఆయన నివాసంలో మే 11 2016 న తుదిశ్వాస విడిచారు.[6]

మూలాలు

మార్చు
  1. ప్రముఖ సినీ డైరెక్టర్ విక్రమ్ గాంధీ మృతి..[permanent dead link]
  2. ప్రేమాభిషేకం ఫేమ్ విక్ర‌మ్ గాంధీ కన్నుమూత‌..[permanent dead link]
  3. 'Premabhishekam' director Vikram Gandhi succumbs to cancer
  4. దర్శకుడు విక్రం గాంధీ ఇక లేరు
  5. డైరెక్టర్ విక్రం గాంధీ అస్తమయం[permanent dead link]
  6. "సినీ దర్శకుడు విక్రమ్‌గాంధీ కన్నుమూత". Archived from the original on 2016-05-12. Retrieved 2016-05-12.

ఇతర లింకులు

మార్చు