ఏక్తాభ్యాన్

భారతదేశానికిప్రాతినిధ్యంవహిస్తున్నపారాఅథ్లెట్

ఏక్తాభ్యాన్ (జననం 1985) ఇండియన్ విమెన్స్ క్లబ్, డిస్క్ త్రో ఈవెంట్లలో భారతదేశానికిప్రాతినిధ్యంవహిస్తున్నపారాఅథ్లెట్.[1][2]2018 లో ఇండోనేషియాలోనిజకార్తాలోజరిగినఆసియాపారాగేమ్స్‌లో భారత దేశానికి ప్రాతినిద్యం వహించిన ఆమె క్లబ్ త్రో ఈవెంట్‌లోబంగారుపతకం సాధించింది. 2017లో లండన్‌లో అలాగే 2019లో దుబాయ్‌లో జరిగిన వరల్డ్ పారాఅథ్లెటిక్  ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న ఆమె 2020 టోక్యో ఒలంపిక్స్‌‌కు కూడా అర్హత సాధించింది.  ఆమె 2016 లోబెర్లిన్, 2017 లోదుబాయ్ ,2018లో ట్యునీషియాలోజరిగిన వివిధ ఐపిసిగ్రాండ్ పిక్స్‌ పోటీల్లో పతకాలు సాధించింది.

ఏక్తాభ్యాన్
వ్యక్తిగత సమాచారం
జన్మనామంఏక్తాభ్యాన్
జననం (1985-06-07) 1985 జూన్ 7 (వయసు 39)
హిస్సార్, హర్యానా, భారతదేశం
నివాసంహిస్సార్, హర్యానా,భారతదేశం
క్రీడ
దేశం భారతదేశం
క్రీడట్రాక్&ఫీల్డ్ F-51
అంగ వైకల్యంక్వాడ్రిప్లెజిక్ స్పైనల్ కార్డ్ ఇంజూరీ
వైకల్యం తరగతిF-51
పోటీ(లు)క్లబ్ & డిస్క్ త్రో
సాధించినవి, పతకాలు
పారాలింపిక్ ఫైనళ్ళుప్రాతినిధ్యం వహించారు

2016, 2017, 2018 నేషనల్ పారాఅథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లోబంగారుపతకం సాధించిన భ్యాన్ జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ఆమె 2018 లోవికలాంగులలో సాధికారత సాధించినందుకుగానూ  జాతీయ అవార్డును, 2019మహిళా దినోత్సవం సందర్భంగా హరియాణా గవర్నర్ చేతుల మీదుగా రాష్ట్ర అవార్డును అందుకుంది.

పారా ఛాంపియన్ ప్రోగ్రాం ద్వారా ఆమెకు గోస్పోర్ట్స్ ఫౌండేషన్ మద్దతు ఇస్తోంది. [3]

వ్యక్తిగత జీవితం, నేపథ్యం

మార్చు

ఏక్తా 1985 లో హరియాణా లో జన్మించింది. తండ్రి బల్జీత్ ఏక్తా హిస్సార్ జిల్లాలో హార్టీ కల్చర్ ఆఫీసర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆమెకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు.[4] 2003లో రోడ్డు ప్రమాదానికి గురయ్యంది ఏక్తా. ఆ  ప్రమాదంలో ఆమె వెన్నుపూస తీవ్రంగా దెబ్బతింది. ఆమె ఆసుపత్రిలో తొమ్మిదినెలలు గడపాల్సి వచ్చింది.రెండు ఆపరేషన్లు జరిగిన తర్వాత వాటి నుంచి కోలుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆపై కొంత వరకు ఆత్మ విశ్వాసాన్ని సాధించింది.

వ్యక్తిగత జీవితం:

మార్చు

హిస్సార్‌లో ఏక్తా తన డిగ్రీని పూర్తి చేసింది. 2011 లో,ఆమె హరియాణా సివిల్ సర్వీసెస్ పరీక్షను క్లియర్ చేసి అసిస్టెంట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్‌గా చేరింది. [4] 2015 లో, ఆమెఅథ్లెట్అమిత్ సరోహ్‌ను కలుసుకున్నారు. ఆయన్ను కలిసిన తర్వాత ఆయనలాగే తాను కూడా పారా అథ్లెట్ కావాలనుకున్నారు భ్యాన్. ఆమె డిస్క్ త్రో ఈవెంట్స్‌లోశిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. [3]

వృత్తిపరమైనవిజయాలు

మార్చు

జూలైలో బెర్లిన్‌లో జరిగిన 2016 ఐపిసిగ్రాండ్ పిక్స్‌తో ఏక్తా తన కెరియర్‌ను ప్రారంభించింది.అక్కడ ఆమె క్లబ్ త్రోలో సిల్వర్ పతకాన్నిసాధించింది. ఆమె పంచకులాలో జరిగిన 2016 నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లోపాల్గొన్నారు. అక్కడ క్లబ్‌ త్రోలో బంగారుపతకాన్ని, డిస్క్ త్రోలో కాంస్యపతకాన్ని  సాధించింది. 2017 లో, ఆమెజాతీయఛాంపియన్‌షిప్‌లో రెండవ సారి పోటీ పడి రెండు ఈవెంట్లలోనూ బంగారు పతకాన్నిసాధించింది. దుబాయ్‌లోజరిగిన 2017 ఐపిసిగ్రాండ్ పిక్స్‌లో కూడా ఆమె పోటీ చేసింది. ఆమె మొత్తం మీద 4 వస్థానంలో నిలిచింది. రెండు ఈవెంట్లలోనూ కొత్త ఆసియా రికార్డు సృష్టించింది.  అదే ఏడాది ఏక్తా లండన్‌లో జరిగిన జరిగిన తన మొదటి ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లోకూడా పాల్గొనింది. ఆ పోటీల్లో క్లబ్‌ త్రోలో ఆమె అంతర్జాతీయంగా 6 వస్థానంలో నిలవగా, ఆసియాలో మొదటి స్థానంలో నిలిచింది. [3] అప్పటికే నేషనల్ ఛాంపియన్‌గా ఉన్న ఏక్తా 2018 లో పంచకులాలో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకం సాధించింది.  ఆ ఏడాది , ఇండోనేషియాలోని జకర్తాలో అక్టోబర్‌లో జరిగిన 2018 ఆసియా పారాక్రీడలపై ఆమె దృష్టి నిలిపింది. అలా ఆ ఏడాది మొత్తం రాబోయే పోటీలకు సిద్ధమయ్యే పనిలోనే ఉంది ఏక్త. ఆపై ట్యునీషియాలో 2018లో జరిగిన ఐపీసీ గ్రాండ్ పిక్స్‌లో క్లబ్‌ త్రోలో స్వర్ణం, డిస్క్ త్రోలో కాంస్యం సాధించింది.

2018అక్టోబర్లో, కౌలాలంపూర్‌లోజరిగినమహిళల క్లబ్‌త్రో ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచి ఆసియా పారా గేమ్స్‌లోనూ ఏక్తా భారత దేశానికి నాల్గవ స్వర్ణాన్ని సాధించి పెట్టింది. ఆమె తన నాల్గవ ప్రయత్నంలో యుఏఈకి చెందిన అల్కబీ థెక్రాపై విజయం సాధించింది. ఈ ఈవెంట్లో ఏక్తా 16.02 మీ విసరగా ఆమె ప్రత్యర్థి 15.75 మీ. దూరం మాత్రమే విసరగల్గారు. అలా ఆసియాపారాగేమ్స్‌లో స్వర్ణం సాధించిన రెండవ భారతీయ మహిళగా, హరియాణా రాష్ట్రం నుంచి మొదటి మహిళగా రికార్డు సృష్టించింది. ఏక్తా ప్రస్తుతం హరియాణా  ప్రభుత్వంలో ఎంప్లాయిమెంట్ అధికారిగా పని చేస్తుంది. [1]ఆమె 2020 స్పోర్ట్స్ స్టార్ ఏసెస్ అవార్డుల్లో  పారా స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.[5]2018 సంవత్సరానికి గానూ ఈఎస్పీఎన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అథ్లెట్ ఆఫ్‌ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యింది.[6]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Akundi, Sweta (2018-07-16). "Gold-winning para-athlete Ekta Bhyan on life and sports". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-20.
  2. "From Being Paralysed To Winning Medals At World Para Athletics GP - Ekta Bhyan Is Full Of Heart". IndiaTimes (in Indian English). 2018-07-14. Retrieved 2021-02-20.
  3. 3.0 3.1 3.2 "Ankur Dhama". www.indusind.com. Archived from the original on 2018-11-06. Retrieved 2021-02-20.
  4. 4.0 4.1 Sep 15, Sukhbir Siwach / TNN / Updated:; 2016; Ist, 07:12. "deepa ekta bhyan: Before Deepa, Ekta Bhyan had made state proud | Chandigarh News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-20. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  5. Senthil, Anjana. "Ekta Bhyan wins Sportstar Aces 2020 Sportswoman of the Year (Parasports)". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2021-02-20.
  6. "'Nothing can stop you' - The remarkable tale of Ekta Bhyan". ESPN (in ఇంగ్లీష్). 2019-04-05. Retrieved 2021-02-20.