ఏడడుగుల అనుబంధం

ఏడడుగుల అనుబంధం
(1979 తెలుగు సినిమా)
Edadugula Anubandham (1979).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం లక్ష్మీదీపక్
కథ మద్దిపట్ల సూరి
తారాగణం నారాయణరావు,
జయసుధ,
ఫటాఫట్ జయలక్ష్మి
సంగీతం చక్రవర్తి
సంభాషణలు మద్దిపట్ల సూరి
నిర్మాణ సంస్థ బాబు ఇంటర్నేషనల్
భాష తెలుగు

కథసవరించు

రాజారామేశ్వరప్రసాద్ ప్రేమకు మాత్రమే జమీందారు. పరువుకు ప్రాకులాడే మంచిమనిషి. ఆస్తి అంతా, ఆఖరుకు నివాసముంటున్న భవనం కూడా తనఖాలో ఉంటుంది. కూతురు రమకు గొప్పింటి సంబంధం వస్తుంది. కట్నం, కానుకల కోసం, ఖర్చుల కోసం లక్ష రూపాయలు కావలసి వస్తుంది. రామేశ్వరప్రసాద్ తన కొడుకు రఘును పిలిచి కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించి, అతనికి గల బరువు బాధ్యతలను తెలియజేస్తాడు. రమ పెళ్లి జరగాలంటే ముందు రఘు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అంతకు మునుపే రజని అనే అమ్మాయిని మనసా, వాచా ప్రేమించిన రఘు బరువుబాధ్యతల పేరుతో చదువు సంస్కారం ఉన్న పెద్దింటి అమ్మాయి లక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లయితే చేసుకుంటాడు కాని లక్ష్మిని తాకనయినా తాకడు. లక్ష్మి నగలు, తెచ్చిన కట్నం పుణ్యమా అని రమ పెళ్లి జరిగిపోతుంది. రఘుకు ఉద్యోగం రాగానే భార్యకు చెప్పకుండానే వెళ్లిపోతాడు. అక్కడ రజనిని కలుసుకుంటాడు. లక్ష్మి అత్తమామల కోసం ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఒక రోజు రఘు హటాత్తుగా వచ్చి విడాకుల పత్రంపై సంతకం చేయించుకుని వెళ్లిపోతాడు. రజనిని రిజిస్టర్ వివాహం చేసుకుంటాడు. తన భర్త తన చిన్ననాటి స్నేహితురాలి భర్తే అని తెలుసుకున్న రజని కుమిలిపోతుంది.[1]

నటీనటులుసవరించు

సాంకేతిక వర్గంసవరించు

 
దర్శకుడు లక్ష్మీదీపక్

మూలాలుసవరించు

  1. వెంకట్రావ్ (10 April 1979). "చిత్రసమీక్ష - ఏడడుగుల అనుబంధం". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 9. Retrieved 13 December 2017.[permanent dead link]

బయటి లింకులుసవరించు