మద్దిపట్ల సూరి

మద్దిపట్ల సూరి ( జులై 7, 1916 - నవంబర్ 19, 1995) రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. 1993 లో సాహిత్య అకాడమీ అనువాద బహుమతి తో వీరిని సత్కరించారు.

మద్దిపట్ల సూరి
Maddipatla suri.png
జననంసూరిశాస్త్రి
జులై 7, 1916
అమృతలూరు
మరణంనవంబర్ 19, 1995
నివాస ప్రాంతంఅమృతలూరు
ఇతర పేర్లుమద్దిపట్ల సూరిశాస్త్రి
వృత్తిరచయిత
ప్రసిద్ధిప్రముఖ అనువాదకుడు, సాహితీవేత్త, రచయిత,

జీవిత సంగ్రహంసవరించు

అనువాద కోవిదాగ్రణిగా ప్రసిద్ధులయిన “మద్దిపట్ల సూరి” తెనాలి సమీపంలో సంస్కృతాంధ్రవిద్యలకి ఆటపట్టయిన అమృతలూరులో జులై 7, 1920నాడు జన్మించారు. అనేక సుప్రసిద్ధ నవలలు బెంగాలీ, హిందీ భాషలనుండి తెలుగులోకి స్వతంత్ర నవలలు అనిపించేంత సహజంగా అనువాదాలు చేసి అనువాద కోవిదాగ్రణి అని పేరు పొందారు. దేశీ కవితామండలి ఆధ్వర్యంలో ప్రచురించిన శరత్ చంద్ర ఛటర్జీ నవలలు, దేవదేసు, పరిణీత అనువాదాలకు బొందలపాటి శివరామకృష్ణగారికి దోహదం చేసారు. చివరిదశలో ఉద్యోగం లేక, ధనాభావంవల్ల కొంతమంది ప్రసిద్ధులకు కొన్ని ప్రసిద్ధ రచనలు రాసి పెట్టారు. మాధవపెద్ది గోఖలే సూరిగారిని చిత్రరంగంలో ప్రవేశపెట్టేరు 1958లో. ప్రముఖ నటుడు యం. ప్రభాకరరెడ్డి, సూరి మిత్రులయినతరువాత అనేక చిత్రాలలో పని చేసేరు. ప్రభాకరరెడ్డి సూరిగారికి అనేకసందర్భాలలో ఆర్థిక సహాయం చేసారు. ఇటీవల “”సమరేశ్ బసు”” మహాభారత కథాకల్పన శాంబుడు, “”విభూతిభూషణ్ బందోపాధ్యాయ”” చరిత్రాత్మక రచన పథేర్ పాంచాలి నవలలకు ఆయన చేసిన అనువాదాలు పునర్ముద్రిస్తున్నారు. “”విశ్వవాణి””కోసం నిమ్నవర్గాల సముద్ధరణకు కులరాహిత్యాన్ని ప్రబోధించే జీవనలీల గ్రంథాన్ని 1959 లో రాసారు. నవంబరు 19, 1995 తేదీన సూరి మరణించారు.

విద్యసవరించు

అన్నగారూ వ్యాకరణశిరోమణీ అయిన రామవరపు కృష్యమూర్తిశాస్త్రిగారివద్ద శ్రౌతస్మార్తాలను చెప్పుకున్నారు. ఉన్నత పాఠశాల చదువు నచ్చక, కలకత్తా వెళ్ళి బెంగాలీల చలిత్ భాషను, గౌడుల సంస్కృతాంధ్ర గ్రంథాలను, అలంకారశాస్త్రము అధ్యయనం చేసారు. అక్కడే జుగాంతర్ ప్రభావంమూలాన ఆధునిక భావజాలానికి లోనై, పుట్టుబిరుదు “శాస్త్రి”ని తొలగించి డిగ్రీలు లేని పాండిత్యంతో మద్దిపట్ల సూరిగా వెనక్కి వచ్చారు.

అనువాదాలుసవరించు

సూరిగారి అనువాదాలలో అధికభాగం సాహిత్య ఎకాడమీ పురస్కారాలు అందుకున్నవారి రచనలే. వారి శైలి సంస్కృతం వన్నెమీరిన వ్యావహారికం. రవీంద్రనాథ్ టాగోర్ 21 ప్రసిద్ధకథలకు సూరి అనువాదాలు రవీంద్ర కథావళ అన్నపేరుతో 1968 లో ప్రచురించారు. ఈ సంకలనానికి సోమనాత మిత్ర అవిస్మరణీయమైన పీఠిక, ఈ అనువాదాలు సుప్రసిద్ధమయినవి. బి.యస్.ఆర్ ఈ పుస్తకానికి సమీక్ష రాస్తూ, “పోస్ట్ మాస్టర్, కాబూలీవాలా అనువాదాలను చదివి చెమ్మగిల్లని వారుండరు,” అని వ్యాఖ్యానించారు. సూరిగారి హాస్యప్రియత్వంగురించి ఏల్చూరి మురళీధరరావు ఇలా వ్యాఖ్యానించారు, “సూరిగారు సరస హాస్యప్రియులు. గంగూలీ & గంగూలీ అన్న కథలో వ్యాపారనష్టాలను పూడ్చుకోవటానికి కాళీమంత్రం అష్టోత్తరం రాయమని ఎవరో సలహా ఇస్తారు. మోసాలు అలవాటయిన గంగూలీ పన్నెండు నామావృత్తులతో ఒక రబ్బరుస్టాంపు చేయించి, దాన్ని తొమ్మిదిసార్లు కొట్టి దేవతకే టోపీవేద్దామనుకొంటాడు. మరొక కథలో రైలుప్రయాణంలో సంప్రదాయ కుటుంబపెద్ద తమతో ఒక నవయువకుడి పలకరింపు చొరవను సహింపలేకపోతాడు. రైల్లో వంటచేస్తుండగా కూతురి చీరకు నిప్పంటుకొంటే ఆ యువకుడు చూసి రక్షిస్తాడు. కుటుంబం వారంతా అతన్ని ఆదరిస్తారు. యువతీయువకులకు ప్రేమభావం అంకురిస్తుంది. రాత్రివేళ మాటలు కలుస్తాయి. అంతలో అతని స్టేషను వస్తుంది. హడావుడిగా దిగిపోతూ ఆమె వివరాలడుగుతాడు. ఆమె సమాధానం వినబడకుండానే రైలు కదిలిపోతుంటుంది. ఇంకో కథలో ఒక సంపన్న బ్రాహ్మణయువకుడు పెద్దలు కుదిర్చిన ఆధునికభావాల యువతి మల్లికను చేసుకొంటాడు. ఆమె అతని వేషభాషలను మార్చి, మాంసాహారం కూడా అలవాటుచేస్తుంది. ఎంత ప్రేమ చూపినా ఆమెను సంతృప్తిపరుపలేక అతను విహ్వలుడు కావటాన్ని ఎంతో రమ్యంగా చిత్రీకరిస్తారు.”

ఇతని కొన్ని అనువాద రచనలు:

సినిమారంగంలో కృషిసవరించు

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు